ఒక్క కారులో రెండు కుటుంబాలు.. బడ్జెట్‌కి హాయిగా సరిపోతుంది! అయినా అమ్మకాల్లో తగ్గుదల ఎందుకు?

భారతదేశంలో పెద్ద కుటుంబాల కోసం అనువైనవిగా నిలిచే కార్లు అంటే అందరికి 7 సీట్ల MPV మోడళ్లు గుర్తుకు వస్తాయి. ఇవి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చుతాయి. ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుల్లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. దశాబ్ద కాలంగా విస్తృతంగా అమ్ముడవుతూ, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఇదే డిమాండ్‌ను కొనసాగిస్తూ, టయోటా (Toyota) సంస్థ కూడా MPV విభాగంలో అడుగుపెట్టింది. టయోటా రూమియన్ (Rumion) రూపంలో ఎర్టిగా‌కే కొత్త రూపమిచ్చింది. మారుతి సుజుకి, టయోటా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల, ఎర్టిగా వంటి విజయవంతమైన మోడల్స్‌ను టయోటా తమ బ్రాండ్ పేరుతో రీబ్యాడ్జ్ చేసి మార్కెట్లో ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే, ఎర్టిగా ఆధారంగా రూపొందించిన టయోటా రూమియన్ కూడా భారత వినియోగదారులను ఆకర్షిస్తోంది.

టయోటా రూమియన్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచే వినియోగదారుల్ని ఆకర్షించడంలో విజయం సాధించింది. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తే రూమియన్ అమ్మకాలు కొంత వెనకబడి కనిపిస్తున్నాయి. తాజా జూన్ 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, టయోటా రూమియన్ కేవలం 1,415 యూనిట్లే అమ్ముడుపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో, అంటే జూన్ 2024లో ఈ సంఖ్య 1,566గా నమోదయ్యింది. సంవత్సరం వ్యవధిలో అమ్మకాల్లో సుమారుగా 10 శాతం తగ్గుదల జరిగింది.

Toyota Rumion Sales

ఈ తగ్గుదల వెనుక చాలానే కారణాలు ఉండొచ్చు. బలమైన పోటీ, వినియోగదారుల అభిరుచుల్లో మార్పు, లేదా కొత్త మోడల్స్ రావడం వంటివి ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ, ఈ విభాగంలో టయోటా రూమియన్‌కు ఇంకా స్థిరమైన స్థానం ఉంది. దీని మీద ఉన్న నమ్మకంతో, కంపెనీ ముందుచూపుతో మరింత మెరుగుదలలతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు. అమ్మకాల పరంగా జూన్ 2025 నెల టయోటా రూమియన్‌కు పూర్తిగా అనుకూలంగా నిలవలేదు.

కానీ, ఇది కేవలం తాత్కాలిక తగ్గుదల మాత్రమేనని మార్కెట్ వర్గాల అంచనా. పరిస్థితులు మారినప్పుడు, ఈ MPV మళ్లీ తిరిగి ట్రాక్‌లోకి వచ్చి వృద్ధి దిశగా పయనించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ధరల విషయానికి వస్తే, భారత మార్కెట్లో టయోటా రూమియన్ ప్రస్తుతం రూ.10.66 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది. ఇది స్టాండర్డ్ వేరియంట్లకు సంబంధించిన ధర కాగా, టాప్ వేరియంట్ రూ. 13.96 లక్షల వరకు ఉంది.

Toyota Rumion Sales 10 Percent Down

ధరలు చూసినా, ఇవి సెగ్మెంట్‌కి తగినవే అనిపిస్తాయి.ఈ కారులో మరో విశేషమైన అంశం ఏమిటంటే, CNG వేరియంట్. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో, ఇంధన ఖర్చును తగ్గించాలనుకునే వినియోగదారులకు ఇది గొప్ప అవకాశం. టయోటా రూమియన్ CNG వేరియంట్‌ ఒక కిలో గ్యాస్‌కు గరిష్టంగా 26.11 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంటోంది. దీని వల్ల ఫ్యూయల్ ఎఫిషియెన్సీకి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల మధ్య బాగా ఆదరణ పొందుతోంది.

టయోటా రుమియన్‌లో ఏర్పాటు చేసిన 7 సీట్లు ఈ కారును పెద్ద కుటుంబాల కోసం ప్రత్యేకంగా అనువుగా మార్చాయి. పైగా, అధిక మైలేజీని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో మరింత ఆకర్షణీయ ఎంపికగా మారింది. కేవలం మైలేజ్ పరంగానే కాదు, పోటీ పరంగా కూడా గట్టి పాత్ర పోషిస్తోంది. భారతీయ మార్కెట్లో కియా కారెన్స్, రెనాల్ట్ ట్రైబర్, తాజా క్లావిస్ వంటి MPV కార్లతో టయోటా రుమియన్ సమంగా పోటీపడుతోంది.

Toyota Rumion Sales Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Friday, July 11, 2025, 12:35 [IST]
English summary
Toyota rumion sales 10 percent down in june 2025 details check
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+