ఇక పై అందరికీ అందుబాటులో ల్యాండ్ క్రూయిజర్‌.. టయోటా మాస్టార్ ప్లాన్ ఇదే!

మనదేశంలో SUV మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్‌కు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అయితే, అధిక ధర కారణంగా చాలా మంది కొనుగోలుదారులు దానిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టయోటా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. అదేంటంటే, ఫార్చ్యూనర్‌కు మరింత సరసమైన ధరలో ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఈ కొత్త SUVనే టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ.

టయోటా వినూత్న IMV 0 మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ ల్యాండ్ క్రూయిజర్ FJను రూపొందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిపై వివిధ రకాల బాడీ స్టైల్స్‌ను, కాన్ఫిగరేషన్‌లను రూపొందించవచ్చు. ఇప్పటికే టయోటా ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి Hilux Champఅనే బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో ఫార్చ్యూనర్‌కు మరింత అందుబాటు ధరలో ఉండే వెర్షన్‌ను ల్యాండ్ క్రూయిజర్ FJ పేరుతో తీసుకురావడానికి టయోటా సన్నాహాలు చేస్తోంది.

Toyota Land Cruiser FJ Front

కొత్తగా రాబోయే ల్యాండ్ క్రూయిజర్ FJ డిజైన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. SUV హెడ్‌లైట్లు గుండ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఇటీవల విడుదలైన ల్యాండ్ క్రూయిజర్ 250లో ఉన్న చతురస్రాకారపు హెడ్‌లైట్లను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. బహుశా, LC 250 వలె, గుండ్రని, చతురస్రాకారపు హెడ్‌లైట్ ఆఫ్షన్లు రెండూ అందుబాగులో ఉండొచ్చు.

దీని కొలతల విషయానికి వస్తే, పొడవు 4,550మిమీ, వెడల్పు 1,830మిమీ, ఎత్తు 1,860మిమీ వరకు ఉండవచ్చు. దీని వీల్‌బేస్ దాదాపు 2,750మిమీగా అంచనా వేస్తున్నారు. ఈ కొలతలు టయోటా కొరొల్లా క్రాస్‌కు దాదాపు సమానంగా ఉన్నాయి. కొరొల్లా క్రాస్ పొడవు 4,490మిమీ, వెడల్పు 1,825మిమీ, ఎత్తు 1,620మిమీ కలిగి ఉంది. అయితే, ల్యాండ్ క్రూయిజర్ FJకొరొల్లా క్రాస్ కంటే ఎత్తుగా (1,860మిమీ) ఉండవచ్చు. ఇది కొంచెం చిన్నదిగా కూడా ఉండవచ్చు.

ల్యాండ్ క్రూయిజర్ FJ పవర్‌ట్రెయిన్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో 1.5లీటర్ డీజిల్, 2.8లీటర్ డీజిల్, 2.0లీటర్ పెట్రోల్, 2.7లీటర్ పెట్రోల్, 2.4లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలు ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో చాలా ఇంజన్‌లను Hilux Champలో కూడా ఉపయోగించారు. అయితే, తాజా నివేదికల ప్రకారం.. ఎక్కువగా 2TR 2.7లీటర్ ఇన్-లైన్ ఫోర్-పాట్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది 163 PS పవర్ని ఉత్పత్తి చేస్తుంది.

Toyota Land Cruiser FJ Mini

ల్యాండ్ క్రూయిజర్ 250 ఉత్పత్తిలో ఆలస్యం జరుగుతుండడం, ముఖ్యంగా దాని డీజిల్ వేరియంట్‌ల ఉత్పత్తిలో, 1GD 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఈ మోడల్‌లో అందించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇకపోతే 4WD(ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ విషయానికి వస్తే, ఇది టోర్సెన్ LSDతో కూడిన ఫుల్-టైమ్ 4WD సిస్టమ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. డ్రైవ్ మోడ్‌లు కూడా ల్యాండ్ క్రూయిజర్ 250లో ఉన్న వాటిని పోలి ఉండే అవకాశం ఉంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ మొదట్లో ఈ సంవత్సరమే (2025) విడుదల అవుతుందని భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం 2025లో విడుదలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ల్యాండ్ క్రూయిజర్ 250 ఉత్పత్తి సమస్యలు, ఆర్డర్‌ల నిలుపుదల కారణంగా, ఈ కొత్త SUV లాంచ్ ఇప్పుడు 2026కి వాయిదా పడింది.

ధర విషయానికి వస్తే బేస్ ల్యాండ్ క్రూయిజర్ FJ ధర సుమారు 4 మిలియన్ యెన్ (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 22.80 లక్షలు) నుంచి ప్రారంభం కావచ్చు. అధిక-స్పెసిఫికేషన్ వేరియంట్‌లు 4.5 మిలియన్ యెన్ (సుమారు రూ. 25.65 లక్షలు) లోపు ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ధరలు ఫార్చ్యూనర్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం విశేషం.

మొత్తానికి, టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ సరసమైన ధరలో ఫార్చ్యూనర్ లాంటి SUV కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. 2026లో విడుదల కానున్న ఈ కొత్త SUV భారతీయ మార్కెట్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 1, 2025, 10:06 [IST]
English summary
Toyota land cruiser fj a budget friendly alternative to the fortuner
Read more on: #india #auto news #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+