25.49 కి.మీ. మైలేజీ.. ఇన్నోవాను మించి ఫీచర్లు.. టయోటా కొత్త కారు వచ్చేసింది

భారతీయ కస్టమర్లకు బాగా ఇష్టమైన ఆటోమొబైల్ బ్రాండ్లలో టయోటా ఒకటి. కేవలం కొన్ని మోడళ్లతోనే ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లో మంచి పేరు సంపాదించుకుంది. క్వాలిస్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, ఎటియోస్ లివా వంటి మోడళ్లతో టయోటా ప్రజల మనసులలో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో టయోటా కామ్రీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2019 నుండి భారతదేశంలో లభిస్తున్న ఈ కారు మంచి అమ్మకాలను సాధిస్తోంది. ఇది ప్రీమియం విభాగంలో ఉన్నందున, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లకు పోటీ ఇస్తుంది.

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ ప్రీమియం హైబ్రిడ్ సెడాన్ కామ్రీలో కొత్త హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్ప్రింట్ ఎడిషన్‎ను విడుదల చేసింది. ఈ స్పోర్టియర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.48.50 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ కామ్రీ రెండు దశాబ్దాల సుదీర్ఘ చరిత్రకు, భారతదేశంలో దాని ప్రజాదరణకు నిదర్శనం. కొత్త స్టైలింగ్, ది బెస్ట్ పర్ఫామెన్స్‎తో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చింది.

Toyota Camry Hybrid Gets a New Sprint Edition with Sporty Upgrades

టయోటా కామ్రీ స్ప్రింట్ ఎడిషన్‌లో అతిపెద్ద ఆకర్షణ దాని డ్యుయల్-టోన్ ఎక్స్‌టీరియర్. కారు హుడ్, రూఫ్, ట్రంక్‌పై మ్యాట్ బ్లాక్ యాక్సెంట్‌లు ఉన్నాయి. కొత్త మ్యాట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా ఈ ప్రీమియం సెడాన్‌కు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టాయి. ఫ్రంట్, రియర్ బాడీ కిట్లు, అలాగే రియర్ స్పాయిలర్‌తో కూడిన ప్రత్యేక స్పోర్ట్స్ కిట్ కూడా ఇందులో చేర్చబడింది.

ఇవి కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. కామ్రీ మిగిలిన డిజైన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ముందు భాగంలో పెద్ద ట్రాపజోయిడల్ గ్రిల్, యు-ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సన్నని హెడ్‌ల్యాంప్‌లు కారుకు ఒక ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి. వెనుక భాగంలో సి-ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఉన్నాయి.

Toyota Camry Hybrid Gets a New Sprint Edition with Sporty Upgrades

ఈ కొత్త మోడల్ లోపల కూడా అనేక మార్పులు చేశారు. వెన్టిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, మెమరీతో కూడిన 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కారు లగ్జరీ స్థాయిని పెంచుతాయి. అప్‌డేట్ చేసిన 8.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7.0 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి.

9 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు వంటివి ఉన్నాయి. వెనుక సీట్లలో కూర్చునేవారికి కూడా రిక్లైన్, వెంటిలేషన్ ఫెసిలిటీలు ఉన్నాయి. డ్యుయల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి కూడా ఈ సెడాన్‌లో ఉన్నాయి.

Toyota Camry Hybrid Gets a New Sprint Edition with Sporty Upgrades

టయోటా కామ్రీ స్ప్రింట్ ఎడిషన్ టయోటా సేఫ్టీ సెన్స్ 3.0 అనే అడాస్ సూట్‌తో వస్తుంది. ఇందులో ప్రీ-కొలిషన్ సిస్టమ్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, ఆటోమేటిక్ హై బీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెడాన్‌లో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, వీఎస్సీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ పనోరమిక్ వ్యూ మోనిటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

టయోటా కామ్రీ 2.5 లీటర్ డైనమిక్ ఫోర్స్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ఫుల్ లిథియం-అయాన్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. ఇ-సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ సుమారు 230 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

టయోటా ఐదవ తరం హైబ్రిడ్ టెక్నాలజీతో, ఈ కారు లీటర్‌కు 25.49 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హైబ్రిడ్ బ్యాటరీపై టయోటా 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఇది కొనుగోలుదారులకు గొప్ప భరోసా ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 19, 2025, 10:37 [IST]
English summary
Toyota camry hybrid gets a new sprint edition with sporty upgrades
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+