జనాలకు నచ్చిన కార్లు.. వీటి కోసం దేశంలోని చాలా మంది టయోటా షోరూమ్‌‌లకు ఎగబడ్డారు.. లక్షల యూనిట్ల అమ్మకాలు

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా తన ముద్రను వేసుకుంది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులకు పోటీగా కొత్త కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేస్తూ, దేశం నలుమూలల తన కార్లను ప్రజలకు చేరవేస్తుంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు తన ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది. తాజాగా టయోటా తన రెండు ప్రసిద్ధ మోడళ్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. తన ఫ్లాగ్‌షిప్ SUVలు ఫార్చ్యూనర్ (fortuner),లెజెండర్ (legender) భారతీయ మార్కెట్లో మరోసారి తమ సత్తా చాటినట్లు ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల కలిపి 3 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.

ఇది టయోటా భారత్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. 2009లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఫార్చ్యూనర్, అప్పటి నుండి SUV విభాగంలో తనదైన స్థానాన్ని కలిగించింది. దృఢత్వం, నమ్మకమైన పనితీరు రఫ్-రోడ్ సామర్థ్యాలతో ఫార్చ్యూనర్‌కు దేశీయంగా ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఒకసారి నడిపితే, దాని స్టైల్‌కు ఎవరైన ఫిదా కావాల్సిందే. సాహసాన్ని కోరుకునే ప్రయాణికులు, అలాగే బలమైన పనితీరు కోరుకునే డ్రైవింగ్ ఔత్సాహికులకు ఫార్చ్యూనర్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

Toyota Suvs Fortuner

ఫార్చ్యూనర్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. గరిష్ఠంగా 204 PS పవర్, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ల్యాడర్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ టయోటా అందించిన అధునాతన 4x4 టెక్నాలజీ సహయంతో అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా రయ్ మంటూ ఈజీగా దూసుకుపోతుంది. ఇది కేవలం ఒక SUV మాత్రమే కాదు, ప్రతి రోడ్డుమీద కొత్త అనుభవాన్ని అందించే యోధుడు.

టయోటా ఫార్చ్యూనర్ మస్క్యులర్ బాడీ లైన్స్, ఎత్తైన స్థానం, కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్‌తో అట్రాక్ట్ చేస్తుంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల కేవలం క్లిష్టమైన రోడ్డుపై తిరిగే సామర్థ్యమే కాదు, ఒక సుస్థిరతనూ అందిస్తుంది. దానికి తోడు, సిగ్నేచర్ LED హెడ్‌లాంపులు, డైనమిక్ క్రోమ్ గ్రిల్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, లోపల మెత్తటి లెదర్ అప్హోల్స్టరీ, సున్నితంగా డిజైన్ చేయబడిన డాష్‌బోర్డ్, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

Toyota Suvs Fortuner And Legender Crossed 3 Lakh Sales

టయోటా లెజెండర్ విషయానికి వస్తే, ఇది 2021లో మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇది ప్రత్యేకంగా నేటి పట్టణ ప్రయాణాలకు అనుగుణంగా ఉండేలా స్టైల్, సౌలభ్యం, టెక్నాలజీ అంశాలను కలిపి రూపుదిద్దింది. ఇది కేవలం ఒక SUV కాదు, ఒక విలాసవంతమైన మోడల్. లెజెండర్ బయటి రూపాన్ని చూస్తేనే అది ప్రత్యేకంగా గుర్తింపు పొందుతుంది. డ్యూయల్-టోన్ స్టైలింగ్, పదునైన LED టర్న్ ఇండికేటర్లు, స్టైలిష్ గ్రిల్ అన్ని కలిపి లెజెండర్‌‌ను ఆకట్టుకునేలా చేస్తున్నాయి.

లెజెండర్ 4x4 టెక్నాలజీతో ఆఫ్‌రోడ్ ప్రయాణాల్లో సులువుగా ముందుకు కదులుతుంది. ఈ విలాసవంతమైన రూపం వెనుక దృఢమైన పనితీరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఈ కారులో అధునాతన ఫీచర్స్‌ను అందించారు. వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు, అలాగే 11-స్పీకర్ JBL ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటివి డ్రైవింగ్ అనుభవాన్ని హాయిగా మాత్రమే కాకుండా, ఆహ్లాదకరంగా కూడా తీర్చిదిద్దుతాయి.

Toyota Suvs Fortuner And Legender

ఈ విజయవంతమైన మైలురాయిని పురస్కరించుకుని, టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా స్పందిస్తూ, ఫార్చ్యూనర్, లెజెండర్ మోడళ్ల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. లగ్జరీ, పనితీరు, కోరుకునే SUV ఔత్సాహికులలో ఫార్చ్యూనర్, లెజెండర్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయని అన్నారు. నగరలు, కఠిన భూభాగాల్లో ఈ రెండు మోడళ్లు సమానంగా శక్తివంతమైన పనితీరును అందిస్తాయని వాధ్వా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2025, 12:55 [IST]
English summary
Toyota suvs fortuner and legender crossed 3 lakh sales in india details
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+