అదిరిపోయే కార్లను దింపిన టయోటా.. ఫీచర్స్ తెలిస్తే బుక్ చేయకుండా ఉండలేరు!
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశీయ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని బలంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా తన ప్రఖ్యాత SUV మోడళ్లైన ఫార్చ్యూనర్, లెజెండర్‌లను తాజాగా మరో కొత్త రూపంలో తీసుకొచ్చింది. ఇవి కొత్త "నియో డ్రైవ్" గ్రేడ్‌లో అందుబాటులోకి వచ్చాయి. అధునాతన 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఈ వేరియంట్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా అందించేలా రూపొందించబడ్డాయి. ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగంతో, కార్లు మెరుగైన మైలేజం సామర్థ్యాన్ని అందించడమే కాకుండా, మెరుగైన పికప్, శబ్దం తక్కువగా ఉండే మృదువైన డ్రైవింగ్ అనుభూతిని కూడా కలిగిస్తాయి. ట్రాఫిక్‌తో కూడిన నగర వీధుల్లో గానీ, రఫ్ రోడ్లపై ఆఫ్-రోడింగ్ సవాళ్లలో గానీ, ఈ వేరియంట్లు తేలికగా నడవగల సామర్థ్యం కలిగి ఉంటాయని కంపెనీ చెబుతోంది.
అలానే, ఈ వేరియంట్లలో సౌకర్యవంతమైన ఫీచర్స్, టెక్నాలజీలు కూడా భాగమయ్యాయి. డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేకపోయినా, ఇంజిన్ పనితీరు, మైల్డ్ హైబ్రిడ్ వలన ఇది ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని టయోటా పేర్కొంది. 2009లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టయోటా ఫార్చ్యూనర్, అప్పటి నుండి ప్రీమియం SUV విభాగంలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకుంది. దాని బోల్డ్ అండ్ మస్క్యులర్ డిజైన్, అసాధారణమైన పనితీరుతో ప్రత్యేకంగా నిలిచింది.

ఈ ట్రేడిషన్‌ను కొనసాగిస్తూ, ఇప్పుడు టయోటా "నియో డ్రైవ్ 48V" టెక్నాలజీతో కూడిన మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లను పరిచయం చేసింది. టయోటా ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V, లెజెండర్ నియో డ్రైవ్ 48V రూపంలో లభిస్తున్న ఈ మోడళ్లు, టెక్నాలజీ, పనితీరు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పరంగా మరింత అభివృద్ధి చెందాయి. ఈ వేరియంట్లు ఒక్క డ్రైవింగ్ అనుభవాన్ని మాత్రమే కాదు, మెరుగైన మైలేజ్ ను కూడా అందిస్తాయి.
ధర విషయానికి వస్తే, ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V వేరియంట్ రూ.44.72 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండగా, లెజెండర్ నియో డ్రైవ్ 48V రూ. 50.09 లక్షలకు లభిస్తోంది. ఈ ధరలు కొద్దిగా అధికంగా అనిపించవచ్చేమో గానీ, దాని వెనుక ఉన్న బ్రాండ్ విలువ, రిఫైన్డ్ టెక్నాలజీ, మైల్డ్ హైబ్రిడ్ సామర్థ్యం, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. ఇది విలువైన పెట్టుబడిగా చెప్పవచ్చు.

టయోటా ఫార్చ్యూనర్, లెజెండర్ నియో డ్రైవ్ వేరియంట్లు, కేవలం శక్తివంతమైన SUVలుగా మాత్రమే కాకుండా, కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలకంగా ఉంటాయి. వీటిలో 48V ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ అసిస్ట్ టెక్నాలజీ, తక్కువ ఇంధన వినియోగంతో పాటు తక్కువ కార్బన్ ఉద్గారాలను కూడా విడుదల చేస్తుంది. ఇది కారును ఎకో-ఫ్రెండ్లీ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వేరియంట్లలో 2.8 లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇక ఈ శక్తివంతమైన డీజిల్ యూనిట్‌కు తోడుగా, 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను జత చేశారు. ఇందులో బెల్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (BSG), లిథియం-అయాన్ బ్యాటరీ భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌లో తక్కువ లోడ్ సమయంలో ఇంజిన్‌ను తక్కువగా వాడుకుని , అవసరమైన సమయంలో మళ్లీ శక్తివంతంగా తిరిగి ప్రారంభించడంలో సహాయపడతాయి. మరో ముఖ్యమైన నవీకరణగా, కొత్తగా అందించిన స్మార్ట్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌ను ప్రస్తావించవచ్చు.

ట్రాఫిక్ లైట్ల ఇంజిన్‌ను ఆటోమెటిక్‌గా ఆపడం ద్వారా, ఫ్యూయల్ సేవింగ్ అవుతుంది. టయోటా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్ల బుకింగ్ జూన్ 2, 2025 నుండి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు అర్హత గల డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు చేసుకోవచ్చు. డెలివరీలు జూన్ మూడవ వారం నుండి ప్రారంభమవుమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








