ఈ కారుతో రోడ్డెక్కితే అందరి చూపు మీపైనే! కొనమంటే మాత్రం ఒక్కరు కూడా కొనలేదు..ఎందుకో తెలుసా?
టయోటా (Toyota) భారతదేశంలో జూన్ 2025 నెలలో మొత్తం 26,453 వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 25,752 వాహనాలతో పోలిస్తే కొంత మేరకు వృద్ధినే సూచిస్తోంది. అయితే, ఈ గణాంకాల్లోని ఓ ఆసక్తికరమైన అంశం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అదే టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Land Cruiser 300). గత కొన్ని సంవత్సరాలుగా ఈ మోడల్‌ను విక్రయించడంలో కంపెనీకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగతా మోడళ్లు ఆశించిన మేరకు సేల్ అవుతున్నప్పటికి జూన్ నెలలో ఇది మాత్రం ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. అధిక ధర, పరిమిత సంఖ్యలో లభించడం, వంటి కారణాల వల్ల ఈ కారుకు మార్కెట్లో వాస్తవంగా డిమాండ్ తక్కువగానే ఉంది.
తక్కువ అమ్మకాలు నమోదవుతున్నప్పటికీ, టయోటా మాత్రం ల్యాండ్ క్రూయిజర్ 300 మోడల్‌ను ఇంకా తమ ఉత్పత్తుల జాబితాలో కొనసాగిస్తోంది. దీనిపై కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వకపోయినా, గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగించేందుకు, లేదా స్పెషల్ ఆర్డర్ ప్రాతిపదికన కొన్ని వర్గాల కోసం దీనిని అందుబాటులో ఉంచివుండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 పేరే చెబుతున్నట్టు ఇది ఒక లగ్జరీ SUV.

శక్తివంతమైన పనితీరు, రాబస్టు డిజైన్, ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, దీనికి తగినంత మంది కొనుగోలుదారులు లేరు. అందుబాటులో ఉన్న వేరియంట్ల ధరలు రూ.2 కోట్లకు పైగా ఉండడం, చాలా మందికి ఇది డ్రీమ్ కార్ గానే మిగిలిపోతున్నదనడానికి కారణమవుతోంది.భారత మార్కెట్లో ఈ మెగా SUVకి అభిమానం ఉన్నా, అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. ధరను చూసి చాలా మంది కొనడానికి ముందుకు రావడం లేదు.
ఇతర కార్లకు సాధారణంగా లభించని శక్తివంతమైన ఇంజిన్‌లు, ల్యాండ్ క్రూయిజర్ 300కి అందించబడ్డాయి. ఇందులో రెండు శక్తిమంతమైన డీజిల్ టర్బోచార్జ్డ్ V6 ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. మొదటిది 3.5-లీటర్ ట్విన్-టర్బో V6, దీని నుండి 415 PS పవర్‌తో పాటు 650 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇది గోప్ప ఆఫ్-రోడ్ పరిస్థితుల్లోనూ దూసుకెళ్లగల శక్తిని కలిగి ఉంటుంది. ఇక రెండవది 3.3-లీటర్ ట్విన్-టర్బో V6 డీజిల్ ఇంజిన్.

ఇది 309 PS శక్తిని, 700 Nm టార్క్‌ను అందిస్తుంది. టార్క్ ఎక్కువగా ఉండటం వలన ఈ వేరియంట్ పాత రోడ్లలోనూ సమర్థంగా నడవగలదు. ఈ రెండు ఇంజిన్‌లను 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేసిన టయోటా, డ్రైవింగ్ అనుభూతిని మరింత సాఫీగా, ప్రీమియంగా మార్చింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ రూపం, గట్టి బాడీ నిర్మాణం, ఆధునిక హంగులతో కూడిన రెట్రో లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
ఇందులో ఉన్న ప్రతి డిజైన్ డీటెయిల్ కారును ప్రత్యేకంగా నిలబెడుతుంది, అది ముందు భాగంలో హుడ్ అయినా సరే, క్లాసిక్ మినీమలిస్టిక్ చూపించే గుండ్రని హెడ్‌లైట్లు అయినా సరే. హెడ్లైట్‌ల చుట్టూ ఉన్న DRL, క్రిస్టల్ క్లియర్ LED ఫాగ్ లైట్ల సానుకూలంగా వెలిగే వెలుగూ, అన్నీ కలిసి ఈ కారుకు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఎక్స్‌టీరియర్ రివైవల్ డిజైన్‌లా ఫీల్ ఇస్తూ, క్లాసిక్ ల్యాండ్ క్రూయిజర్‌లను తలపిస్తాయి.

సైడ్ స్టెప్పర్, బ్లాక్ కలర్ ఫెండర్లు, గట్టి బాడీ లైన్‌లు ఈ SUVకి కొత్త ఫీల్‌ను ఇస్తాయి. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, దాని మాస్‌ను హైలైట్ చేస్తాయి. అంతే కాదు, ల్యాండ్ క్రూయిజర్ ఇంటీరియర్ కూడా అదే స్థాయిలో ఫీనిష్, డీటెయిల్, రిఫైన్‌మెంట్‌ను చూపిస్తుంది. ఇంటీరియర్‌లో ఉపయోగించిన సిల్వర్ AC వెంట్స్, డ్యాష్‌బోర్డ్, ఇంకా సెంటర్ కన్సోల్‌లో Land Cruiser లోగో, ఈ SUVకి విలాసవంతమైన లుక్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications