ప్రతినెలా వేల మంది ఈ కారును కొంటున్నారు! రెండు ఫ్యామిలీలకు సెట్ అయ్యే కార్ కావాలంటే.. ఇదే బెస్ట్!

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కార్ల తయారీలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన టయోటా ఇటీవల తన అమ్మకాల వివరాలను క్రమంగా వెల్లడిస్తుంది. ఇప్పడు రెండు కుటుంబాలకు సరిపోయే అతిపెద్ద mpv అయినటువంటి ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) సేల్స్ గురించి పూర్తి డేటాను మన ముందుకు తెచ్చింది. ఇది ఒక పాపులర్ MPVగా వినియోగదారుల హృదయాల్లో స్థిరమైన స్థానం సంపాదించుకుంది. 2025 జూన్ నెలలో కూడా ఈ కారుకు వచ్చిన స్పందన చూస్తే, మార్కెట్‌లో ఎంతగానో రాణిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం, జూన్ 2025లో ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5,746 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే గత సంవత్సరం (జూన్ 2024)లో అమ్ముడుపోయిన 4,892 యూనిట్లతో పోల్చితే, ఈ సంవత్సరం 17.46 శాతం వృద్ధి నమోదవడం విశేషం.

సాధారణంగానే టయోటా ఇన్నోవా హైక్రాస్.. పేరు వింటేనే ఒక విశ్వాసం గుర్తొస్తుంది. ఇప్పుడు దీనికి బలమైన గుర్తింపుగా సేల్స్‌లో కూడా రాణించింది. ఈ mpv కి ఉన్న డిమాండ్‌ను మొదటి 5 నెలల గణాంకాలు కూడా బలంగా చూపుతున్నాయి. జనవరి నుంచి మే 2025 వరకు మొత్తం 44,666 యూనిట్లు అమ్ముడవడం జరిగిందంటే, ఇది నెలకు సగటున 8,933 యూనిట్లు అమ్ముడవుతున్నట్టు అర్థం.

Toyota Mpv Innova Hycross

ఒక MPV సెగ్మెంట్ కారుకు ఇలాంటి స్థిరమైన సేల్స్ వృద్ధి రావడం చాలా అరుదైన విషయం. ఇన్నోవా హైక్రాస్‌కి ఉన్న డిమాండ్ వెనక ప్రధాన కారణం, దాని విశాలమైన ఇంటీరియర్ స్పేస్, పవర్‌ఫుల్ పెట్రోల్ అండ్ హైబ్రిడ్ వేరియంట్ల కాంబినేషన్, అదిరిపోయే డ్రైవింగ్ కంఫర్ట్, గరిష్ఠ భద్రత ఫీచర్లు. పెద్ద కుటుంబాలకైనా, టూరింగ్ బిజినెస్‌లకైనా ఇది అద్భుత ఎంపికగా మారింది. అందుకే ఈ జూన్‌లో ఇది బలమైన సేల్స్‌ను చూపించింది.

ఇది టయోటా ఇండియా లైన్‌అప్‌లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి డిమాండ్‌తో, వచ్చే నెలల్లోనూ ఇది తన విజయయాత్రను కొనసాగించవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ MPV ధర విషయంలో కొంచెం ప్రీమియంగా కనిపించొచ్చుగానీ, అందుకు తగినట్టే ఫీచర్లు, పనితీరు, విశ్వసనీయతను అందిస్తుంది. ఉద్యోగస్థులు, వ్యాపారవేత్తలు మరియు సంపన్న వర్గాలవారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.

Innova Hycross June 2025 Sales

ఇందులోకి ఎక్కగానే వచ్చే ఆ భద్రతా ఫీలింగ్‌, విశాలమైన ఇంటీరియర్‌, టెక్నాలజీ ఆధారిత ఫీచర్లు దీన్ని ప్రీమియం సెగ్మెంట్‌లో నిలబెడతాయి. ఈ MPV ప్రారంభ ధర రూ.19.94 లక్షల నుండి రూ. 31.49 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది GX, GX (O), VX, VX (O), ZX, ZX (O) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది, వీటిలో ప్రతి ఒక్కటి వినియోగదారుల అవసరాలను బట్టి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.

పవర్‌ట్రెయిన్ పరంగా, ఈ MPVకి రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. మొదటిది 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, మరోటి 2.0-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్(పెట్రోల్‌+ ఎలక్ట్రిక్ మోటార్‌తో రన్ అవుతుంది). ఈ కారు ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంది. ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మైలేజీ విషయానికి వస్తే, ఇది సాధారణ బైక్‌ల మాదిరిగానే 16.13 నుండి 23.24 కిలోమీటర్లు లీటర్‌కు ఇస్తుంది.

Innova Hycross June 2025 Sales 17 46 Percent Growth

కారు లోపల అద్భుతమై ఫీచర్స్ ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీకి ఇది అత్యుత్తమమైన ప్రమాణాలను కలిగి ఉంది. ఇది 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్ మొదలగునవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 19, 2025, 7:20 [IST]
English summary
Toyota mpv innova hycross june 2025 sales 17 46 percent growth
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+