మార్కెట్‌ను షేక్ చేసిన ఫార్చ్యూనర్.. ఏప్రిల్‌లో దుమ్ము రేపింది! టయోటా మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టయోటా కంపెనీ అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా ప్రసిద్ధ వాహన తయారీ కంపెనీగా తన స్థానాన్ని ఇటీవలి కాలంలో మరింత బలపరుచుకుంది. ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో తయారీదారులంతా తమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టయోటా కూడా తన ప్రసిద్ధ మోడల్ ఫార్చ్యూనర్ (fortuner)కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఫార్చ్యూనర్ భారత మార్కెట్లో తన స్థిరమైన స్థానాన్ని మరింత బలపరిచింది. ఒక పూర్తి SUVగా, ఇది కేవలం వాహనం మాత్రమే కాకుండా దాని దృఢమైన డిజైన్, హై-ఎండ్ ఫీచర్లు,రోడ్డుపై ప్రభావాన్ని చూపే డిజైన్‌తో ఇది అనేక మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అందుకే చాలామంది, ఈ వాహనాన్ని ఒక లగ్జరీ ఎలివేషన్‌గా కూడా పరిగణిస్తున్నారు. ఇటీవల విడుదలైన టయోటా కార్ల విక్రయ గణాంకాల్లో ఫార్చ్యూనర్ ప్రదర్శన మరింత స్పష్టంగా కనిపించింది.

2025 ఏప్రిల్ నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ 2,904 ఫార్చ్యూనర్ యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 2,325 యూనిట్లతో పోలిస్తే దాదాపు 25 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఈ గణాంకాలు వినియోగదారుల అభిరుచిలో వచ్చిన మార్పులను కూడా తెలియజేస్తున్నాయి. సొలిడ్ బాడీ, హై గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్-ఎండ్-టఫ్గా నిలిచే కెపాసిటీ, టయోటా బ్రాండ్‌కు ఉన్న నమ్మకంతో ఫార్చ్యూనర్ వినియోగదారుల మనసులోఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

Toyota Suv Fortuner April 2025 Sales 25 Percent Growth

ఈ సంవత్సరం ప్రారంభం నుండి టయోటా ఫార్చ్యూనర్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ప్రభావాన్ని మరింతగా చాటుకుంది. జనవరి నుండి మార్చి 2025 వరకు మూడు నెలల కాలంలో ఈ SUV అమ్మకాల పరంగా అద్భుతమైన గణంకాలను నమోదు చేసింది. మార్చిలో 3,392 యూనిట్లు, ఫిబ్రవరిలో 2,876 యూనిట్లు, జనవరిలో 3,149 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ గణాంకాల ప్రకారం, ప్రతి నెలా సగటున 2,500 యూనిట్లకు పైగా ఉంటున్నాయి.

ఈ అమ్మకాల పెరుగుదల వెనుక అనేక కీలక కారణాలున్నాయి. మొదటిగా, ఫార్చ్యూనర్ ఒక పూర్తి SUVగా ఉండటమే కాదు, అత్యంత లేటెస్ట్ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు, టెక్నాలజీ, ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో కూడినది. దీని భద్రతా ప్రమాణాలు కూడా వినియోగదారుల్లో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి, ఇది టయోటా బ్రాండ్‌కు ప్రత్యేకత. కేవలం అవసరాల కోసం కాకుండా, ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబ వాహనంగా కూడా ఈ కారును చూస్తున్నారు.

Toyota Suv Fortuner April 2025 Sales

అలాగే వ్యాపార ప్రయోజనాల కోసం కూడా తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక పనితీరు ఫార్చ్యూనర్‌కు మరింత బలాన్ని ఇస్తోంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఫార్చ్యూనర్‌కు ఈ సెగ్మెంట్‌లో స్పష్టమైన ప్రత్యక్ష పోటీదారు లేకపోవడం. దీని వలన, ఈ SUV మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వెహికల్‌గా నిలుస్తోంది. టయోటా ఫార్చ్యూనర్‌ను ఎంచుకునే వినియోగదారులు ఇతర బ్రాండ్‌లను తక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

టయోటా ఫార్చ్యూనర్ అనేది ప్రీమియం సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒక శక్తివంతమైన SUV. ప్రస్తుతం ఇది రూ. 35.37 లక్షల నుంచి రూ. 51.94 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఈ కారులో 7 సీటర్ ఉంటుంది. దీని వల్ల పెద్ద కుటుంబాలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ప్రయాణాలలో లగేజీ కూడా ఎక్కువగానే తీసుకెళ్లవచ్చు.

Toyota Suv Fortuner

ఎందుకంటే ఇది 296 లీటర్ల బూట్ స్పేస్‌‌ను కలిగి ఉంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ రెండింటితో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలను బట్టి ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌లను కలిగి ఉంటుంది. ఈ SUV సగటున 10 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 20, 2025, 15:17 [IST]
English summary
Toyota suv fortuner april 2025 sales 25 percent growth details inside
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+