దీన్ని చూస్తే అడవిలో జంతువులు కూడా దూరంగా ఉంటాయి.. అదిరిపోయే హిలక్స్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది

ఆటోమొబైల్ పరిశ్రమలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్(Toyota Kirloskar Motor) ఇండియాలో కొత్తగా పికప్ ట్రక్ హిలక్స్ బ్లాక్ ఎడిషన్‌ (Hilux Black Edition)ను విడుదల చేసింది. దీన్ని ఇటీవల జనవరి ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ఆవిష్కరించగా, ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం, దీని ప్రారంభ ధర రూ.37.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రీమియం కార్ల నుండి బడ్జెట్ ధరలో హ్యాచ్‌బ్యాక్‌ల వరకు పలు మోడళ్ల విడుదల చేస్తున్న టయోటా ఇప్పుడు ఈ కొత్త లాంచ్‌తో దాని మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటుంది. ఇది శక్తివంతమైన పెర్ఫామెన్స్‌ను అందిస్తుందని తయారీదారు ప్రత్యేకంగా పేర్కొంది.

ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి రెగ్యులర్ 'హిలక్స్'తో పోలిస్తే ఈ కొత్త మోడల్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. బ్లాక్ కలర్ థీమ్‌తో అందంగా కనిపిస్తుంది. అడవిలో ఇది ప్రయాణిస్తుంటే ఎదురుగా ఉన్న జంతువులు సైతం దూరంగా ఉండిపోయేలా దీని రూపం ఉంటుంది. రియర్ వ్యూ మిర్రర్లు, గ్రిల్, అల్లాయ్ వీల్స్, డోర్ హ్యాండిల్స్ మొత్తం కూడా నల్లగా మెరిసిపోతున్నాయి. ఈ కొత్త మోడల్ పాతదాని కంటే మరింత అప్‌డేట్ అయింది.

Toyota Hilux Black Edition

పాత మోడల్‌లో ఉన్న మాదిరిగానే ట్రక్ టెయిల్‌గేట్‌పై పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నటువంటి 'టయోటా' పేరును రాసి ఉంటుంది. ఎక్స్‌టీరియర్‌‌లో ప్రధానంగా కలర్ అందరిని కట్టిపడేసేలా ఉంది. ఇది ముందు భాగంలో ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు, రేడియేటర్ గ్రిల్, బ్లాక్ ఫెండర్ గార్నిష్, ఆకట్టుకునే 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో హిలక్స్ బ్లాక్ ఎడిషన్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇంటీరియర్ డిజైన్ కట్టిపడేస్తుంది. చాలా లగ్జరీ ఫీచర్స్‌ను దీనిలో అందించారు. ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, ఎనిమిది-వే పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-జోన్ పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌, డ్రైవర్లకు అనుకూలంగా ఉండే అధునాతన ఆప్షన్స్, స్మార్ట్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టం, చీకట్లో ప్రయాణిస్తున్న సమయంలో అనుకూలంగా ఉండటానికి ఆటోమేటిక్ డిమ్మింగ్‌తో వచ్చిన ఎలక్ట్రోక్రోమిక్ రియర్-వ్యూ మిర్రర్ వంటివి దీనిలో ఉన్నాయి.

కొత్త పికప్ ట్రక్కులో అనేక అత్యాధునిక ఫీచర్లకు ఎలాంటి కొదవ లేదు. అదనంగా పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, కంఫర్ట్‌గా ఉండేటటువంటి మెత్తని సీట్లు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి వాటిని ఇది కలిగి ఉంది. వీకెండ్స్‌లో, సెలవుల్లో దూర ప్రాంతాలకు సేద తీరడానికి వెళ్లడం కోసం మీ వెంట ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది బాగా సూట్ అవుతుంది.

కంపెనీ దీనిలో దాదాపు 435 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించింది. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, హిలక్స్ బ్లాక్ ఎడిషన్ 2.8-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 201.15 bhp పవర్, 500 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా పవర్‌ను అందుకుంటుంది. ఇది హైవేతో పాటు ఆఫ్‌రోడ్‌లో కూడా బాగా దూసుకుపోతుంది.

సేఫ్టీ విషయంలో కూడా ఇది మెరుగైన ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఏడు ఎయిర్‌బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ఆటోమేటిక్ హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ వంటి వాటిని కలిగి ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రస్తుతం ఓపెన్ అయ్యాయి. బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 8, 2025, 7:30 [IST]
English summary
Toyota hilux black edition launched in india at starting price rs 37 90 lakh
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+