ఫార్చ్యూనర్ మాయ..  బ్రేక్ వేస్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.. అసలేంటి డెసిలరేషన్ బ్రేకింగ్ సిస్టమ్

టయోటా ఫార్చ్యూనర్ అంటే అదో స్టేటస్ సింబల్. రోడ్డు మీద దాన్ని చూస్తే ఏం కారబ్బా అనిపిస్తుంది. అలాంటి ఫార్చ్యూనర్‌ని కొనాలని కలలు కనే వాళ్ళకి టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఓ పక్క మైల్డ్-హైబ్రిడ్ మోడల్ ని తెచ్చి సంతోషాన్ని ఇచ్చింది. ఇంకోపక్క ధరలను పెంచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ త్రీ-రో SUV ధర ఏకంగా రూ.68,000 పెరిగిపోయింది.

కొత్త ధరలు స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పాటు ఫార్చ్యూనర్ లెజెండర్ మోడల్స్‌కి కూడా వర్తిస్తాయి. మరి ఈ ధరల పెంపు ఎందుకు? కొత్త హైబ్రిడ్ ఫీచర్లు ఏంటి? బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? పూర్తి వివరాలను ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం. తాజా ధరల పెంపులో ఫార్చ్యూనర్ 4x2 పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ ధరలో రూ.68,000 పెరుగుదల ఉంది. ఇది ఈసారి వచ్చిన పెంపుదలలో కెల్లా పెద్దది.

Toyota Fortuner

ఇక 4x2 డీజిల్ మ్యాన్యువల్, 4x2 డీజిల్ ఆటోమేటిక్, 4x4 డీజిల్ మ్యాన్యువల్, GR-S, 4x4 డీజిల్ మ్యాన్యువల్ లెజెండర్, 4x4 ఆటోమేటిక్ లెజెండర్ మోడళ్ల ధరలు రూ.40,000 పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత, టయోటా ఫార్చ్యూనర్ SUV ఇప్పుడు రూ.36.05 లక్షల నుండి రూ.52.34 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధర రేంజులో అందుబాటులో ఉంది.

ఫార్చ్యూనర్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి 2.8-లీటర్ డీజిల్ మోటార్. ట్రాన్స్‌మిషన్ కోసం ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ కూడా ఉన్నాయి. జపనీస్ కార్ల తయారీ సంస్థ అయిన టయోటా, 4x4 డ్రైవ్‌ట్రైన్, లెజెండర్ వేరియంట్లను మాత్రం కేవలం డీజిల్ ఇంజిన్‌తోనే అందిస్తుంది.

Toyota Fortuner

టయోటా ఫార్చ్యూనర్కు రోడ్డు మీద దానికి తిరుగులేదు. అది వస్తున్నాదంటే పక్కకి తప్పుకోవాల్సిందే. రోడ్డు మీద తనదైన స్టైల్, లగ్జరీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్. దీని డిజైన్ చాలా బోల్డ్‌గా, మస్కులర్‌గా ఉంటుంది. హైట్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్లు, స్ట్రాంగ్ వీల్ ఆర్చెస్ అన్నీ దీనికి డోమినేటింగ్ లుక్ ఇస్తాయి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, స్ట్రాంగ్ బాడీ ఫ్రేమ్ వల్ల ఎలాంటి రోడ్లకైనా ఇది పర్ఫెక్ట్.

పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఫార్చ్యూనర్‌లో పవర్‌ఫుల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి మంచి పికప్, టార్క్ ఇస్తాయి. ముఖ్యంగా 4x4 వేరియంట్ ఆఫ్-రోడింగ్‌కి అదుర్స్. లాంగ్ డ్రైవ్‌లకి చాలా కంఫర్ట్‌గా, నమ్మకంగా ఉంటుంది. టయోటా కార్లు వాటి మన్నికకి, లో మెయింటెనెన్స్‌కి పేరుగాంచాయి. అందుకే ఫార్చ్యూనర్ రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. దీని స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి. సర్వీస్ నెట్‌వర్క్ కూడా పటిష్టంగా ఉంది.

