8 మంది హాయిగా కలిసి టూర్‌కు వెళ్లొచ్చు.. పైగా లగేజీకి సరిపోయే స్థలం.. టయోటా నుంచి అదిరిపోయే ప్రత్యేక ఎడిషన్‌

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టయోటా తన ప్రముఖ MPV మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్‌కు ఓ ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. "ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్" అనే పేరుతో ఈ వేరియంట్ మే 2025 నుంచి జూలై 2025 మధ్యకాలంలో మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రీమియం డిజైన్‌ను ప్రాతినిధ్యం వహించే ఈ మోడల్‌ ధర రూ. 32.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించబడింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఇన్నోవా హైక్రాస్‌ టాప్-ఎండ్ ZX (O) వేరియంట్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇది రెండు ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌ సూపర్ వైట్, పెర్ల్ వైట్‌లలో అందించబడుతోంది. ఇది బ్లాక్ కలర్‌తో స్టైలింగ్ హైలైట్స్, బాడీపై ప్రత్యేక డిజైన్‌తో సాధారణ మోడళ్లకంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కేవలం ఫంక్షనాలిటీ కాకుండా, ఫ్యాషన్‌కు, విలాసానికి ప్రాముఖ్యతనిస్తూ, ప్రత్యేకమైన రూపంలో రూపుదిద్దుకుంది. ఇది వినియోగదారులకు పరిమిత సంఖ్యలో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కేవలం స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తోనే అందుబాటులో ఉంటుంది. 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల స్ట్రాంగ్-హైబ్రిడ్ యూనిట్ కనిపిస్తుంది, ఇది గరిష్టంగా 186 హెచ్‌పీ శక్తిని, 206 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Toyota Innova Hycross Exclusive Edition

ఈ ఇంజన్ e-CVT ట్రాన్స్మిషన్‌తో జత చేయబడి ఉంది, తద్వారా స్మూత్‌ డ్రైవింగ్ అనుభూతి, మెరుగైన మైలేజ్ అందుతుంది. టయోటా ప్రకారం, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 23.24 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదని తెలిపింది. ఈ ఎడిషన్‌ ZX (O) వేరియంట్‌లో ఇప్పటికే ఉన్న ప్రీమియం ఫీచర్లను అలాగే కొనసాగిస్తుంది. రెండవ వరుసలో ఉన్న కెప్టెన్ సీట్లు పవర్డ్ ఒట్టోమన్ ఫంక్షన్‌తో వస్తుండగా, ముందు సీట్లు వెంటిలేటెడ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి.

అలాగే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్ ఇవ్వడం కూడా వినియోగదారులు నచ్చే అంశం అని చెప్పవచ్చు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ ప్రీమియం అనుభూతిని ముందుకు తీసుకెళ్లేలా రూపొందించబడింది. ఈ వేరియంట్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్, లెగ్ రూమ్ లాంప్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ వంటి సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి మరింత స్వచ్చమైన గాలిని, శరీరానికి అనుకూలమైన ఆహ్లాదకరమైన అనుభూతిని, టెక్నాలజీని అందిస్తాయి.

Toyota Innova Hycross Edition

ఇప్పటికే ZX (O) వేరియంట్‌లో ఉన్న లగ్జరీ ఫీచర్లు, రెండవ వరుసలో ఉన్న పవర్డ్ ఒట్టోమన్ సీట్లు, విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఈ కొత్త మోడల్‌లో అందించడం ద్వారా కారుకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. ఇవన్నీ కలిపి, దీన్ని ఒక విలాసవంతమైన కారుగా మారుస్తున్నాయి. భద్రత కోసం అవసరమైన ADAS సూట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కేవలం ఫంక్షనాలిటీ కాకుండా, ఫ్యాషన్‌కు, విలాసానికి ప్రాముఖ్యతనిస్తూ, ప్రత్యేకమైన రూపంలో రూపుదిద్దుకుంది. పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ ఎడిషన్ కావడంతో, ప్రత్యేకతను కోరుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుడనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 3, 2025, 7:30 [IST]
English summary
Toyota innova hycross exclusive edition launch price specifications details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+