బైక్ ఇచ్చే మైలేజ్ ఇచ్చినా ఈ కారును కొనేందుకు ఆసక్తి చూపని జనం.. దారుణంగా పడిపోయిన అమ్మకాలు

టయోటా (Toyota), సుజుకి (Suzuki) రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టనర్ షిప్ ద్వారా టయోటా సంస్థ భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) కొన్ని కార్లను తన బ్రాండ్ కింద రీ-బ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. ఉదాహరణకు మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) కారు టయోటా రూమియన్ (Toyota Rumion) పేరుతో అమ్ముతుంది.

ఈ కలయికలో భాగంగా భారతీయ మార్కెట్లో అమ్ముతున్న మరొక కారు టయోటా గ్లాంజా (Toyota Glanza). ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ (Premium Hatchback) విభాగంలోకి వస్తుంది. ఇది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) కారు రీ-బ్యాడ్జ్ వెర్షన్ అని చెప్పవచ్చు. నిజానికి, టయోటా సంస్థ భారతీయ మార్కెట్లో రీ-బ్యాడ్జ్ చేసి విక్రయించిన మొదటి మారుతి సుజుకి కారు ఇదే.

Toyota Glanza Price

టయోటా గ్లాంజా తర్వాతనే టయోటా రూమియన్ వంటి రీ-బ్యాడ్జ్ చేసిన కార్లు మార్కెట్లోకి వచ్చాయి. టయోటా గ్లాంజా భారతదేశంలో 2019 జూన్ నెలలో విడుదల అయింది. అప్పటి నుండి టయోటా సంస్థ అమ్మకాల సంఖ్యను పెంచడంలో గ్లాంజా కీలక పాత్ర పోషిస్తోంది. టయోటా గ్లాంజా విడుదలై దాదాపు 6 సంవత్సరాలు గడిచాయి.

అయినప్పటికీ, టయోటా గ్లాంజా ప్రతి నెల గణనీయమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తోంది. కానీ గత 2024-25 ఆర్థిక సంవత్సరం భారతీయ మార్కెట్లో టయోటా గ్లాంజా కారుకు అంతగా కలిసి రాలేదు. టయోటా గ్లాంజా కారు అమ్మకాల్లో క్షీణతను నమోదు చేసింది.

Toyota Glanza Silver

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్ల (Top 10 Hatchbacks) జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో టయోటా గ్లాంజా కారు 8వ స్థానంలో మాత్రమే నిలిచింది. అంతేకాకుండా టయోటా గ్లాంజా 7 శాతం క్షీణతను నమోదు చేసింది.

టయోటా సంస్థ గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 48,839 గ్లాంజా కార్లను మాత్రమే విక్రయించింది. అయితే ఈ సంఖ్య అంతకు ముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 52,262గా ఉంది. అంటే టయోటా గ్లాంజా కారు అమ్మకాలు 7 శాతం తగ్గాయి.

Toyota Glanza Front

టయోటా గ్లాంజా కారు మొత్తం 5 కలర్ ఆఫ్షన్లలో (Colour Options) అందుబాటులో ఉంది. అవి ఇన్స్టా బ్లూ, గేమింగ్ గ్రే, ఎంటైసింగ్ సిల్వర్, స్పోర్టిన్ రెడ్, కేఫ్ వైట్. పెర్ఫామెన్స్ పరంగా టయోటా గ్లాంజా కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపిక (Engine Option) అందిస్తోంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్‌ వద్ద 66 kW పవర్, 4,400 ఆర్‌పిఎమ్‌ వద్ద 113 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేసే విధంగా ట్యూన్ చేశారు. ఈ ఇంజన్‌తో మాన్యువల్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆఫ్షన్లు (Gear Box Options) అందిస్తున్నారు. ఈ కారుతో రోడ్డు మీద దూసుకుపోవచ్చు.

Toyota Glanza Blue

ఇందులో, మాన్యువల్ గేర్‌బాక్స్ మోడల్ లీటరుకు 22.35 కిలోమీటర్ల మైలేజ్ (Mileage) ఇస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ఏఎమ్‌టి మోడల్ లీటరుకు 22.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలిపారు. టయోటా గ్లాంజా కారు ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ (Fuel Tank Capacity) 37 లీటర్లు.

ఇవి కాకుండా, టయోటా గ్లాంజా కారులో సిఎన్‌జి (CNG) ఇంజన్ ఎంపిక కూడా ఇస్తుంది. అది కూడా 1.2 లీటర్ ఇంజనే. దీని పవర్ అవుట్‌పుట్ 6,000 ఆర్‌పిఎమ్‌ వద్ద 57 kW పవర్, 4,300 ఆర్‌పిఎమ్‌ వద్ద 98.5 Nm టార్క్. టయోటా గ్లాంజా కారు సిఎన్‌జి వేరియంట్‌ల మైలేజ్ కిలోకు 30.61 కిలోమీటర్లుగా ఉంది.

Toyota Glanza Run

దీని సిఎన్‌జి ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు. ఇక్కడ పేర్కొన్నవి అన్నీ టయోటా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న మైలేజ్ గా గమనించాలి. కాబట్టి రియల్ టైం వినియోగంలో టయోటా గ్లాంజా కారు మైలేజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.భారతీయ మార్కెట్లో ప్రస్తుతానికి టయోటా గ్లాంజా కారు ప్రారంభ ధర 6.90 లక్షల రూపాయల నుండి ఉంది. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ ధర రూ.10 లక్షల(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మరోవైపు మారుతి సుజుకి బాలెనో కారు 6.70-9.92 లక్షల రూపాయలుగా ఉంది. ఇవి కూడా ఎక్స్-షోరూమ్ ధరలే. దీని ప్రకారం చూస్తే, మారుతి సుజుకి బాలెనో కారు కంటే టయోటా గ్లాంజా కొంచెం ఖరీదైన కారు. కానీ టయోటా బ్యాడ్జ్‌తో లభించే గ్లాంజా కారు ధర కొన్ని వేలు మాత్రమే ఎక్కువ అని గమనించాలి.

టయోటా గ్లాంజా కారు ఫీచర్ల (Features) విషయానికి వస్తే, 9 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్ అప్ డిస్ప్లే, టిల్ట్, టెలిస్కోపిక్ ఫీచర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, రియర్ ఏసి వెంట్స్ వంటివి చాలా ముఖ్యమైన అంశాలు.

అదే సమయంలో సేఫ్టీ ఫీచర్ల (Safety Features) విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఇబిడితో కూడిన ఏబిఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ముఖ్యమైన ఫీచర్లు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : హ్యుందాయ్ ఐ20 (Hyundai i20), టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు టయోటా గ్లాంజాకు ప్రత్యక్ష పోటీదారులు. అంతేకాకుండా మారుతి సుజుకి బాలెనో కూడా టయోటా గ్లాంజా కారుకు ప్రత్యక్ష పోటీదారుడే. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్ వంటి అంశాలతో కూడిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఆశించే మధ్యతరగతి ప్రజలకు టయోటా గ్లాంజా బెస్ట్ ఆఫ్షన్.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 21, 2025, 12:11 [IST]
English summary
Toyota car with bike like mileage used marutis product to beat maruti
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+