30 కి.మీల మైలేజ్ ఇచ్చే డిమాండ్ ఉన్న కారు.. దీన్ని కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతీ (Maruti), టయోటా (Toyota) సంయుక్తంగా కలిపి రూపొందించిన టయోటా గ్లాంజా మోడల్ ఇండియాలో బాగా ఆదరణ పొందింది. ఇది 2019లో మార్కెట్లోకి ప్రవేశించింది. చాలా మంది ఈ కారును కొనుగోలు చేశారు. సేల్స్ పరంగా టాటా ఆల్ట్రేస్‌‌ను సైతం అధిగమించింది. గత నెలలో గ్లాంజా సేల్స్ దాదాపు 2 లక్షల యూనిట్లను దాటడం గమనార్హం. దేశంలో లాంచ్ అయిన 5 ఏళ్ల తరువాత ఇప్పటి వరకు ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇన్ని లక్షల అమ్మకాలను దాటి కొత్త ఘనతను సాధించింది. ఇదిలా ఉంటే టయోటా కిర్లోస్కర్ మోటార్ (toyota kirloskar motor) ఇటీవల షాకింగ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలతో దూసుకుపోతున్న గ్లాంజా కారు ధరను పెంచింది. దీంతో దీన్ని కొనుగోలు చేయాలని అనుకున్న వారికి ఇది విచారం కలిగించే వార్త అని చెప్పవచ్చు.

5 ఏళ్ల నుంచి భారత్‌లో విజయవంతమైన మోడల్‌గా అవతరించిన ఈ కారు 2 లక్షల అమ్మకాలను నమోదు చేసి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇంత మంచి డిమాండ్ కారు ధరను పెంచడంతో కొత్త కస్టమర్లు ఇకపై మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధరను రూ.9,000 వరకు పెంచింది. దీని బేస్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.6.9 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి కొనుగోలుకు లభిస్తుంది.

Toyota Hiked The Price Of Glanza

టాప్ వేరియంట్ విషయానికి వస్తే, రూ. 10 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్రధానంగా గ్లాంజా మోడల్ E, S, G, V అనే నాలుగు వేరియంట్లలో కొనగోలుకు లభిస్తుంది . S, Gలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ధరలు రూ.9,000 పెరిగింది. ఇతర అన్ని వేరియంట్ల ధరలను రూ.4,000 పెంచారు. అయితే టాప్ వేరియంట్ v amt ధరలో మార్పులేదు.

మారుతీ సుజుకీ బాలెనో రీబ్రాడ్జ్ వెర్షన్‌గా వచ్చిన టయోటా గ్లాంజా డిజైన్ ఆకట్టుకుంటుంది. బాలెనోలో ఉన్నట్టుగా కాకుండా దీనిలో మరిన్ని ఫీచర్స్‌ను కొత్తగా ఇచ్చారు. అలాగే పాత వాటిని మరింత అప్‌డేట్ చేశారు. క్యాబిన్ లోపల యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ వాయిస్ అసిస్టెంట్, ముఖ్యంగా టయోటా ఐ-కనెక్ట్ సపోర్ట్ కూడా ఈ కారులో అందించడం విశేషం.

Toyota Glanza Price Details

టయోటా గ్లాంజా ఇంజిన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ రన్ అవుతుంది. 90 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌ ట్రాన్స్‌మిషన్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. అలాగే, గ్లాంజా ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌‌తో కొనుగోలుకు లభిస్తుంది. ఈ ఆప్షన్‌లో 77.5 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రయాణికుల రక్షణ పరంగా కూడా ఇది బెస్ట్ ఆప్షన్.

ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారికి సేఫ్టీ అందించడానికి 6 ఎయిర్‌బ్యాగులను కలిగి ఉంది. ఇంకా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, వంటి ఇతర భద్రతా ఫీచర్స్‌ను కూడా అందించారు. పెట్రోల్ మోడల్ 22.35 నుండి 22.94 కిమీ/లీ వరకు ఇస్తుంది. అదే NG మోడల్ మైలేజ్ 30.61 కి.మీ/కి.గ్రా వరకు వస్తుంది.

Toyota Glanza Price

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

Article Published On: Thursday, February 27, 2025, 15:07 [IST]
English summary
Toyota hiked the price of glanza up to rs 9000 here full details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+