ఈసారి ఆట వేరు.. స్కోరు వేరు! హైరైడర్‌కి విపరీతమైన క్రేజ్.. అమ్మకాల రికార్డే సాక్ష్యం బ్రదర్!

ప్రముఖ వాహన తయారీ కంపెనీలు అయినటువంటి టయోటా (Toyota), మారుతీ సుజుకీ (maruti suzuki) మధ్య జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్యం అనేక వినూత్న మోడళ్లకు రూపకల్పన చేసింది. ప్రత్యేకించి, టయోటా హైరైడర్ (Toyota Hyryder), మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా రెండు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారయ్యాయి. కానీ ఈసారి ఆ భాగస్వామ్యంలో మారుతీ మాత్రమే లాభపడలేదు, టయోటా తన భాగస్వామిని అధిగమిస్తూ కొత్త రికార్డు నెలకొల్పింది.

2024 మే నెల టయోటాకు ఒక మైలురాయిగా నిలిచింది. ఆ నెలలో కంపెనీ మొత్తం 29,280 వాహనాలను విక్రయించి, గత ఏడాది మేలో నమోదైన 23,959 వాహనాల మార్కును అధిగమించింది. ఇది 22 శాతం అమ్మకాల వృద్ధి అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సేల్స్‌లో ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లు ముఖ్యపాత్ర పోషించాయి. వీటి స్థిరమైన డిమాండ్‌ కంపెనీకి నిలకడైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

Toyota Hyryder May 2025 Sale

అంతేకాక, టయోటా హైరైడర్ (Toyota Hyryder) ఈ విజయాన్ని మరింత పెంచింది. ఈ SUV మే నెలలో మొత్తం 7,573 యూనిట్లు అమ్ముడవడం ద్వారా ఆకట్టుకుంది. ఇది గత ఏడాది అదే నెలలో నమోదైన 3,906 యూనిట్లతో పోలిస్తే ఏకంగా 94 శాతం వృద్ధి అని చెప్పొచ్చు. నెలవారీగా చూస్తే కూడా 63 శాతం పెరుగుదల నమోదు కావడం విశేషం. కంపెనీకి పెద్ద సంతోషం కలిగించే విషయం అని చెప్పాలి.

టయోటా హైరైడర్ బేస్ వేరియంట్ పెట్రోల్ మెడల్ ధర వచ్చేసి రూ.11.34 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ధర నగరాలను బట్టి మారుతుంది. హైదరాబాద్‌లో దీని ఆన్‌రోడ్ ధర రూ.13.92 లక్షల వరకు ఉంది. టయోటా ఇటీవల తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. తాజా అప్‌డేట్స్‌తో ఇది మార్కెట్‌లో మరింత పోటీకి సిద్ధమవుతోంది.

Hyryder May 2025 Sales 94 Percent Growth

ఈ అప్‌డేట్‌లు వినియోగదారులకు మెరుగైన భద్రత, సౌకర్యం, ఇంకా తక్కువ శ్రమతో డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు ఉద్దేశించబడ్డాయి. అత్యంత ప్రధానమైన మార్పులలో ఎయిర్‌బ్యాగ్ భద్రతకు సంబంధించిన కీలక చర్య ఒకటి. ఇప్పటి నుంచి హైరైడర్‌కు చెందిన అన్ని వేరియంట్‌లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అందుబాటులో ఉంటాయి. ఈ మార్పు వినియోగదారుల భద్రతను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా, క్రాష్ సమయంలో ప్రయాణికులకు రక్షణ కల్పించేలా ఇతర మార్పులు కూడా చేయబడ్డాయి.

ఇవి హైరైడర్‌ను మరింత బలమైన, నమ్మకమైన ఎస్‌యూవీగా నిలబెడుతున్నాయి. ఈసారి టయోటా, ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB) వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది కారును నిలిపివేయడంలో మరింత సౌలభ్యం, భద్రతను అందిస్తుంది. టెక్నాలజీ ప్రియులకు ఇది ఓ ముఖ్యమైన ఆకర్షణగా మారుతోంది. మరో కీలక అప్‌డేట్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.

Toyota Hyryder

ఇది ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను భర్తీ చేస్తోంది. ఈ మార్పు హైరైడర్ డ్రైవింగ్ అనుభూతిని మరింత సాఫీగా, సులభంగా మార్చేలా చేస్తోంది. ఈ విధంగా, భద్రతా ఫీచర్ల నుంచి, డ్రైవింగ్ టెక్నాలజీ వరకు అనేక కీలక అంశాల్లో మార్పులు చేసి, టయోటా హైరైడర్ మరింత అభివృద్ధి చెందింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీలో తన స్థానాన్ని బలపరుచుకునే దిశగా ఇది తీసుకున్న వ్యూహాత్మక అడుగులుగా చెప్పొచ్చు.

ముఖ్యంగా, టాప్ వేరియంట్ వినియోగదారులకు అందించే సౌకర్యాల పరంగా మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ వేరియంట్‌లో 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అమర్చబడింది. దీని ద్వారా డ్రైవింగ్ పొజిషన్‌ను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే వీలుంది, దూర ప్రయాణాల్లో మరింత ఆరామాన్ని కల్పిస్తుంది. అలాగే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు* వేసవిలో చల్లదనాన్ని ఇచ్చి, ప్రయాణాన్ని హాయిగా మార్చేస్తాయి.

More from DriveSpark

Article Published On: Sunday, June 15, 2025, 11:00 [IST]
English summary
Toyota hyryder may 2025 sales 94 percent growth recorded compared to previous
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+