టయోటా స్టిక్కర్ ఉన్న ‘మారుతి’ని కొనేందుకు ఎగబడ్డ జనాలు.. అద్భుత మైలేజీ, అంత తక్కువ రేటుకు వస్తే వదులుతారా

నాణ్యమైన, నమ్మదగిన వాహనాలను ఉత్పత్తి చేస్తూ జనాల్లో బాగా పాపులర్ అయింది టయోటా కంపెనీ. ఇది అనేక రకాల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో చిన్న కార్లు, లగ్జరీ సెడాన్లు, SUVలు, కమర్షియల్ వాహనాలు ఉన్నాయి. టొయోటా మోటార్ కార్పొరేషన్ (Toyota Motor Corporation) జపాన్‌లోని ఐచి, టయోటా సిటీలోని జపనీస్ బహుళజాతి ఆటోమోటివ్ తయారీదారు.

టయోటా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు, సంవత్సరానికి 10 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉత్పత్తులు 200 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. టయోటా కంపెనీకి భారతదేశంలో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. కంపెనీ అనేక రకాల వాహనాలను భారతదేశంలో విక్రయిస్తుంది. వీటిలో ఇన్నోవా, ఫార్చ్యూనర్, గ్లాంజా ఉన్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్స్(Toyota Kirloskar Motor) పేరుతో బెంగళూరులో టయోటా కంపెనీకి ఉత్పత్తి కేంద్రం ఉంది.

ToyotaGlanza

ప్రతి నెల అన్ని ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తుంటాయి. టయోటా కూడా దాని వివిధ మోడల్స్ విక్రయాలను వెల్లడించింది. ఇండియాలో టయోటా, మారుతి సుజుకి రెండు సంస్థలు వాటి ఉత్పత్తులను ఒకదానితో ఒకటి పంచుకుంటున్నాయి. దీనిలో భాగంగా, మారుతి సుజుకి కార్లను టయోటా రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. ఉదాహరణకు, మారుతి బాలెనో, టయోటా గ్లాంజాగా విక్రయించబడుతుంది.

ఇలా ఉత్పత్తులను రెండు కంపెనీలు పంచుకోవడం వల్ల రెండు కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. టయోటాకు తక్కువ ధరలో కార్లను విక్రయించే అవకాశం లభిస్తుంది. మారుతి సుజుకి తన ఉత్పత్తులను విస్తృత శ్రేణి వినియోగదారులకు చేర్చగలదు. రెండు సంస్థలు టెక్నాలజీని కూడా పంచుకుంటాయి. ముఖ్యంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిలో సహకారం కొనసాగుతోంది.

Toyota Glanza Silver

మారుతున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రెండు సంస్థలు కలిసి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో టయోటా, మారుతి సుజుకి మధ్య సహకారం మరింత కీలకంగా మారుతోంది. ఈ రెండు కంపెనీలు కలిసి EVలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

టయోటా గ్లాంజా అనేది మనదేశంలో టయోటా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది మారుతి సుజుకి బాలెనో ఆధారంగా రూపొందించారు. టయోటా, మారుతి సుజుకి మధ్య భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా గ్లాంజాను టయోటా విక్రయిస్తోంది. ఫిబ్రవరి నెలలో టయోటా గ్లాంజా అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా టయోటా ఇండియాలో మంచి పనితీరు కనబరుస్తోంది.

Toyota Glanza Front

ఇన్నోవా, హైరైడర్ మోడళ్ల తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో గ్లాంజా ఒకటి. 2025 ఫిబ్రవరిలో టయోటా 4,596 గ్లాంజా కార్లను విక్రయించింది. 2024 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 4,581గా ఉంది. అంటే, 2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025 ఫిబ్రవరిలో 15 టయోటా గ్లాంజా కార్లు అదనంగా అమ్ముడయ్యాయి. 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లో అమ్మిన టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో టయోటా గ్లాంజా ఏడో స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో మారుతి వాగన్‌ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో, గ్లాంజా మారుతి కజిన్ మోడల్ బాలెనో మూడవ స్థానంలో ఉన్నాయి. మారుతి ఆల్టో, టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ గ్లాంజా కంటే ముందున్న ఇతర మోడల్స్. బాలెనో తో పాటు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ గ్లాంజాకు ఇతర పోటీదారులు.

Toyota Glanza Blue

గ్లాంజా బేస్ వేరియంట్ ధర రూ. 6.90 లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ కొనడానికి రూ. 10 లక్షలు ఖర్చు చేయాలి. ఇవి రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ మోడల్ పెట్రోల్, సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. బలేనో రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అయినప్పటికీ, గుర్తించడానికి కొన్ని డిజైన్ మార్పులు చేసింది టయోటా కంపెనీ. గ్లాంజా ధర దాని వేరియం‎ట్‎ను బట్టి మారుతుంది.

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టయోటా ఐ కనెక్ట్ సపోర్ట్, డిజిటల్ వాయిస్ అసిస్టెంట్, లెదర్-రోల్డ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు గ్లాంజాలో ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్, 360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Toyota Glanza Inner

టయోటా గ్లాంజాలో 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ అందించగల 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇదే ఇంజిన్ సీఎన్‌జీ మోడ్‌లో 77.5 పీఎస్ పవర్ మాత్రమే అందిస్తుంది. పవర్ అవుట్‌పుట్ తగ్గినప్పటికీ, గ్లాంజా సీఎన్‌జీ మంచి మైలేజీని అందిస్తుంది. ఇందులో ABS, EBD వంటి ఫీచర్లు ఉన్నాయి.

గ్లాంజా పెట్రోల్ మోడల్ మైలేజ్ లీటరుకు 22.35నుంచి 22.94కిలోమీటర్ల వరకు ఇస్తుంది. అయితే టయోటా గ్లాంజా సీఎన్‌జీ మోడల్ కిలోకు 30.61 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనాలనుకునే వారికి టయోటా గ్లాంజా బెస్ట్ ఆఫ్షన్‎గా చెప్పుకోవచ్చు. టయోటా గ్లాంజా ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్. ఇది మంచి ఫీచర్లు, మైలేజ్ అందిస్తుంది.

టయోటా గ్లాంజా కొనుగోలు చేసే వాళ్లకు కంపెనీ అదనపు వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తుంది. ఇది కారు దీర్ఘకాలిక మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే కాకుండా టయోటా కార్లకు మంచి రీసేల్ విలువ ఉంటుంది. ఇది గ్లాంజాను మంచి పెట్టుబడి, సౌకర్యం కోసం కూడా కొనుగోలు చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 25, 2025, 17:20 [IST]
English summary
Toyota glanza a premium hatchback with excellent features and mileage gaining popularity in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+