సెలబ్రిటీలకు పెద్ద షాక్ ఇచ్చిన టయోటా.. ఇక పై ఆ కారు కొనాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందే
భారత మార్కెట్లో విశ్వసనీయతకు మారుపేరైన టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రా ఎమ్‌పీవీ ఇప్పుడు మరింత ఖరీదైంది. ఈ పెద్ద సైజు కారు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. తాజాగా, ఈ హైక్రాస్ ఎమ్‌పీవీ ధరలు పెరిగాయని ఒక ప్రైవేట్ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. ఏ వేరియంట్‌కు ఎంత ధర పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ కార్ల GX 7-సీటర్, GX 8-సీటర్ వేరియంట్‌ల ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. అయితే, GX (O) 7-సీటర్, GX (O) 8-సీటర్ వేరియంట్‌ల ధరలు రూ.11,000 పెరిగాయి.

అదే విధంగా, 7/8 సీటర్ ఆప్షన్లలో లభించే VX హైబ్రిడ్, VX (O) హైబ్రిడ్, ZX హైబ్రిడ్, ZX (O) హైబ్రిడ్ వేరియంట్‌ల ధరలు ఒక్కొక్కటి రూ.15,000 పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో, ఇన్నోవా హైక్రాస్ MPV ధరలు ఇప్పుడు రూ.19.94 లక్షల నుండి రూ.31.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ అత్యంత ఆధునిక డిజైన్‌ను కలిగి ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. ఇది ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్ రంగులలో కూడా అందుబాటులో ఉంది. దీని కొలతల విషయానికి వస్తే 4755mm పొడవు, 1845mm వెడల్పు, 1795mm ఎత్తు ఉంటుంది. 185mm గ్రౌండ్ క్లియరెన్స్, 2850mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

కొత్త కారు 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 2.0-లీటర్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) ఇంజిన్‌లను కలిగి ఉంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. సుమారు లీటరుకు 23 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలదు. 52 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.
కొత్త ఇన్నోవా హైక్రాస్ MPV క్యాబిన్ డిజైన్ చాలా ఆకట్టుకుంటుంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో AC , వెనుక AC వెంట్‌లు వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ కారు భద్రతకు కూడా పేరుగాంచింది. భారత్ ఎన్‌సిఎపి నిర్వహించిన పరీక్షలలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS (టైర్-ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టా MPV కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.19.99 లక్షల నుండి రూ.27.08 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ప్లాటినం వైట్ పెర్ల్, సూపర్ వైట్, సిల్వర్ మెటాలిక్ రంగులలో లభిస్తుంది.
2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. సుమారు 8 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలదు. 7/8 సీట్లను కలిగి ఉంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా పలు ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








