హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టయోటా కార్లు.. ఎందుకింత డిమాండో తెలుసా ?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(Toyota Kirloskar Motor) భారతీయ మార్కెట్‌లో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్, టైసర్, గ్లాన్జా, హిలక్స్, ఫార్చ్యూనర్, రూమియన్ వంటి మోడళ్లకు వినియోగదారుల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

ఆకర్షణీయమైన డిజైన్‌లు, అధునాతన ఫీచర్లు, అందుబాటు ధరలు టయోటా కార్లను అందరికీ చేరువ చేస్తున్నాయి. తాజాగా టయోటా కంపెనీ ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. గణాంకాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం.

Toyota Car

గత నెల(ఏప్రిల్-2025)లో టయోటా కంపెనీ ఏకంగా 27,324 యూనిట్ల కార్లను విక్రయించింది. 2024 ఏప్రిల్‌లో కేవలం 20,494 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఏడాదికేడాది (YoY) అమ్మకాల్లో 33శాతం వృద్ధిని టయోటా సాధించింది. టయోటా అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని ముఖ్యమైన కార్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross): ఇది ఒక పాపులర్ ఎంపీవీ. దీని ధర రూ.20 లక్షల నుంచి రూ.31 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 2-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), 2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది లీటరుకు 16.13 నుంచి 23.24 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 7/8 సీటింగ్ కెపాసిటీతో పాటు అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

Toyota Car Sales

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta): ఈ ఎంపీవీ ధర రూ.20 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. లీటరుకు 8కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 7/8 సీట్ల ఎంపికతో పాటు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

టయోటా అర్బన్ క్రూజర్ టైసర్ (Toyota Urban Cruiser Taisor): ఇది ఒక పాపులర్ SUVగా నిలిచింది. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & CNG ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. లీటరుకు 19.8 నుంచి 28.5 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Toyota

టయోటా రూమియన్ (Toyota Rumion): ఈ ఎంపీవీ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ & CNG ఇంజన్‌తో వస్తుంది. లీటరుకు 20 నుండి 26కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది 7-సీటింగ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

టయోటా గ్లాన్జా (Toyota Glanza): ఇది ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌తో వస్తుంది. లీటరుకు 22 నుంచి 30కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Toyota Car

టయోటా కార్లకు భారతీయ వినియోగదారుల్లో ఉన్న ఆదరణకు ఈ అమ్మకాల గణాంకాలే నిదర్శనం. ఆకర్షణీయమైన డిజైన్‌లు, అత్యాధునిక ఫీచర్లు, సరసమైన ధరలతో టయోటా రాబోయే రోజుల్లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2025, 15:13 [IST]
English summary
Toyota cars selling like hotcakes in india see the massive sales growth in april 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+