Toyota Glanza Sales అమ్మకాల్లో గడగడలాడిస్తున్న గ్లాంజా.. 2 లక్షల మైలురాయిని దాటిన సేల్స్!
భారత మార్కెట్లో కార్లలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌దే ఒకప్పుడు అగ్ర తాంబూలం. అయితే.. కొన్ని సంవత్సరాలుగా హ్యాచ్‌బ్యాక్‌లపై ఆదరణ తగ్గిపోతూ వస్తోంది. వీటి స్థానాన్ని క్రమక్రమంగా ఎస్‌యూవీలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ.. హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. అనేక దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికీ ఈ సెగ్మెంట్లో వివిధ మోడళ్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వాటిల్లో.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్న ఈ కారు సేల్స్‌లో దూసుకెళ్లిపోతోంది. సేల్స్ విషయంలో టయోటా గ్లాంజా సరికొత్త మైలురాయిని దాటింది. ఆ విశేషాలు చూసేద్దాం.
మారుతి బాలెనోకి Badge-Engineered వెర్షన్ అయిన ఈ కారు గత నెలలో 2 లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. 2025 జనవరిలో ఈ కారు సేల్స్ మొత్తం 26,178 యూనిట్లుగా ఉన్నాయి. ఈ కారు భారత్లో లాంచ్ అయిన 66 నెలల తర్వాత ఈ రికార్డును సాధించింది. మారుతి బాలెనో, టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బాక్స్.. గుజరాత్‌లోని సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC)లో ఉత్పత్తి చేస్తున్నారు.

2019 జూన్‌లో ఈ గ్లాంజా కారు లాంచ్ అయింది. లక్ష సేల్స్ మైల్ స్టోన్‌ను చేరడానికి నాలుగు సంవత్సరాల కంటే తక్కువ సమయం పట్టగా.. మిగతా లక్ష కార్ల అమ్మకాలు మాత్రం ఒక సంవత్సరం 9 నెలల్లోనే సాధించింది. టయోటా గ్లాంజాకు FY2024 బాగా కలిసి వచ్చిన ఆర్థిక సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ 12 నెలల కాలంలో 52,262 యూనిట్ల కార్ల విక్రయాలు జరిగాయి.
ఇదే ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంలోనే 40,742 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ టయోటా గ్లాంజాకు మార్కెట్లో ఉన్న పోటీ కార్ల విషయానికి వస్తే.. హ్యుందాయ్ i20 కారు అమ్మకాలు FY2024లో 47,434 యూనిట్లుగా ఉంది. ఇక మరో పోటీ కారు టాటా ఆల్ట్రోజ్.. ఇదే సమయంలో 31,925 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిపింది.

అయితే ఈ గ్లాంజాకు కౌంటర్ పార్ట్ అయినా మారుతి బాలెనో మాత్రం మరింత ముందంజలో ఉంది. ఇదే పీరియడ్‌లో ఈ కారు 1,39,324 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇటీవలి నివేదికల ప్రకారం.. బాలెనో అమ్మకాలతో పోల్చితే టయోటా గ్లాంజా సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో గ్లాంజా, బాలెనో కార్ల సేల్స్ మధ్య వ్యత్యాసం 13.51 శాతం మాత్రమే ఉందనే విషయం గుర్తుంచుకోవాలి.
అయితే 2024 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ వ్యత్యాసం 29.24 శాతానికి చేరింది. ఇదే తరహా అమ్మకాలు ఇకపై కూడా కొనసాగితే.. SMC ఫ్యాక్టరీ నుంచి బాలెనో, గ్లాంజాల ఉమ్మడి విక్రయాలు FY2025 ముగిసేనాటికి సులభంగా రెండు లక్షల మార్కును దాటుతాయి. గ్లాంజా కారు పెట్రోల్, CNG పవర్‌ట్రైన్ ఆప్షన్లతో వస్తుంది. దీంట్లో పెట్రోల్ వెర్షన్ కారు.. మ్యాన్యువల్, AMT ఆటోమెటిక్ ఆప్షన్స్‌తో ఉంటుంది.

ఇక CNG వెర్షన్.. మాన్యువల్‌గా మాత్రమే ఉంటుంది. ఈ కారు 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూం ధర రూ.6.90 లక్షల నుంచి రూ.9.99 లక్షల మధ్య ఉంటుంది. మంచి మైలేజీ, టాప్ క్లాస్ ఫీచర్లతో ఈ కారు అందుబాటులో ఉంది. కావున ఈ కారుని కొత్త కస్టమర్లు కూడా నిరభ్యంతరంగా ట్రై చేయవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