Toyota Fortuner

టయోటా ఫార్చ్యూనర్ లైనప్‌లో ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48Vని మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో లాంచ్ చేశారు. ఈ 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను SUV రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు. ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V, లెజెండర్ నియో డ్రైవ్ 48V. డిజైన్, ఫీచర్లలో పెద్దగా మార్పులు చేయలేదు కానీ, మెకానికల్‌గా కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయి.

ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48Vలో అదే 2.8-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. అయితే, ఈ ఇంజిన్‌ను ఇప్పుడు 48-వోల్ట్ సిస్టమ్‌తో జత చేశారు. ఇందులో బెల్ట్-ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్నాయి. ఈ హైబ్రిడ్ అసిస్ట్ వల్ల లో-ఎండ్ యాక్సిలరేషన్ మరింత స్మూత్‌గా ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది. మైలేజ్ కూడా పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.

Toyota Fortuner

డెసిలరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ : హైబ్రిడ్ ఫార్చ్యూనర్‌లో ఉన్న బ్యాటరీని డెసిలరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఛార్జ్ చేస్తారు. ఈ టెక్నాలజీలో SUV వేగాన్ని తగ్గించినప్పుడు (అంటే మీరు బ్రేక్ వేసినప్పుడు లేదా యాక్సిలరేటర్‌ను రిలీజ్ చేసినప్పుడు), బ్రేకింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే శక్తిని వృథా చేయకుండా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది.

కొత్త స్మార్ట్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ కూడా ఫ్యూయెల్ కెపాసిటీని మరింత మెరుగుపరుస్తుంది. వాహనం ఆగి ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోయి, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది మల్టీ-టెర్రైన్ సెలెక్ట్ సిస్టమ్‌తో కూడా వస్తుందిజ ఇది వివిధ రకాల భూభాగాలలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు థ్రాటిల్ రెస్పాన్స్, బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

Toyota Fortuner

టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V: ధర రూ.44.72 లక్షలు (ఎక్స్-షోరూమ్), లెజెండర్ నియో డ్రైవ్ 48V: ధర రూ.50.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలతో ఫార్చ్యూనర్ లైనప్‌లో కొత్త 48V వేరియంట్ రెండవ అత్యంత ఖరీదైన వేరియంట్‌గా మారింది.. అయితే లెజెండర్ రేంజ్ కోసం 48V అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచింది.

టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో బ్లాక్ వైట్ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, షార్ప్ హెడ్‌ల్యాంప్ DRLలు, ప్రత్యేక బంపర్, రెగ్యులర్ ఫార్చ్యూనర్‌తో పోలిస్తే కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. ఇందులో 20 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

Toyota Fortuner

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో కూడా పెద్దగా మార్పు లేదు. ఇది ఇప్పటికీ డ్యూయల్-టోన్ ఇంటీరియర్, లెదర్ అప్‌హోల్స్టరీ, యాంబియెంట్ లైటింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డిజిటల్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. ఈ కేటగిరీలోని ఇతర సౌకర్యాలలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సబ్‌వూఫర్, యాంప్లిఫైయర్‌తో కూడిన 11 ప్రీమియం JBL స్పీకర్లు ఉన్నాయి.

మొత్తంగా, ధరలు పెరిగినప్పటికీ, కొత్త మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో ఫార్చ్యూనర్ మరింత ఫ్యూయెల్ కెపాసిటీ, మంచి పర్ఫామెన్స్ తో వస్తుండటం విశేషం. ఫార్చ్యూనర్ అభిమానులు ఈ మార్పులను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, June 16, 2025, 15:50 [IST]
English summary
Fortuner fans get a shock price hikes after mild hybrid launch thar screams
Read more on: #toyota #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+