ఏం మాయ చేసావే రూమియన్! అందరు నిన్నే కోరుకుంటున్నారు.. ఎప్పటికీ గుర్తుండిపోయే సేల్స్..

టయోటా భారతదేశంలో సాధారణంగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ కార్లను తన బ్రాండ్ కింద రీ-బ్యాడ్జ్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంటుంది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా ప్రాధాన్యం పొందిన మోడల్ టయోటా రూమియన్‌(rumian)ను కూడా అలాగే తీసుకువచ్చింది. ఇది అసలైన మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా రూపొందించారు. టయోటా రూమియన్ కూడా ఎర్టిగా మాదిరిగానే మార్కెట్లో మంచి స్పందనను పొందింది. వినియోగదారుల నమ్మకాన్ని, బ్రాండ్ విలువను, అలాగే ఎంపీవీ సెగ్మెంటులో ఉన్న డిమాండ్‌ను బాగా ఉపయోగించుకుంది. ఈ రీ-బ్యాడ్జ్డ్ వెర్షన్ అయిన రూమియన్‌లో టయోటా కొన్ని చిన్నచిన్న స్టైలింగ్ మార్పులతో పాటు, తన ముద్రను కొనసాగించింది. టయోటా బ్రాండ్ పట్ల ఉన్న గ్లోబల్ నమ్మకం రూమియన్‌ పనితీరు కారణంగా ఇది గత నెలలో మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది.

తాజాగా వచ్చిన మార్చి నెల అమ్మకాల ప్రకారం, గత నెలలో టయోటా మొత్తం 1,793 రుమియన్ కార్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే పెద్ద విజయంగా నిలిచింది. ఎందుకంటే, 2024 మార్చిలో విక్రయించిన కార్ల సంఖ్య కేవలం 688 యూనిట్లే. రెండింటిని పోల్చితే, 161 శాతం వృద్ధి నమోదు కావడం సాధారణ విషయం కాదు. టయోటా రూమియన్ పట్ల మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను ఇది సూచిస్తుంది.

Toyota Rumion March 2025 Sales 1793 Units Its 161 Percent Growth

మార్కెట్లో ఉన్న ఎంపీవీల నుంచి బలమైన పోటీ ఉన్నప్పటికి టయోటా తన బ్రాండ్ విలువ కారణంగా రూమియన్‌తో తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం టయోటా రూమియన్‌ ధరను చూస్తే, బేస్ వేరియంట్ రూ.10.54 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ.13.83 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. ఇది మారుతి సుజుకి ఎర్టిగా కంటే కొంచెం ఎక్కువ ధర. ఎర్టిగా బేస్ వేరియంట్ రూ. 8.84 లక్షలు(ఎక్స్ షోరూమ్).

అదే టాప్ వేరియంట్ రూ. 13.13 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ధరలో కొద్దిపాటి తేడా ఉన్నప్పటికీ, రూమియన్ అమ్మకాల పెరుగుతున్నాయి. ఈ ఎంపీవీని ఎంచుకోవడానికి ఉన్న మరో ముఖ్య కారణం ఎంటంటే, ఇది పెట్రోల్, CNG ఇంజిన్ వేరియంట్లలో లభించడం. పెద్ద కుటుంబ ప్రయాణాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. మైలేజ్ పరంగా అయితే పెట్రోల్ ఇంజిన్ కంటే కూడా సీఎన్‌జీ ఎక్కువ ఇస్తుంది.

Toyota Rumion March 2025 Sales 1793 Units

పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు సగటున 20.51 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని టయోటా తెలిపింది. అదే సమయంలో, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు దాదాపు 20.30 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయి. ఇక CNG వేరియంట్లు పెట్రోల్ వేరియంట్ల కంటే మరింత ఎక్కువ మైలేజ్‌ను ఇస్తాయి. ఈ ఆప్షన్‌లో కిలోగ్రాముకు 26.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

భారత కుటుంబాల కోసం టయోటా తీసుకువచ్చిన రూమియన్‌ 7 సీట్లతో ప్రతీ ఒక్కరికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ తగినంత స్థలం, సరైన లెగ్‌రూమ్‌తో ఈ MPV దూర ప్రయాణాల్లో మరింత కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ప్రయాణాల సమయంలో సాధారణంగా ఎదురయ్యే కుదుపులువంటి సమస్యలు రూమియన్‌లో తక్కువగానే కనిపిస్తున్నాయి.

Toyota Rumion

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 13, 2025, 10:30 [IST]
English summary
Toyota rumian march 2025 sales register 161 percent growth at 1793 units more details
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+