కారే అయినా బైక్‌లా మైలేజ్ ఇస్తుంది! రూ.6.90 లక్షలకే 5 మందికి బెస్ట్.. గత నెలలో సేల్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఏప్రిల్ ముగిసిన తరువాత వాహన తయారీ కంపెనీలు వరుసగా తమ మోడళ్ల వారీగా అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ టయోటా తాజాగా తన ప్రసిద్ద మోడల్ గ్లాంజా‌కు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. మారుతీ సుజుకీ బాలెనో ఆధారంగా రూపొందించబడిన ఈ మోడల్, టయోటా బ్రాండ్‌కు కీలకమైంది. అధునాతన టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, అందుబాటు ధర కారణంగా గ్లాంజా మార్కెట్లో ప్రారంభదశలో మంచి స్పందన అందుకుంది. అయితే, ఈ మోడల్ అమ్మకాల పరంగా కొంత వెనుకడుగు వేస్తోంది. ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం, 2025 ఏప్రిల్‌లో టయోటా కంపెనీ 4,132 గ్లాంజా (glanza) మోడళ్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల.

2024 ఏప్రిల్‌లో గ్లాంజా అమ్మకాలు 4,380 యూనిట్లు కాగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 6 శాతం తగ్గుదలగా నమోదు అయింది. ఈ తగ్గుదల వెనుక పలు కారణాలు ఉండవచ్చు. మార్కెట్లో కొత్త మోడల్స్ విడుదలవడం, బలమైన పోటీలో ఇతర బ్రాండ్ల ఆకర్షణీయ ఆఫర్లు, లేదా వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పు వంటి పలు అంశాల కారణంగా గ్లాంజా అమ్మకాలపై ప్రభావం పడింది.

Toyota Glanza Hatchback

టయోటా గ్లాంజా ఇటీవల భారత మార్కెట్లో మెల్లగా వెనుకడుగు వేస్తోంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తన స్థానం నిలుపుకునే ప్రయత్నంలో ఉన్న ఈ కారుకు, ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేకపోయాయి. జనవరి 2025లో గ్లాంజా అమ్మకాలు 3,455 యూనిట్ల వద్ద నిలిచాయి. ఫిబ్రవరిలో మాత్రం కొద్దిగా ఊపందుకుని 4,596 యూనిట్లు విక్రయమయ్యాయి. అయితే, మార్చిలో ఈ సంఖ్య తగ్గి 3,501 యూనిట్లకు పరిమితమైంది.

ఈ మూడు నెలల గణాంకాల ఆధారంగా చూస్తే, గ్లాంజా నెలావారీగా సగటు అమ్మకాలు సుమారు 3,500 యూనిట్లకు చేరుతున్నాయి. ఈ సంఖ్యలు గతంలో గ్లాంజా సాధించిన అమ్మకాలతో పోల్చుకుంటే తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి టయోటా కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ లేదు. ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ ధరలోనే చాలా SUVలు, సెడాన్లు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తున్నాయి.

Toyota Glanza Hatchback Sales

మరింత స్థలం, పవర్‌ఫుల్ ఫీచర్లు, అదనపు భద్రతా ప్రమాణాలతో కొత్త వాహనాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా, గ్లాంజా వైపు వినియోగదారుల ఆసక్తి చూపడంతో కొంత తగ్గుదల కనిపిస్తోంది. గ్లాంజాను మార్కెట్లో తిరిగి గాడిలోకి తీసుకురావడానికి టయోటా తాజా అప్‌డేట్‌లు, కొత్త ఎడిషన్లు లేదా మెరుగైన వేరియంట్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. అప్పుడే గ్లాంజా మరోసారి అమ్మకాల పరంగా నిలదొక్కుకునే అవకాశాన్ని పొందగలదు.

టయోటా గ్లాంజా, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఉన్న ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. ధర పరంగా చూస్తే రూ. 6.90 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉండే ఈ కార్, సిటీ రైడింగ్‌కు అనుకూలంగా, ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఐదు సీట్లు ఉంటాయి. ప్రయాణికులు వీటిలో సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించవచ్చు.

Toyota Glanza Hatchback Car April 2025 Sales Recorded 4132

కారులో 318 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల, రోజూ ఉపయోగించే లగేజీకి తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఇంజిన్ పరంగా చూస్తే, గ్లాంజా 1.2 లీటర్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 22 kmpl వరకు, CNG వేరియంట్ 30 km/kg వరకు మైలేజ్ అందిస్తుంది. ఈ మైలేజ్, సాధారణ బైక్‌లతో పోల్చినా మంచి స్థాయిలో ఉంటుంది, దీన్ని చాలా మంది సిటీ యూజర్లు ఇష్టపడతారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2025, 17:20 [IST]
English summary
Toyota glanza hatchback car april 2025 sales recorded 4132 units details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+