మిడిల్‌క్లాస్ వారికోసం తక్కువ ధరకే శక్తివంతమైన బేబీ ఫార్చ్యూనర్.. అదిరిపోతున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ‌

అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా ఉన్నటువంటి టయోటా (Toyota)కు కార్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆకట్టుకునే డిజైన్, నమ్మకమైన పనితీరు, రఫ్ అండ్ టఫ్ దారుల్లో నడిపే సామర్థ్యం గల వాహనాలను విడుదల చేయడంలో టయోటా బ్రాండ్ నమ్మకమైన కంపెనీ. ముఖ్యంగా దాని ప్రసిద్ధ మోడల్ ఫార్చ్యూనర్‌ (fortuner) అంటే ఇండియాలో చాలా మంది ఫేవరెట్ మోడల్. ఈ suv ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ.33.78 లక్షల నుంచి రూ.51.94 లక్షల వరకు ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. అధిక ధర కారణంగా కొంతమంది ఈ కారును కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించేవారు. కాదు. ఇంతకంటే తక్కువ ధరలో లభించే మోడళ్లను కొనుగోలు చేయడానికి చూసేవారు.

ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడు టయోటా మరో కొత్త ఆశ చూపిస్తోంది. ఫార్చ్యూనర్‌కు సమానమైన బలాన్ని, స్టైల్‌ను అందించగలిగే సరికొత్త కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. టయోటా Land Cruiser FJ (ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే) అనే కారును తీసుకురాబోతుంది. కొంతమంది దీన్ని బేబీ ఫార్చ్యూనర్ అని పిలుస్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న ఫార్చ్యూనర్‌ కంటే తక్కువ ధరలో లభ్యమవుతుందని అంచనా.

Toyota New Land Cruiser Fj Features

ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులు కొనగలిగే విధంగా అందుబాటు ధరలోనే లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎక్కువ ఖరీదు అయిన ఫార్చ్యూనర్‌ కారును కొనలేని వారు బేబీ ఫార్చ్యూనర్‌ను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే మధ్య తరగతి SUV ప్రియులు ఈ మోడల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం, Land Cruiser FJ ఇన్నోవా క్రిస్టా వాహన ప్లాట్‌ఫాం ఆధారంగా నిర్మించబడుతుంది.

ఇది ఫార్చ్యూనర్‌ లాంటి దూకుడైన ప్రెజెన్స్‌ను కలిగి ఉండొచ్చు. ఇదే కాక, ఇది 4×4 సామర్థ్యంతో వస్తుందని, టయోటా తక్కువ ఖర్చుతో అధిక విలువనిచ్చే SUVని మార్కెట్‌కి అందించబోతోందని సంకేతాలు అందుతున్నాయి. ఇకపోతే, ఈ "బేబీ ఫార్చ్యూనర్" టయోటా నుంచి ఎప్పుడు రానుందో అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఒకసారి ఇది మార్కెట్లోకి వస్తే, మధ్య తరగతి SUV మార్కెట్‌లో పెను మార్పు తీసుకురావడంలో ఎటువంటి సందేహం లేదు.

Toyota New Land Cruiser Fj Design

టయోటా బేబీ ఫార్చ్యూనర్‌గా పిలవబడుతున్న కొత్త SUVని మొదట్లో 2025లోనే లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం ఈ రఫ్ అండ్ టఫ్ SUV మార్కెట్లోకి 2026 నాటికి రావచ్చని భావిస్తున్నారు. టయోటా ఈ కారును అత్యంత మన్నికైన ప్లాట్‌ఫామ్ IMV0 పై నిర్మిస్తోంది, దీని పేరు హిలక్స్ చాంప్ ఛాసిస్. ఈ బేబీ ఫార్చ్యూనర్‌ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించవచ్చని సమాచారం. మార్కెట్‌ వర్గాల కథనం ప్రకారం, టయోటా దీనిలో 2TR-FE 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, అలాగే 2.8-లీటర్ డీజిల్ యూనిట్‌ను అందించే అవకాశముంది. ఈ ఇంజిన్లు ఇప్పటికే భారత్‌లోని టయోటా మోడళ్లలో మంచి పేరుపొందాయి. ఇందులో ఎలాంటి హైబ్రిడ్ వేరియంట్లు ఉంటాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సిన విషయం.

టయోటా ఎప్పుడూ తన ఉత్పత్తుల విషయంలో ఖచ్చితమైన వివరాలను చివరికి ప్రకటించే కంపెనీ కాబట్టి, పవర్‌ట్రెయిన్‌ స్పెసిఫికేషన్లపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ SUV చంకీ వీల్ ఆర్చ్‌లతో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కొలతల పరంగా, ఇది 4,500 mm పొడవు, 1,830 mm వెడల్పు, 1,850 mm ఎత్తు ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఫార్చ్యూనర్ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2025, 12:53 [IST]
English summary
Toyota new land cruiser fj expected launch and design engine details check here
Read more on: #toyota motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+