సెలబ్రిటీలు కొనే కారు కొనాలని అనుకుంటున్నారా.. టయోటా ఫార్చ్యూనర్ పై ఏకంగా రూ.3.5 లక్షలు డౌన్!

మనం అవసరం ఉన్నా పెద్ద కారు కొనాలనుకున్నప్పుడు బడ్జెట్ చూసి వెనకడుగు వేస్తుంటాం. కానీ ఇప్పుడు టయోటా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం తర్వాత ఇకపై అలా ఆలోచించాల్సిన అవసరం రాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ విధానంతో టయోటా తన కార్ల ధరలను ఏకంగా రూ. 3.49 లక్షల వరకు తగ్గించింది. ఈ శుభవార్త పండుగ సీజన్‌కు ముందు ప్రజలకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. అసలు ఈ కొత్త జీఎస్టీ విధానం ఏంటి? ఏ కారుపై ఎంత ధర తగ్గిందో తెలుసుకుందాం.

భారత ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ 2.0 పేరుతో ఒక కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో చిన్న కార్లు, బైక్‌లు, ఇంకా ఎన్నో నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. కొన్ని లగ్జరీ వస్తువులపై మాత్రం పెంచింది. ఈ నిర్ణయం వల్ల వాహనాల ధరలు తగ్గనున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ టయోటా తన అన్ని కార్ల ధరలను భారీగా తగ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

Toyota car prices have dropped significantly See the full list of new prices here

టయోటా తన కార్ల ధరలను తగ్గించగా, ఇందులో అన్నింటికన్నా ఎక్కువ ప్రయోజనం ఫార్చ్యూనర్‌పై లభించింది. ఈ కారు ధర ఏకంగా రూ. 3.49 లక్షల వరకు తగ్గింది. ఫార్చ్యూనర్ లెజెండర్ ధర కూడా రూ. 3.34 లక్షల వరకు తగ్గింది. ఇది ఫార్చ్యూనర్ కొనాలనుకున్నవారికి ఒక నిజమైన బంపర్ ఆఫర్. అంతేకాకుండా, టయోటా హైలక్స్ ధర రూ. 2.52 లక్షలు, ప్రీమియం వెల్ఫైర్ కారు ధర రూ. 2.78 లక్షలు తగ్గాయి.

కేవలం లగ్జరీ కార్లే కాదు, మిగతా టయోటా మోడల్స్‌పై కూడా గణనీయంగా ధరలు తగ్గాయి. టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ. 1.80 లక్షల వరకు, ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 1.15 లక్షల వరకు తగ్గాయి. అదే విధంగా, గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 85,300 వరకు, టైసర్ ధర రూ. 1.11 లక్షల వరకు తగ్గగా, అర్బన్ క్రూజర్ హైరైడర్ ధర రూ. 65,400 వరకు తగ్గింది.

Toyota car prices have dropped significantly See the full list of new prices here
మోడల్ తగ్గిన ధర
గ్లాంజా రూ.85,300 వరకు
టైజర్ రూ.1,11,100 వరకు
రూమియన్ రూ.48,700 వరకు
హైరైడర్ రూ.65,400 వరకు
ఇన్నోవా క్రిస్టా రూ.1,80,600 వరకు
ఇన్నోవా హైక్రాస్ రూ.1,15,800 వరకు
ఫార్చ్యూనర్ రూ.3,49,000 వరకు
ఫార్చ్యూనర్ లెజెండర్ రూ.3,34,000 వరకు
హిలక్స్ రూ.2,52,700 వరకు
క్యామ్రీ రూ.1,01,800 వరకు

అతి తక్కువ తగ్గింపు ఉన్న టయోటా కారు రూమియన్. దీని ధర రూ. 48,700 వరకు తగ్గింది. ఈ ధరల తగ్గింపు తర్వాత టయోటా కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. పండుగ సీజన్ కూడా దగ్గరపడుతుండడంతో అమ్మకాలు ఆకాశాన్ని అంటవచ్చని అంచనా.

Toyota car prices have dropped significantly See the full list of new prices here

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, September 7, 2025, 13:25 [IST]
English summary
Toyota car prices have dropped significantly see the full list of new prices here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+