కేవలం రూ.6.39లక్షలకే.. 30కిమీ మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు..ఈ చౌక కారు సేల్స్ జోరు మామూలుగా లేదు
టయోటా నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు గ్లాంజా(Toyota Glanza) ప్రస్తుతం మార్కెట్లో దుమ్ము లేపుతోంది. చూడటానికి చాలా స్టైలిష్‌గా, మంచి ఫీచర్లతో ఉన్న ఈ కారును కొనేందుకు జనం ఎగబడుతున్నారు. దీనికి నిదర్శనం.. అక్టోబర్ నెలలో ఈ కారు భారీ స్థాయిలో అమ్ముడైంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇది ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్ల కారణంగా ఈ కారును కొనుగోలుదారులు పోటీపడి కొంటున్నారు. అక్టోబర్ 2025 నెలలో గ్లాంజా విక్రయాలు భారీగా పెరిగాయి.
టయోటా గ్లాంజా అమ్మకాల గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తోంది. గత నెలలో గ్లాంజా 6,162 యూనిట్లు అమ్ముడైంది. 2024 అక్టోబర్‌లో కేవలం 4,273 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 44% పెరిగాయి.

ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు అమ్మకాలు నెలకు సగటున 4,222 యూనిట్లు మాత్రమే ఉండేవి. అంటే, అక్టోబర్‌లో అమ్మకాల జోరు పెరిగింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ (GST) తగ్గించడం వలన కారు ధర కాస్త తగ్గింది. దీనికి దీపావళి పండుగ సీజన్ కూడా తోడవ్వడంతో కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
గ్లాంజా పోటీ ధరలలో లభిస్తుంది. దీని ధరలు అన్ని వర్గాల కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.39 లక్షలు కాగా, గరిష్ట ధర రూ.9.15 లక్షలు. ఇది E, S, G, V అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది.

టయోటా గ్లాంజా రెండు శక్తివంతమైన పవర్‌ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 90 bhp శక్తి, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ వేరియంట్ 22.35 నుంచి 22.94 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
ఇంకోటి 1.2 లీటర్ పెట్రోల్ + సీఎన్‌జీ ఇంజన్. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 77.5 bhp శక్తి, 4300 ఆర్‌పిఎమ్ వద్ద 98.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ ఏకంగా 30 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. గ్లాంజా ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంది. ఇది 5 సీట్ల లేఅవుట్‌లో లభిస్తుంది.

టయోటా గ్లాంజాలో 318 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180కిమీ. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), వీఎస్‌సీ (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








