లగ్జరీగా ఉండాలి.. ఫ్యామిలీకి సరిపోవాలంటే ఇన్నోవాకు బెస్ట్ ఆల్టర్నేటివ్ కార్లు ఇవే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్స్

ప్రస్తుతం భారత మార్కెట్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక పాపులర్ MPV. దీని ధర రూ.19.94లక్షల నుండి రూ.32.58లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. లీటరుకు 21కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 7లేదా8 సీట్ల ఆప్షన్స్‌తో వస్తుంది. అయితే, ఇన్నోవా హైక్రాస్ మాత్రమే కాదు.. దీనికి పోటీగా మార్కెట్‌లో మరికొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి, వాటి ధరలు, ఫీచర్స్ ఏంటో చూద్దాం.

ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు మార్కెట్‌లో లీడింగ్ MPVగా నిలిచింది. ఇది పెట్రోల్, హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. లీటరుకు 21కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7లేదా8 సీట్లు ఉంటాయి. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లేతో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 6ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉన్నాయి. 'ఇన్నోవా హైక్రాస్' MPVకి ఆల్టర్నేటివ్‌గా ఈ 3పాపులర్ కార్లను కొనొచ్చు.

Toyota Innova Hycross

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto): ఇదొక MPV టయోటా ఇన్నోవా హైక్రాస్‎కి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. దీని ధర రూ.25.51 లక్షల నుండి రూ.29.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో కూడా 7 లేదా 8 సీట్ల ఆప్షన్స్ ఉన్నాయి. ప్రయాణికులు ఈజీగా జర్నీ చేయొచ్చు. వీకెండ్ ట్రిప్స్‌కి లేదా హాలిడేస్‌లో ఎక్కువ లగేజ్ కోసం 239 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

ఈ MPV హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్‌తో వస్తుంది. లీటరుకు 23కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

Invicto

కియా క్యారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis): ఇది కూడా ఒక MPV, టయోటా ఇన్నోవా హైక్రాస్ MPVకి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఈ కారు ధర రూ.11.50 లక్షల నుండి రూ.21.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 6, 7 సీట్ల ఆప్షన్స్ ఉన్నాయి. 216 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

ఈ MPV పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది, 15 నుంచి 19కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25-అంగుళాలు), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, 9-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

Kia Carens

టాటా సఫారి (Tata Safari): ఇది ఒక SUV. 'టయోటా ఇన్నోవా హైక్రాస్' MPVకి ఇది ఒక ఆల్టర్నేటివ్‌గా నిలిచింది. ఈ కారు ధర రూ.15.50 లక్షల నుండి రూ.27.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 6 లేదా 7 సీట్ల ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ ట్రిప్స్‌కి ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి 420 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

ఈ కారు చాలా పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది,. లీటరుకు16కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (12.3-అంగుళాలు), వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్‌తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

Tata Safari

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక మంచి MPV అయినప్పటికీ, మారుతి సుజుకి ఇన్విక్టో, కియా క్యారెన్స్ క్లావిస్, టాటా సఫారి వంటి కార్లు కూడా మంచి ఆల్టర్నేటివ్స్‌గా ఉన్నాయి. మీ బడ్జెట్, ఫీచర్స్, అవసరాలను బట్టి ఈ కార్లను ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, June 6, 2025, 17:06 [IST]
English summary
Toyota innova hycross 8 seater mpv alternatives check these 3 popular cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+