టాటా-మారుతీలకు గట్టి షాక్.. సింగిల్ ఛార్జ్‌తో 550 కి.మీలు వెళ్లే అధునాతన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన టయోటా

భారత్‌లో ప్రసిద్ధి చెందిన కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (TKM) అత్యుత్తమైన ప్రమాణాలతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ, దేశంలో మంచి గుర్తింపు పొందింది. లోకల్‌గా చాలా కంపెనీలు మార్కెట్లో తమ కార్లను విడుదల చేస్తుండగా వాటికి పోటీగా అధునాతన డిజైన్లతో, ఆకర్షణీయంగా ఉండే కార్లను లాంచ్ చేస్తూ వాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ప్రతి ఏడాది పలు కొత్త కార్లను తీసుకొస్తున్న టయోటా ఈ కొత్త ఏడాదిలో కూడా మరిన్ని మోడళ్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ఘనంగా జరిగిన ప్రపంచ అతిపెద్ద ఆటోమొబైల్ ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమంలో టయోటా పలు మోడళ్లను ప్రదర్శించింది. దీనిలో ప్రధానంగా 'అర్బన్ క్రూయిజర్ BEV (urban cruiser bev)' కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVని కంపెనీ ఆవిష్కరించింది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఈవీ మోడల్‌ ద్వారా టయోటా తన వాటాను పెంచుకోవాలని చూస్తుంది. ఈ కాన్సెప్ట్ కారు డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఎక్స్‌టీరియర్ చాలా అందంగా కనిపిస్తుంది. దీనిని మారుతీ ఎలక్ట్రిక్ కారు ఇ విటారా ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తుంది. ముందు హెడ్‌లైట్లు, LED DRLలు అట్రాక్టివ్‌గా ఉన్నాయి. రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌లను కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

Toyota Electric Suv Urban Cruiser Bev In Auto Expo

ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల అవుతున్న చాలా కార్లలో శక్తివంతమైన బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చుతున్న నేపథ్యంలో అర్బన్ క్రూయిజర్ బీఈవీలో కూడా అధునాతన, శక్తివంతమైన బ్యాటరీ, మోటార్ ఉంటాయని తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ SUV లో 49 KWh, 61 KWh బ్యాటరీ ప్యాక్‌లు అందించవచ్చని తెలుస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌‌తో ఏకంగా 550 కి.మీల వరకు ప్రయాణించే అవకాశం ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ BEVలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్స్, డ్యూయల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి పలు ఫీచర్స్ ఉండనున్నాయి. ఇవి దాదాపు మారుతీ సుజుకీ మొట్టమొదటి ఈవీ కారు ఇ విటారాను పోలి ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ధర విషయానికి వస్తే, భారతీయ వినియోగదారుల కోసం అందుబాటు ధరలోనే లభిస్తుందని కొన్ని అంచనాలు ఉన్నాయి.

Toyota Electric Suv Urban Cruiser Bev Launch

మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అర్బన్ క్రూయిజర్ BEV ధర రూ. 18 లక్షల వరకు ఉండవచ్చు. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్ రోడ్ ధర అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారులో ప్రయాణికుల రక్షణకు సంబంధించి అధునాతన సేఫ్టీని అందించారు. ప్రధానంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉన్నాయి.

ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), కారులో నుంచే చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీల కెమెరాను అందించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయడానికి టయోటా ప్లాన్ చేసింది. ఇది టాటా నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబ వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

Toyota Electric Suv Urban Cruiser Bev

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2025, 9:40 [IST]
English summary
Toyota electric suv urban cruiser bev expected range price and all top things details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+