20ఏళ్లుగా మార్కెట్లో తిరుగులేని రాజు..ఆ పేరు కోసమే జనాలు అప్పు చేసి మరీ కొంటున్నారు..అది దాని క్రేజ్
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో టయోటా ఇన్నోవా (Toyota Innova) అనేది కేవలం ఒక కారు కాదు, అది విశ్వసనీయతకు, నాణ్యతకు ఒక బ్రాండ్ నేమ్. 2005లో ఒకప్పటి క్వాలిస్ (Qualis) స్థానంలో ఈ కారును తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పవరకు ఇన్నోవా పేరుతోనే ఈ కారు దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇన్నోవా తన సెగ్మెంట్‌ను శాసించింది. అందుకే ఇప్పటికీ కుటుంబ ప్రయాణాలకు, వాణిజ్య అవసరాలకు మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఇన్నోవా పేరు మీద టయోటా సృష్టించిన రికార్డులు చాలా గొప్పవి. సెలబ్రిటీలకు, పొలిటీషియన్లను ఈ కారు ఫేవరెట్. ఎమ్మెల్యే, ఎంపీల కాన్వాయ్ లలో ఈ కారు తప్పనిసరి ఉండాల్సిందే.

ఇన్నోవా విజయాన్ని అమ్మకాల సంఖ్య అద్దం పడుతోంది. ఈ 20 ఏళ్ల కాలంలో ఇన్నోవా (Innova), ఇన్నోవా క్రిస్టా (Innova Crysta), కొత్తగా వచ్చిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) మోడళ్లు అన్నీ కలిపి దేశంలో 12 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించాయి. ఇది నిజంగా అద్భుతమైన సేల్స్ మైలురాయి.
ప్రతి నెలా బలమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేయడమే ఇలాంటి ఘనతను సాధించడానికి ముఖ్య కారణం. కస్టమర్లలో ఇన్నోవాపై ఉన్న నమ్మకం, దాని రీసేల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉండటం ఈ స్థిరమైన వృద్ధికి ప్రధాన కారణాలు. ఇతర నెలలతో పోలిస్తే అక్టోబర్ 2025లో ఇన్నోవా అమ్మకాలు మరింత దూకుడుగా ఉన్నాయి. అక్టోబర్ నెలలో 11,089 యూనిట్ల (క్రిస్టా + హైక్రాస్ కలిపి) అమ్మకాలు జరిగాయి.

గతేడాది 2024 అక్టోబర్‌లో కేవలం 8,838 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, గతేడాదితో పోలిస్తే ఇన్నోవా అమ్మకాలు ఏకంగా 25 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ గణాంకాలు సెగ్మెంట్‌లో ఇన్నోవా స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.
టయోటా ఇన్నోవా ప్రస్తుతానికి రెండు ప్రధాన మోడళ్లలో అందుబాటులో ఉంది.. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్. ఈ రెండు మోడళ్లు కూడా పెద్ద ఫ్యామిలీలకు అనుకూలంగా ఉండేలా 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.18.66 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.25.36 లక్షల వరకు ఉంది. ఇది పాత డిజైన్ లవర్‌లను, డీజిల్ ఇంజన్ కావాలనుకునే వారిని ఆకర్షిస్తోంది.

మరోవైపు మరింత ప్రీమియం, హైబ్రిడ్ ఆప్షన్లలో లభించే ఇన్నోవా హైక్రాస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.18.06 లక్షల నుంచి మొదలై, టాప్ వేరియంట్ రూ.31.90 లక్షల వరకు ఉంది. ఇందులో కొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, మెరుగైన ఇంటీరియర్ సౌకర్యాలు ఉన్నాయి. టయోటా ఇన్నోవా అనేది తమ డబ్బుకు సరైన విలువ, బిల్డ్ క్వాలిటీ, ఎక్కువ కాలం మన్నే నమ్మకం కోసం చూసే వినియోగదారులకు ఎల్లప్పుడూ బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








