రోడ్ల పై రారాజు.. భద్రతకు మారుపేరు టయోటా.. ప్రాడోకు 5-స్టార్ రేటింగ్!
ప్రపంచ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా తన సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో SUVని రిలీజ్ చేసింది. టయోటా కంపెనీ సేఫ్టీకి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అందరికీ తెలుసు. ఇటీవల జరిగిన క్రాష్ టెస్టుల్లో, ప్రాడో 5స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ANCAP) నిర్వహించిన ఈ టెస్టులో ప్రాడో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఫలితాలను సాధించింది.
వయోజన ప్రయాణీకులు సేఫ్టీ, పిల్లల సేఫ్టీ, పాదచారుల భద్రత, భద్రతా సహాయ వ్యవస్థల్లో ప్రాడో అత్యధిక మార్కులు సాధించింది. ప్రాడో SUV ప్రస్తుతం మిడిల్ ఈస్ట్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో విక్రయాలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు విడుదలైనవి కేవలం ప్రాడో క్రాష్ టెస్ట్ నివేదికలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన క్రాష్ టెస్ట్ ప్రాడో 5 స్టార్లను సంపాదించింది.

వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో SUV 40కి 34.39 పాయింట్లను సాధించింది. పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో టయోటా ప్రాడో 49కి 43.62 పాయింట్లు సాధించింది. అదేవిధంగా, రోడ్డు వినియోగదారుల రక్షణలో ప్రాడో 63 పాయింట్లకు 53.38 పాయింట్లు, సేఫ్టీ అసిస్టెంట్ సిస్టమ్‌లో మొత్తం 18 పాయింట్లకు 14.83 పాయింట్లు సాధించగలిగింది.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను ఆన్, ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా రెడీ చేసింది. కంపెనీ ప్రకారం, ఈ ఛాసిస్ దాని మునుపటి దానికంటే 50 శాతం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయినప్పటికీ ఇది లాడర్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ పై నిర్మించారు. ల్యాండ్ క్రూయిజర్ 300 అందుబాటులో లేని ఉత్తర అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి మార్కెట్లలో ప్రాడో టయోటా ప్రధాన ప్రొడక్ట్.

కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ ఇంజన్ పవర్ ఫుల్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. 2025 నాటికి టయోటా 48V మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా పరిచయం చేయనుంది.
కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో మొత్తం పొడవు 4,920 మిమీ, ఎత్తు 1,870 మిమీ, వీల్‌బేస్ 2,850 మిమీ. మరిన్ని ఫీచర్లు, టెక్నాలజీతో ఆకట్టుకునే ఇంటీరియర్ తో దీనిన రూపొందించారు. దాని పెద్ద పరిమాణం కారణంగా మూడు లేనల్లో కూడా తగినంత స్పేస్ ఉంటుంది. అందువల్ల దీనిలో హాయిగా ఏడుగురు ప్రయాణించవచ్చు.
ఇంటీరియర్‌లో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్లష్ లెదర్ అప్హోల్స్టరీ, అలాగే ప్రయాణాన్ని లగ్జరీగా మార్చడానికి కొత్త తరం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన డిజిటల్ డిస్‌ప్లే ఉన్నాయి. కొత్త ప్రాడో ఫీచర్-రిచ్ ఇంటీరియర్, టెక్నాలజీలు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో పోటీ పడతాయి.

ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో 221ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన వీల్ ఆర్టిక్యులేషన్ దాని ఆఫ్-రోడ్ కెపాసిటీని హైలైట్ చేస్తాయి. మల్టీ-టెర్రైన్ మానిటర్ ఇంటర్‌ఫేస్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్‌లకు చేసిన మెరుగుదలలు ఈ SUVని మరింత శక్తివంతం చేస్తాయి. ముందు భాగంలో యాంటీ-రోల్ బార్ కూడా ఉంటుంది. ఇది సవాలుతో కూడిన ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా మాగ్జిమమ్ వీల్ ఆర్టిక్యులేషన్కు అనుమతిస్తుంది.
ఈ SUVలో ఫ్రంట్ యాంటీ-రోల్ బార్ కూడా ఉంది. దీనిని డ్యాష్‌బోర్డ్‌లోని స్విచ్ ద్వారా విడదీయవచ్చు. ఇండియాలో ఫార్చ్యూనర్SUV లో ఉన్న అదే 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో పవర్ ని అందిస్తోంది. 8-స్పీడ్ ఆటోమేటిక్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 48V MHEV మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతుంది. LC300 లాగానే కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కూడా ఇండియాలో పూర్తిగా కంప్లీట్ బుల్డ్ యూనిట్గా తీసుకొచ్చారు.
కొత్త ప్రాడో ఇండియాలో ల్యాండ్ క్రూయిజర్ LC300 SUV క్రింద ఉంటుంది. ఈ ఏడాది మిడిల్లో ఇండియాలోకి చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. టయోటా కూడా తన మోడళ్ల ధరలను పెంచింది. ఇందులో అర్బన్ క్రూయిజర్ టైజర్ కూడా ఉంది. మార్చి 2025 టయోటా సబ్-4-మీటర్ SUV ధర రూ. 5,500 వరకు పెరిగింది. S AMT, S+ AMT వేరియంట్లను రూ.5,500 పెంచారు.

మిగతా అన్ని వేరియంట్ల ధర రూ.500 పెరిగింది. దీనితో టయోటా అర్బన్ క్రూయిజర్ టిగోర్ కొత్త ధర రూ.7.74లక్షల నుంచి రూ.13.04లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. టైజర్ అనేది మారుతి సుజుకి ఫ్రాంచైజీ టయోటా రీబ్యాడ్జ్ చేయబడిన మోడల్. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌ను నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో E, S, G, Vఉన్నాయి. ఇది 8కలర్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉంటుంది.
మారుతి ప్లాట్‌ఫామ్‌పై ఉండడం వలన టైజర్ ఫ్రాంక్స్ సైజులోనే ఉంటుంది. అయితే, దానిని ప్రత్యేకంగా చూపించేందుకు ఫ్రంట్ ఫాసియాతో సహా డిజైన్ మార్చారు. కూపే-స్టైల్ సబ్-కాంపాక్ట్ SUV గ్లాసీ బ్లాక్ కలర్లో బోల్డ్ హనీకోంబ్ మెష్ గ్రిల్, మధ్యలో టయోటా లోగోతో కొత్త డ్యూయల్ LED DRL లను పొందుతుంది.
ఈ SUV బూట్‌లోని లైట్ బార్ ద్వారా కనెక్ట్ అయ్యే అప్‌గ్రేడ్ LED టెయిల్‌లైట్‌లను కూడా కలిగి ఉంది. ఈ కారులో కొత్తగా స్టైల్ చేసిన అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. టైజర్ క్యాబిన్‌లో 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మధ్యలో MID యూనిట్‌తో కూడిన ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. క్యాబిన్ కొత్త డ్యూయల్-టోన్ ట్రీట్మెంట్తో వస్తుంది.
ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, మరిన్ని వంటి అనేక ఫీచర్లతో అమర్చబడి ఉంటుంది. సబ్-కాంపాక్ట్ SUVలో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వెనుక AC వెంట్స్ కూడా ఉన్నాయి.
టేకాన్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లలో వస్తుంది. దీని 1.2 ఇంజన్ 89 bhp పవర్, 113 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బోచార్జ్డ్ యూనిట్ 99 bhp పవర్, 148 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








