ఈ కారుని ఇప్పుడు బుక్ చేసుకుంటే మీ ఇంటికి వచ్చేసరికి ఏడాది పైనే పడుతుంది.. దానికున్న క్రేజ్ అలాంటిది మరి!!
టయోటా ఇన్నోవా అంటే ఒకప్పుడు కేవలం ఫ్యామిలీ కార్ మాత్రమే కాదు, అది ఒక స్టేటస్ సింబల్. ఇప్పటికీ ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్తగా వస్తున్న మోడల్స్ క్రిస్టా, హైక్రాస్‌లకు అయితే విపరీతమైన డిమాండ్.. కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. మరి అంతలా ఎందుకు కొంటున్నారు? డెలివరీ కోసం ఏకంగా ఏడాది వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? తెలుసుకుందాం
టయోటా ఇన్నోవాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాపులర్ ఎంపీవీ క్రిస్టా, హైక్రాస్ రూపాల్లో అందుబాటులో ఉండటంతో, వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా, ఈ రెండు మోడళ్లకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో వీటి డెలివరీ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా విషయానికి వస్తే, బెంగళూరులో ఈరోజు బుక్ చేసుకుంటే వినియోగదారులకు 2 నెలల తర్వాత డెలివరీ లభిస్తుంది. ఇదే కారును ఢిల్లీలో 4 నెలలు, ముంబైలో 2 నుండి 3 నెలలు, హైదరాబాద్‌లో 3 నెలలు, పూణేలో ఒక నెల, చెన్నైలో 4 నెలలు, జైపూర్‌లో 3 నెలలు, లక్నోలో 2 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది.
ఇక టయోటా ఇన్నోవా హైక్రాస్ విషయానికి వస్తే, దీని వెయిటింగ్ పీరియడ్ మరింత ఎక్కువగా ఉంది. బెంగళూరులో ఈ కారు కోసం 10 నెలలు వేచి చూడాలి. ఢిల్లీలో ఏకంగా ఒక సంవత్సరం, ముంబైలో 3 నుండి 4 నెలలు, హైదరాబాద్‌లో 8 నెలలు, పూణేలో 1 సంవత్సరం, చెన్నైలో 4 నెలలు, జైపూర్‌లో 10 నుండి 12 నెలల తర్వాత ఇన్నోవా హైక్రాస్ డెలివరీ అందుతుంది.

ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ. 19.99 లక్షల నుండి రూ. 26.82 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 2.4-లీటర్ డీజిల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 8 కిమీ వరకు ఉంటుంది.
ఈ కారు 7, 8 సీట్ల ఆప్షన్‌లలో లభిస్తుంది. 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.94 లక్షల నుండి రూ. 31.34 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఇది 2-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), 2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరకు 16.13 నుండి 23.24కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 7, 8 సీట్ల ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








