మైలేజ్ కింగ్.. లీటరుకు 27కిమీ ఇచ్చే టయోటా కారుపై ఏకంగా రూ.1.5లక్షల తగ్గిపు

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఇయర్ ఎండ్ ఆపర్లతో ముందుకు వస్తాయి. అయితే, ఇండియన్ కస్టమర్లు కేవలం ఆఫర్‌లు ఉన్నాయని కాకుండా, తమకు ఇష్టమైన, ప్రజాదరణ పొందిన మోడళ్లకు ఆఫర్లు ఉంటేనే షోరూమ్‌లకు క్యూ కడతారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు టయోటా షోరూమ్‌లలో కనిపించబోతోంది. ఎందుకంటే లీటర్‌కు 27 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) ఎస్‌యూవీపై ఏకంగా రూ.1.50 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించారు.

హైరైడర్ మోడల్‌పై ప్రకటించిన ఆఫర్లలో అత్యధిక ప్రయోజనం హైబ్రిడ్ వేరియంట్లపై ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్స్‌పై రూ.96,100 ఎక్స్ఛేంజ్/క్యాష్/కార్పొరేట్ బోనస్‌లతో పాటు, అదనంగా రూ.50,000 లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. దీనితో కలుపుకొని మొత్తం ప్రయోజనాలు రూ.1.50 లక్షలకు చేరుకుంటుంది.

Toyota Hyryder December Offer Get Up to Rs 1 5 Lakh Discount on the 27 kmpl Mileage SUV

ఇక సిఎన్‌జి (CNG) మోడల్‌పై రూ.74,000 ఇతర బోనస్‌లు, రూ.50,000 లాయల్టీ బోనస్‌తో కలిపి మొత్తం రూ.1.24 లక్షల తగ్గింపు ఉంది. మైల్డ్-హైబ్రిడ్ (నియోడ్రైవ్) వేరియంట్ల విషయానికి వస్తే, G, V వేరియంట్లపై రూ.1.22 లక్షలు (రూ.62,000 + రూ.50,000 లాయల్టీ), E నియోడ్రైవ్ వేరియంట్‌పై రూ.1.10 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీ మూడు ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది
NA పెట్రోల్ (నియోడ్రైవ్): ఇది మారుతి సుజుకి అభివృద్ధి చేసిన 1.5 లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ యూనిట్. ఇది 102 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Toyota Hyryder December Offer Get Up to Rs 1 5 Lakh Discount on the 27 kmpl Mileage SUV

స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్: టయోటా సొంతంగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ యూనిట్. ఇది 116 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ మోడలే 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ, కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది. సిఎన్‌జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

కొత్త GST ప్రకారం టయోటా ఎస్‌యూవీ ధరలు ఇటీవల రూ.11.34 లక్షల నుంచి రూ.19.99 లక్షల నుంచి రూ.10.94 లక్షల నుంచి రూ.19.57 లక్షల మధ్యకు మారాయి. తగ్గిన ధరపై ఇప్పుడు ఈ డిసెంబర్ ఆఫర్లు లభించడం వినియోగదారులకు మరింత లాభదాయకం.

Toyota Hyryder December Offer Get Up to Rs 1 5 Lakh Discount on the 27 kmpl Mileage SUV

ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంది. ఈ ఇయర్ ఎండ్ ఆఫర్ల ప్రయోజనాన్ని పూర్తిగా పొందడానికి, కస్టమర్లు తమ దగ్గరలోని టయోటా డీలర్‌షిప్‌ను సంప్రదించి, ఖచ్చితమైన ఆఫర్ వివరాలను తెలుసుకోవడం, వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయడం మంచిది. 2025 మోడల్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి.

మొత్తం మీద టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కొనుగోలు చేయాలనుకునే వారికి డిసెంబర్ 2025 ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా లీటర్‌కు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ.1.50 లక్షల వరకు లభించే భారీ తగ్గింపు, ఇది కేవలం డబ్బు ఆదా చేసే డీల్ మాత్రమే కాదు, పర్యావరణ అనుకూలమైన, అత్యాధునిక ఎస్‌యూవీని సొంతం చేసుకునే గొప్ప మార్గం.

అయితే ఈ ఆఫర్లు స్టాక్, ప్రాంతాన్ని బట్టి మారుతాయి కాబట్టి, మీకు నచ్చిన మోడల్‌ను త్వరగా బుక్ చేసుకోవడానికి, వెంటనే మీ సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌ను సంప్రదించడం, టెస్ట్ డ్రైవ్ చేయడం శ్రేయస్కరం.

More from DriveSpark

Article Published On: Wednesday, December 10, 2025, 11:11 [IST]
English summary
Toyota hyryder december offer get up to rs 1 5 lakh discount on the 27 kmpl mileage suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+