వర్షాలు పడే సీజన్‌లో గుడ్‌న్యూస్ చెప్పిన కంపెనీ! దక్షిణ భారతదేశం మొత్తానికి మాన్సూన్ సర్వీస్ క్యాంపెయిన్!

వర్షాలు పడే సీజన్ వచ్చింది అంటే, వాహనదారుల ఆందోళనలు మొదలవ్వడం సహజం. రోడ్లు జారిపోతాయి, విండ్‌షీల్డ్లు, టైర్లు ఇవన్నీ కరెక్ట్‌గా లేకపోయినా ఈ టైంలో పెద్ద ప్రమాదాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంజిన్ పనితీరుతో పాటు ఇతర విభాగాలు కూడా సరిగ్గా పనిచేస్తేనే ఈ సీజన్‌లో వాహనాలను జాగ్రత్తగా కాపాడుకోగలం. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota) వినియోగదారుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తన కస్టమర్లకు ఈ సీజన్‌లో మెరుగైన సేవలు అందించడానికి అమేజింగ్ టయోటా సర్వీస్ క్యాంపెయిన్(Awesome Toyota Service Campaign) అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలోని తన అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుందని టయోటా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సర్వీస్ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏమిటంటే... కేవలం రొటీన్ చెకప్‌కి మాత్రమే కాదు, వర్షాకాలపు ప్రతి చిన్న అవసరానికి పరిగణన ఇవ్వడం. వాహన యజమానిగా మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగాలన్నదే టయోటా లక్ష్యం. ఈ ప్రచారంలో భాగంగా, కారు టైర్లు, బ్రేకులు, బ్యాటరీ, వైపర్స్, హెడ్‌లైట్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, వంటి ముఖ్యమైన భాగాలను చెకింగ్ చేస్తారు. ఇంటీరియర్ శుభ్రత గురించి అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Toyota Awesome Service Campaign

వర్షాకాలంలో తడిచే ఇన్సైడ్ ఫ్యాబ్రిక్, సీట్స్, ఫ్లోర్ మ్యాట్స్ మొదలైన వాటిని శుభ్రంగా, హైజీనిక్‌గా ఉంచే విధంగా పరిష్కారాలు అందిస్తారు. వర్షకాలంలో టెక్నికల్ చెకప్‌లు పూర్తిగా చేయించుకోవడం ప్రతి వాహనదారునికి తప్పనసరిగా అవసరం. అమేజింగ్ టయోటా సర్వీస్ క్యాంపెయిన్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 20 పాయింట్ల ఉచిత వాహన చెకింగ్‌ను అందిస్తుంది. దీని ద్విరా కారు కండిషన గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది.

టైర్లు, బ్రేకులు, బ్యాటరీ, విండ్‌షీల్డ్, లైటింగ్ సిస్టమ్ వంటి కీలక భాగాలను పరిశీలిస్తూ, రోడ్డుపై నమ్మకంగా ప్రయాణించేందుకు అవసరమైన ప్రతీ అంశాన్ని కవర్ చేస్తుంది. ఇక సేవలపై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. లేబర్ ఛార్జీలపై 10 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతుండగా, వాహన శుభ్రత విషయంలో వినియోగదారులకు పూర్తి ప్యాకేజీ అందించేందుకు T-గ్లోస్ మాన్సూన్ కేర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చారు.

Toyota Started Awesome Service Campaign

ఇందులో ఇంటీరియర్ క్లీనింగ్, విండ్‌షీల్డ్ పాలిషింగ్, హెడ్‌ల్యాంప్ పునరుద్ధరణ, ఇంకా వర్షకాలంలో సాధారణంగా ఏర్పడే దుర్వాసన తొలగింపు వంటివి కూడా ఉంటాయి. ఈ ప్యాకేజీపై కూడా వినియోగదారులకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, వర్షాకాలంలో అత్యంత కీలకమైన టైర్లు, బ్యాటరీలపై కూడా ప్రత్యేక ఆఫర్లు లభిస్తుండటంతో, యజమానులు తమ వాహనాన్ని మోస్తరు ఖర్చుతోనే రెయిన్ రెడీగా మార్చుకునే అవకాశం పొందుతున్నారు.

ఈ ప్రచారం ప్రస్తుతం దక్షిణ భారతదేశమంతటా కొనసాగుతుండగా, జులై 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది టయోటా వినియోగదారులకోసం, ఈ వర్షాకాలాన్ని ప్రశాంతంగా, నిర్భయంగా గడిపేందుకు అందించిన ఒక పరిష్కారం. అమేజింగ్ టయోటా సర్వీస్ క్యాంపెయిన్ వెనుక ఉన్న లక్ష్యాన్ని గురించి టయోటా కిర్లోస్కర్ మోటార్‌ అధికారి ఒక స్పష్టమైన సందేశాన్ని తెలిపారు.

Toyota Awesome Service Campaign Details

దక్షిణ భారతదేశం మొత్తంలో ప్రచారాన్ని ప్రారంభిస్తూ, టయోటా కిర్లోస్కర్ మోటార్ సౌత్ రీజియన్, సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన వైస్‌లైన్ సిగామణి మాట్లాడుతూ, టయోటా అభిమానం ఎప్పుడూ కస్టమర్‌కు ముందు స్థానమే అని తెలియజేశారు. టయోటా కిర్లోస్కర్ మోటార్‌లో 'కస్టమర్ ఫస్ట్' అనేది కేవలం ఓ నినాదం కాదు... అది మా ప్రతి చర్యకి దారి చూపే మార్గదర్శక సూత్రం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు సురక్షితమైన, సజావుగా సాగే, ఆందోళనలేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలన్నదే ఈ ప్రచారం లక్ష్యం అని వివరించారు. ఇంటీరియర్ శుభ్రత నుంచి టైర్ తనిఖీ వరకు, ఉచిత కార్ చెకప్‌ల నుంచి ఉపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్ల వరకూ ఈ ప్రచారంలో ప్రతి అంశం వాహన యజమానుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేలా రూపొందించబడినదని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 8, 2025, 14:35 [IST]
English summary
Toyota started awesome service campaign across south india during the monsoon season
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+