కొత్త కారు నెలకు కేవలం రూ.9 వేలతో! 30 కి.మీ మైలేజ్.. దాని ధర, EMI పై ఓ లుక్కేయండి
టయోటా గ్లాంజా (Toyota Glanza) పేరు చెప్పగానే ఒక క్లాస్, ప్రీమియం టచ్ గుర్తుకు వస్తుంది. భారత మార్కెట్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తన ప్రత్యేకమైన డిజైన్, నాణ్యతతో మంచి పేరు సంపాదించింది. టయోటా బ్రాండ్‌కి ఉన్న ప్రతిష్ఠ, దీని పనితీరుతో కలిపి గ్లాంజాను ఈ కేటగిరీలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా నిలబెట్టాయి. ధర పరంగా గ్లాంజా బడ్జెట్, ప్రీమియం మధ్య సమానత్వం సాధించింది. దీని ధర కనీసం రూ. 6.39 లక్షలు, గరిష్టంగా రూ. 9.15 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ధరలో ఇంత ఫీచర్-రిచ్, ప్రీమియం లుక్ కలిగిన హ్యాచ్‌బ్యాక్ దొరకడం చాలా అరుదు. ఈ కారు కొనాలనుకునేవారి కోసం వేరియంట్ల వారీగా ఈ కారు ఆన్-రోడ్ ధర, EMI గురించి వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ముందుగా E (పెట్రోల్) వేరియంట్ గురించి మాట్లాడితే, ఇది గ్లాంజా లైన్‌అప్‌లో బెస్ట్ అనచ్చు. దీని ఆన్-రోడ్ ధర రూ. 7.65 లక్షలు. రూ.3 లక్షల డౌన్ పేమెంట్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే, మిగిలిన రూ. 4.65 లక్షల మొత్తానికి రుణం పొందవచ్చు. 9 శాతం వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల పాటు నెలవారీ EMI సుమారు రూ. 9,600 ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

తర్వాత S (పెట్రోల్) వేరియంట్ గురించి మాట్లాడితే, ఇది అదనపు ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 8.64 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రుణం రూ. 5.64 లక్షల వరకు వస్తుంది. ఈ రుణంపై 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి EMI రూ. 11,700 వరకు ఉంటుంది. ఈ వేరియంట్‌ను ప్రీమియం ఫీచర్లతో కూడిన మధ్యస్థ స్థాయి మోడల్‌గా భావించవచ్చు.
గ్లాంజా టాప్ సెల్లింగ్ మోడల్‌గా గుర్తింపు పొందిన G (పెట్రోల్) వేరియంట్‌కి ఆన్-రోడ్ ధర రూ. 9.71 లక్షలు. మీరు రూ.3 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, రుణ మొత్తం రూ. 6.70 లక్షలు అవుతుంది. 9 శాతం వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల EMI సుమారు రూ. 13,900 వరకు ఉంటుంది. ఇది ఫీచర్ల పరంగా, పనితీరులో ప్రీమియం లుక్‌ను కోరుకునే వినియోగదారుల కోసం సరైన ఎంపిక.

S CNG వేరియంట్ గురించి మాట్లాడితే, మైలేజ్‌కి ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారుల కోసం రూపొందించబడింది. దీని ఆన్-రోడ్ ధర రూ. 9.61 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో ఈ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, రుణ మొత్తం రూ.7.61 లక్షలు అవుతుంది. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు నెలవారీ EMI రూ. 13,700 వరకు ఉంటుంది. ఇది ఫ్యూయల్ ఎఫిషెన్సీ, తక్కువ రన్నింగ్ ఖర్చుతో ఆకట్టుకునే మోడల్.
అంతేకాక, గ్లాంజా G CNG వేరియంట్ ప్రీమియం ఫీచర్లతో కూడిన వేరియంట్‌గా అందుబాటులో ఉంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 10.68 లక్షలు. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రుణ మొత్తం రూ. 7.68 లక్షలు అవుతుంది. 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు EMI రూ. 15,900 వరకు ఉంటుంది. ఈ మోడల్ ఫ్యూయల్ ఎఫిషెన్సీతో పాటు ప్రీమియం లుక్, ఫీచర్లను కూడా అందిస్తుంది.

టయోటా గ్లాంజా మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ ప్రతి లీటరుకు 22.35 కి.మీ, పెట్రోల్-AMT వేరియంట్ ప్రతి లీటరుకు 22.94 కి.మీ మైలేజీని ఇస్తుంది. సిఎన్‌జి వెర్షన్ 30.61 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని సేల్స్ గురించి చూసినట్లయితే సెప్టెంబర్ 2025 లో మొత్తం 3,299 గ్లాంజా కార్లు అమ్ముడయ్యాయి, ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 3,246 యూనిట్లతో పోలిస్తే 53 యూనిట్లు ఎక్కువ.


Click it and Unblock the Notifications








