అందరికి ఇష్టమైన 7 సీటర్ కారును కొనాలంటే ఇకపై ఆలోచించాల్సిందే.. ఎందుకో తెలుసా?

ప్రముఖ టోమొబైల్ తయారీదారు టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశీయ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. మరోసారి తన సిగ్నేచర్ మోడల్ అయిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ (fortuner suv)కి చెందిన కొన్ని వేరియంట్ల ధరలను పెంచింది. ఇప్పటికే భారీగా ఉండే ఈ ఫుల్-సైజ్ SUV ధరలు ఇప్పుడు మరింత భారం అయ్యాయి. ధరలు పెంచడానికి గల కారణాలను ఇంకా పేర్కొనలేదు. అయితే ఈ ధరల పెంపు పన్నులు, ఇన్‌పుట్ ఖర్చులు, ఫీచర్ అప్‌డేట్లు వంటివి కారణంగా జరిగి ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా మాత్రం కంపెనీ ఈ పెంపునకు గల కారణాన్ని వెల్లడించలేదు. కొత్తగా ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ఫార్చ్యూనర్ 4x2 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 68,000 మేర పెరిగింది. ఇది కొందరు కస్టమర్లను అసహనానికి గురిచేసే అవకాశముంది, ఎందుకంటే ఇదే వేరియంట్ ఎంతో మందికి హై-డిమాండ్‌లో ఉంటుంది. ఇంకా ఇతర వేరియంట్ల విషయానికి వస్తే, 4x2 డీజిల్ మాన్యువల్, 4x2 డీజిల్ ఆటోమేటిక్, 4x4 డీజిల్ మాన్యువల్, 4x4 డీజిల్ ఆటోమేటిక్, లెజెండర్ వేరియంట్‌లు, GR-S ఎడిషన్ ధరలు రూ. 40,000 చొప్పున పెరిగాయి.

Toyota Fortuner Suv Prices Hiked On Selected Variants Details

దీంతో, ఇప్పుడు టయోటా ఫార్చ్యూనర్‌కి చెందిన వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ.36.05 లక్షల నుంచి రూ.52.34 లక్షల వరకు ఉంది. కొత్త ఫార్చ్యూనర్‌ను కొనాలని చూస్తున్నవారు, తాజా ధరలతో తమ బడ్జెట్‌ను తిరిగి ఆలోచించాల్సి రావొచ్చు. కానీ, దీని మెరుగైన పనితీరు, శక్తివంతమైన ప్రెజెన్స్, లగ్జరీ టచ్‌ను మెచ్చుకునే వారికి మాత్రం ఇది ఇంకా బెస్ట్ ఎంపికగానే ఉంటుంది. మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించింది.

2009లో భారత మార్కెట్‌లో అడుగుపెట్టి అప్పటి నుంచి లక్షలాది భారతీయుల మనసును గెలుచుకుంటూ వచ్చింది. ఇది 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 164 bhp శక్తిని, 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ స్మూత్, కంఫర్టబుల్ రైడ్‌ను అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 2WD సిస్టమ్ మాత్రమే అందించబడుతుంది, ఇది నగరాలలో, హైవే డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మరో 2.8 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంటర్‌కూల్డ్ ఇంజిన్ కూడా ఉంది.

Toyota Fortuner Suv Prices Hiked On Selected Variants

ఇది ట్రాన్స్మిషన్ ఎంపికను బట్టి 201 bhp పవర్, 420 Nm(manual) నుండి 500 Nm(automatic) వరకు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ వేరియంట్‌కి 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉండేలా 4x4 డ్రైవ్ సిస్టమ్ కూడా డీజిల్ వేరియంట్‌లో, ప్రత్యేకించి లెజెండ్ డెరివేటివ్‌‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇటీవల భారతదేశంలో ఇది 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని పూర్తి చేసింది. తాజాగా కంపెనీ తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి తన ప్రీమియం SUV సిరీస్‌లో మరింత టెక్నాలజీని జోడిస్తూ, ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V, లెజెండ్ నియో డ్రైవ్ 48V అనే రెండు కొత్త మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్‌లు "నియో డ్రైవ్ 48V" టెక్నాలజీతో వస్తున్నవిగా టయోటా పేర్కొంది.

Toyota Fortuner

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Monday, June 9, 2025, 15:20 [IST]
English summary
Toyota fortuner suv prices hiked on selected variants more details inside
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+