పెట్రోల్ లేకుండా 80 కి.మీలు వెళ్తుంది.. ప్రపంచానికి అధునాతన కారును పరిచయం చేసిన టయోటా

భారతీయ వాహన ప్రేమికుల మనసు దోచుకున్న తయారీదారుల్లో టయోటా (Toyota) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దీని బ్రాండ్ గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీతో కలసి పలు మోడళ్లను రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్నా, "టయోటా" అనే పేరే ప్రజలను మళ్లీ మళ్లీ అదే వైపు మళ్లిస్తుంది. ఇక ఇప్పుడు, టయోటా మరో మారు ప్రపంచ మార్కెట్‌‌‌లో తన సత్తాను చూపించడానికి సిద్ధమైంది. కంపెనీ సరికొత్త తరం RAV4 SUVను ఇటీవల ఆవిష్కరించింది. బోల్డ్ డిజైన్, కట్ చేసిన లైన్లు, ఆకట్టుకునే హెడ్‌లైట్లు ఇవన్నీ కలసి ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా SUV అభిమానుల మనసులు గెలుచుకున్న మోడల్‌‌లో టయోటా RAV4 ఒకటి. చాలామంది దీనిని "మినీ ఫార్చ్యూనర్" అని పిలుస్తుంటారు.

ఇప్పుడు, ఇది కొత్త రూపంలో తిరిగివచ్చింది. టోక్యోలో ఇటీవలే ఆవిష్కరించబడిన ఆరవ తరం టయోటా RAV4, ముందు కంటే మరింత లేటెస్ట్‌గా, ఆకర్షణీయంగా మారింది. కార్‌ను ఒకసారి చూస్తేనే, డిజైన్ స్పోర్టీగా కనిపిస్తుంది. టయోటా డిజైన్ షైలి కారులో కనిపిస్తుంది. కొత్త క్యామ్రీలో చూసిన 'హామర్‌హెడ్' డిజైన్ శైలిని అనుసరిస్తూ, కారుకు ఒక మోడ్రన్ అండ్ డైనమిక్ లుక్‌ను ఇస్తున్నాయి. లైట్ల డిజైన్, కారు ముందు భాగాన్నే శక్తివంతంగా మార్చేస్తోంది.

Toyota Rav4

కారు ఇంటీరియర్‌లో చూసినపుడు మరో ప్రపంచమే కనిపిస్తుంది. టెక్నాలజీ పరంగా, టయోటా ఈ మోడల్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లను అందించింది. డ్రైవర్‌కు అనుభూతిని ఇచ్చేంత అద్భుతమైన ఇంటీరియర్, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు, సేఫ్టీ విషయంలో అత్యున్నత ప్రమాణాలు, ఇవన్నీ RAV4ను ఖచ్చితంగా ఒక ప్రీమియం ఎస్‌యూవీగా నిలబెడతాయి. అంతేకాక, టయోటా తన హైబ్రిడ్ టెక్నాలజీలో ఉన్న అంశాలను ఈ కారులోనూ స్పష్టంగా చూపించింది.

ఇలాంటి కార్లు భారత మార్కెట్‌కి రావాలని ఎంతోమంది భారతీయులు ఆశపడుతున్నారు. కొత్త తరం టయోటా RAV4 మొత్తం సిల్హౌట్‌ ల్యాండ్ క్రూయిజర్‌ను పోలి ఉంటుంది. దీన్ని క్షణ్ణంగా చూసినట్లయితే పాత మోడళ్ళ మాదిరిగానే ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుందని అనిపిస్తుంది. అంతే కాక, ఈ SUV మార్కెట్ అవసరాలను బట్టి మూడు భిన్న పరిమాణాల 17, 18 లేదా 19 వీల్స్‌తో లభిస్తుంది.

Toyota Rav4 Unveiled Globally Features Design

ఇంటీరియర్‌లో అందించిన ఆప్షన్ల విషయానికి వస్తే, టయోటా ఈసారి మునుపటి మోడల్‌తో పోల్చితే, పూర్తిగా అప్‌గ్రేడ్ అయిన డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో, కొత్తగా రూపొందించిన స్టీరింగ్ వీల్‌ వాటిని ఇచ్చింది. సులభంగా నడిపేలా మార్చిన AC కంట్రోల్స్‌, 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది టయోటా కొత్త అరీనా ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థ, కారు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్‌ను మరింత లేటెస్ట్‌గా మారుస్తుంది.

గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ iOSతో, మీరు మీ మొబైల్‌తో కేవలం కనెక్ట్ చేస్తే చాలు మిగిలినవన్నీ సులభంగా, చక్కగా నడుస్తాయి. ఇంకా 10.5 అంగుళాల మల్టీమీడియా డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే, కొత్త RAV4 కేవలం ఒక డ్రైవింగ్ యంత్రమే కాదు, ఇది ఒక పూర్తి టెక్ హబ్ లాంటి అనుభూతిని అందించే అధునాతన SUV.

Toyota Rav4 Unveiled Globally Features

ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్లు హైబ్రిడ్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వేరియంట్లుగా లభిస్తున్నాయి. ఇవి 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, రెండు వేర్వేరు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో కలిసి పనిచేస్తుంది. హైబ్రిడ్ వేరి,యంట్ 236 bhp శక్తిని ఉత్పత్తి చేస్తే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ నుండి 320 bhp పవర్ ఉత్పత్తి అవుతుంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లో దాదాపు 80 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ పవర్ మీదే ప్రయాణించగలదు.

More from DriveSpark

Article Published On: Friday, May 23, 2025, 15:20 [IST]
English summary
Toyota rav4 unveiled globally features design mileage more details inside
Read more on: #toyota motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+