చాలా మంది గుడ్డిగా ఈ 8 సీటర్ కారును కొంటున్నారు.. కుటుంబం మొత్తం ఒకే ట్రిప్‌లో వెళ్ళొచ్చు
భారత్‌లో కార్ల అమ్మకాల్లో మెరుగైన గణంకాలను సాధిస్తూ ఇతర వాహన తయారీదారులకు గట్టి పోటీగా నిలుస్తున్న టయోటా(Toyota) గురించి అందరికీ తెలిసిందే. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కార్ల సంస్థలకు పోటీగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధి చెందిన వాహన కంపెనీగా పేరొందింది. టయోటా నుంచి గతంలో విడుదల అయిన ఇన్నోవా(Innova) మోడల్ కారకు దేశీయంగా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం టయోటా ఇన్నోవా క్రిస్టా(Crysta), ఇన్నోవా హైక్రాస్ (Hycross) అనే రెండు వెర్షన్లను విక్రయిస్తుంది. సాధారణంగా ఇన్నోవా కార్లకు భారతీయ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో టయోటా ఇన్నోవా కార్లు గత ఏడాది డిసెంబర్ నెలలో మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. తాజాగా టయోటా నుంచి విడుదల అయిన డేటా ప్రకారం, 2024 డిసెంబర్ నెలలో మొత్తం 9,700 టయోటా ఇన్నోవా కార్లు అమ్ముడుపోయాయి.
టయోటా కంపెనీ డిసెంబర్ చివరి నెల విక్రయాల నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తం అమ్మకాల్లో ఇన్నోవా క్రిస్టా- హైక్రాస్ వెర్షన్లు ఉన్నాయి. గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో ఈ సేల్స్ సంఖ్య 7,832గా మాత్రమే ఉంది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 24 శాతం వృద్దిని నమోదు చేసింది. టయోటా కార్ల అమ్మకాలు చాలా కాలంగా పుంజుకుంటున్నాయని పేర్కొనడానికి ఈ గణంకాలే నిదర్శనం.

ముఖ్యంగా ఇన్నోవా కార్లకు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్ ధర రూ.19.99 లక్షలుగా ఉంది. అదే, దీని టాప్ వేరియంట్ ధర ఏకంగా రూ.26.55 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఇన్నోవా హైక్రాస్ బేస్ వేరియంట్ ధర రూ.19.94 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర.
అదే టాప్ వేరియంట్ ధర రూ.31.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌లో లభిస్తుంది. పెట్రోల్ అయితే cvt గేర్‌బాక్స్, హైబ్రిడ్ అయితే e-cvt గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ కారులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇన్నోవా క్రిస్టా బేస్ విషయానికి వస్తే, ఇది 7 సీటర్, 8 సీటర్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇది 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జత చేయబడింది. దీనిలో అదిరిపోయే కొత్త ఫీచర్స్ ఉన్నాయి. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం వంటి ఉన్నాయి.
ఇంకా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రయాణికుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఇతర అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది GX, GX Plus, VX, ZX అనే వేరియంట్లలో లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








