కొత్త కారు కొనడానికి షోరూమ్‌కు వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి.. 30 కి.మీ మైలేజ్ కారు ధర పెరిగింది

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటినుంచో ఒక నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. కస్టమర్లలో నమ్మకం కలిగించడం, మైలేజ్, పనితీరు, అలాగే పనితీరు పరంగా ఈ కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎన్నో మోడల్స్‌ను విజయవంతంగా విక్రయిస్తున్న టయోటా, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కూడా మంచి మార్కెట్‌ను సాధించింది. ఇందులో ముఖ్యంగా గ్లాంజా (Glanza) మోడల్ వినియోగదారులలో విశేష ఆదరణ పొందుతోంది. స్మూత్ డ్రైవింగ్ అనుభవం, ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, టయోటా బ్రాండ్ నమ్మకం అన్ని కలిపి ఈ కారు కొనుగోలుదారులను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఇక తాజాగా ఈ కారు ధరలో మార్పు జరిగినట్లు సమాచారం. కొత్త టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ ధరను కంపెనీ సవరించింది.

పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ఇతర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధరలో స్వల్ప పెరుగుదల చేసింది. ఈ పెంపు వేరియంట్‌ను బట్టి ఉంది. గ్లాంజా S వేరియంట్ ధర రూ.12,000 పెరిగింది. E వేరియంట్‌పై రూ.9,000 అదనంగా చెల్లించాల్సింది. ఇక G వేరియంట్‌కు రూ.8,000 వరకు ధర పెరిగింది. దీంతో ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త ధరల ప్రకారం రూ. 6.99 లక్షల నుంచి రూ.10 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Toyota Hatchback Model Glanza Car Price Hiked

ధరల్లో మార్పు వచ్చినప్పటికీ, టయోటా గ్లాంజా తన ప్రత్యేకతను ఏమాత్రం కోల్పోలేదు. లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అద్భుతమైన విలువను అందించే కారు, ఇప్పటికీ యూత్ నుంచి ఫ్యామిలీ కస్టమర్ల వరకు అందరిని ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉక్కు, అల్యూమినియం వంటి ప్రాథమిక లోహాల ధరల పెరుగుదలతో పాటు, గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు కూడా వాహన తయారీ ఖర్చులను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఈ కారు ఇతర వివరాలను చూసినట్లయితే, కొత్త టయోటా గ్లాంజా ఇంజిన్ పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ రెండు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌లతో వస్తోంది. మొదటిది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పి హార్స్‌పవర్, 113 ఎన్ఎమ్ పీక్ టార్క్‌‌ను ఉత్పత్తి చేయగలదు. డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Toyota Hatchback Model Glanza Car Price Hiked

సిటీ డ్రైవ్స్ నుంచి హైవే రైడ్స్ వరకు స్మూత్ డ్రైవింగ్ అనుభవం కల్పించడంలో ఈ వేరియంట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మరోవైపు, రెండో వేరియంట్‌గా లభించే 1.2-లీటర్ పెట్రోల్/CNG ఇంజన్, ఎక్కువగా ఎకానమీ కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించబడింది. ఇది 77.5 బిహెచ్‌పి పవర్, 98.5 ఎన్ఎమ్ పీక్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది.

ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పరంగా కూడా గ్లాంజా వినియోగదారులను నిరాశపరచదు. వేరియంట్‌ను బట్టి ఇది కనిష్టంగా 22 kmpl నుంచి గరిష్టంగా 30.61 km/kg(CNG) వరకు మైలేజీని అందించగలదు. అంటే పెట్రోల్ వేరియంట్‌తో ప్రీమియం డ్రైవింగ్ అనుభవం పొందొచ్చు, CNG వేరియంట్‌తో మాత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయొచ్చు. భద్రత, సౌకర్యాల పరంగా గ్లాంజా తన సెగ్మెంట్‌లో ఒక స్టాండర్డ్ సెట్ చేస్తోంది. ప్రయాణికుల రక్షణకు అత్యాధునిక ఫీచర్లను అందించింది.

Toyota Hatchback Model Glanza Car Price Hiked

ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు ఉండటం వల్ల ముందువైపు, పక్కవైపు ఢీకొన్నా మంచి రక్షణ లభిస్తుంది. అదనంగా, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) సడన్ బ్రేక్‌ల సమయంలో వాహన నియంత్రణ కోల్పోకుండా చేస్తాయి. హైవేలో లేదా వంపు రోడ్లపై వెళ్తున్నప్పుడు VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్) వాహనాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఇవే కాకుండా ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 18, 2025, 10:45 [IST]
English summary
Toyota hatchback model glanza car price hiked more details inside check
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+