కొత్త కార్ కోసం షోరూమ్‌కు వెళ్తున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్.. ఈ తోపు కారు ధర పెరిగింది

సామాన్య కుటుంబాల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇష్టపడే కారు జాబితాలో టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) పేరు ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక బ్రాండ్ పేరు మాత్రమే కాదు, అది ఎన్నో భారతీయ కుటుంబాల విశ్వాసానికి నిదర్శనం. అందరూ ఈ కారును ఒక నమ్మకమైన MPVగా భావిస్తారు. విశాలమైన ఇంటీరియర్ ఏర్పాట్లు, మల్టీ పర్పస్ ఉపయోగాలు, నాణ్యతకు తగ్గ స్టైల్, మన్నిక, మైలేజ్, మెరుగైన సేఫ్టీ అంశాల కారణంగా ఇది ఫేవరెట్ మోడల్‌గా మారిపోయింది. ఇన్నోవా క్రిస్టా డిజైన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కేవలం ఎక్స్‌టీరియర్ ఆకృతితోనే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా ఇది స్మార్ట్‌ SUVలను ఢీ కొట్టగలదు.

ఈ MPV 7 లేదా 8 సీట్ల ఎంపికలతో వస్తోంది, అంటే పెద్ద కుటుంబాలకు లేదా కమర్షియల్ ప్రయోజనాల కోసం ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. అయితే ఈ కారును కొనుగోలే చేయాలనుకునే వారికి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో రుమియన్, ఇన్నోవా హైక్రాస్ వంటి మోడళ్ల ధరలు పెరిగిన తర్వాత, ఇప్పుడు టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా అదే బాటలో నడుస్తోంది.

Innova Crysta Mpv Price Hiked More Details

తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ MPVకి చెందిన కొన్ని ఎంపిక చేసిన వేరియంట్ల ధరలు రూ.26,000 వరకు పెరిగాయి. ముఖ్యంగా, ఈ ధర పెంపు VX, ZX వేరియంట్లపై వర్తిస్తుందని ఒక ప్రైవేట్ మీడియా నివేదిక పేర్కొంది. ఈ కొత్త ధరలతో టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ.19.99 లక్షల నుంచి రూ.27 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య మారుతుంది. ఇప్పుడు ఈ కారును కొనే ముందు, తమ బడ్జెట్‌ను సమీక్షించుకోవాల్సి వస్తుంది.

కానీ, ఇన్నోవా క్రిస్టా అందించే స్థిరమైన పనితీరు, కుటుంబంతో ప్రయాణించడానికి కలిగే సౌకర్యం, బ్రాండ్ విలువ ఇవన్నీ కలిపి చూసుకుంటే, ఈ చిన్నపాటి ధర పెంపు వినియోగదారుల నిర్ణయాన్ని అంతగా ప్రభావితం చేయకపోవచ్చు. ఇక ముందూ కూడా భారత కుటుంబాల్లో ఈ MPV ప్రాధాన్యత సాదించడంలో ఎలాంటి సందేహం లేదు. టయోటా ఇన్నోవా క్రిస్టా - పేరే చాలు, కుటుంబంతో చేసిన ప్రయాణాల్లో విశ్రాంతిని, భద్రతను గుర్తు చేస్తుంది.

Innova Crysta Mpv Price

తాజా మోడల్‌లో టయోటా సంస్థ అందించిన అంశాలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, కొత్త క్రిస్టా 7, 8 సీట్ల వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెద్ద కుటుంబాలకు ఇది ఏకకాలంలో స్పేస్, కంఫర్ట్‌ను సమర్థవంతంగా అందించగల MPV. ఇది శక్తివంతమైన ఇంజిన్‌‌ను కలిగి ఉంది. ఈ బీస్ట్‌కి 2.4-లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్ ఉంది, ఇది 150 BHP హార్స్‌పవర్, 343 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీన్ని తోడుగా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో జత చేయడంతో, ప్రతి షిఫ్ట్ స్పష్టంగా అనిపిస్తుంది.పెర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజ్ పరంగా చూస్తే, ఈ MPV సుమారు 8 kmpl వరకు మైలేజ్ అందించగలదు, ఇది ఒక పెద్ద డీజిల్ కారు కాబట్టి అంతగా ఆశ్చర్యానికి గురిచేయదు. ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 65 లీటర్లు*, అంటే లాంగ్ ట్రిప్‌లకు ట్యాంక్ ఎక్కువగా నింపాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది.

Innova Crysta Mpv Price Hiked

ఈ కారులో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. లోపల యాంబియంట్ లైటింగ్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. అలాగే సేఫ్టీకోసం 7 ఎయిర్‌బ్యాగులు, VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

Article Published On: Friday, July 25, 2025, 9:51 [IST]
English summary
Toyota family car innova crysta mpv price hiked more details check
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+