యాక్సిడెంట్ అవుతుందన్న భయం లేకుండా ఈ కారులో హాయిగా వెళ్లండి! రూ.7 లక్షల్లోనే 6 ఎయిర్‌బ్యాగ్స్
కార్ల ఎంపికలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ రోజుల్లో కేవలం లుక్ లేదా మైలేజ్‌తో సరిపోదు , భద్రతే ప్రధాన ప్రమాణం. దీనిని బాగా అర్థం చేసుకున్న టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM), తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాలో (Glanza) రెండు కీలక అప్‌గ్రేడ్లతో ముందుకు వచ్చింది. ఇప్పటి వరకూ, గ్లాంజా ఒక స్టైలిష్, స్మార్ట్, మైలేజ్-ఫ్రెండ్లీ కారుగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ తాజా మార్పుతో అది సేఫ్టీ డ్రైవింగ్ అనుభవానికి ఒక ప్రతీకగా మారుతోంది. కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ గ్లాంజాలోని అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించింది. దీంతో గ్లాంజాను భద్రత పరంగా ముందంజలో నిలిపింది. డ్రైవర్లు, ప్రయాణికులకు ఎదురయ్యే అత్యవసర పరిస్థితులలో గరిష్ఠ రక్షణ ఇవ్వడం కోసం టయోటా తీసుకున్న ఈ చర్య, కంపెనీ గ్లోబల్ సేఫ్టీ ఫిలాసఫీకి అద్దం పడుతుంది.
ఇది మాత్రమే కాకుండా, మరో ఆకర్షణీయమైన ప్రెస్టీజ్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇది ఒక పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక ప్యాకేజీ. దీని ద్వారా, గ్లాంజా మరింత ఎలెగెంట్‌గా, అద్దంగా నిలుస్తుంది. మొదటిసారి కార్ కొనుగోలు చేయబోయే వారిని ఆకర్షించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ రెండు కీలక మార్పులు, భద్రతా ఫీచర్లలో పెరుగుదల, లిమిటెడ్ ఎడిషన్ ప్రీమియం ప్యాకేజీ ద్వారా టయోటా గ్లాంజా తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే గ్లాంజా వాహన స్థిరత్వ నియంత్రణ వ్యవస్థ (VSC), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అత్యవసర సమయంలో మద్దతిచ్చే సిస్టమ్స్‌తో అందుబాటులో ఉంది. అలాగే టయోటా అందిస్తున్న TECT బాడీ స్ట్రక్చర్ ద్వారా, బలమైన బాడీ నిర్మాణంతో ఢీకొనేవారిని రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ అప్‌డేట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులను కూడా అందించడతో సేఫ్టీ పరంగా గ్లాంజా ఇతర మోడళ్లకు బలమైన పోటీగా నిలుస్తోంది.
టయోటా గ్లాంజా ధర రూ. 6.90 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇక టయోటా గ్లాంజా ప్రెస్టీజ్ ఎడిషన్ విషయానికొస్తే, ఇది సాధారణ గ్లాంజాకు గ్లామర్ టచ్‌ను తీసుకొచ్చే ప్రత్యేక ప్యాకేజీ. కారును బయటనుంచి చూసిన వెంటనే కొత్తగా, అందంగా ఆకట్టుకునేలా ఉండేలా టయోటా దీన్ని డిజైన్ చేసింది. ఈ ప్యాకేజీలో ఏడు డీలర్ స్థాయి అంశాలు లభిస్తాయి. క్రోమ్-యాక్సెంట్‌లతో కూడిన బాడీ సైడ్ మోల్డింగ్, ఆకర్షణీయమైన వెనుక లైట్ల ఆకట్టుకుంటాయి.

ఇంకా వెనుక స్కిడ్ ప్లేట్ వంటి అంశాలు కారుకు మరింత సొగసైన రూపాన్ని ఇస్తాయి. పైగా అలంకరించిన డోర్ సిల్స్, క్రోమ్ ORVMలు, ఫెండర్ గార్నిష్‌లు, ఇంకా కింద గ్రిల్ డిజైన్ కారును క్లాస్‌కి తగ్గట్టుగా నిలబెడతాయి. మొత్తంగా చూస్తే, గ్లాంజా ఇప్పుడు కేవలం ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ మాత్రమే కాదు, అది స్టైల్, సేఫ్టీ, ధర అనే మూడు ప్రధాన విభాగాల్లోనూ దూసుకెళ్లే కారుగా మారింది.
ప్రెస్టీజ్ ఎడిషన్ అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంపాక్ట్ చూపే ప్యాకేజీ. ప్రెస్టీజ్ ప్యాకేజీ జులై 31, 2025 పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుంది. ఇది అధీకృత టయోటా డీలర్‌షిప్‌ల ద్వారా లభిస్తుంది. టయోటా గ్లాంజా 1.2-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 22.94 కిమీ/లీ వరకు, CNG వేరియంట్‌లో 30.61 కిమీ/కిమీ మైలేజ్‌ను అందిస్తుంది.

ప్రతి గ్లాంజా యూనిట్‌కు 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల ఫ్యాక్టరీ వారంటీ ప్రామాణికంగా వస్తోంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారుడు కోరితే దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీగా పెంచుకోవచ్చు. దీని వలన, దీర్ఘకాలికంగా కారును నమ్మకంగా ఉపయోగించాలనుకునే వారు ఏవైనా అనిశ్చిత పరిస్థితుల్లోనూ పూర్తిగా సురక్షితంగా ఉంటారు.
ఇక టయోటా సర్వీస్ స్ట్రక్చర్ విషయానికి వస్తే, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, అనుకోని బ్రేక్‌డౌన్ లేదా ఎమర్జెన్సీ పరిస్థితులలో ఎక్కడైనా తక్షణ సహాయానికి, 60 నిమిషాల ఎక్స్‌ప్రెస్ సర్వీసింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇదే కాకుండా, ఫైనాన్సింగ్ పరంగా వినియోగదారుడి అవసరాల ప్రకారం సరిపడే పలు ఫైనాన్స్ సొల్యూషన్స్ ద్వారా EMI సౌలభ్యం, డౌన్ పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ వంటి అంశాలు గ్లాంజాను సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.


Click it and Unblock the Notifications