ఈ కారు కోసం కస్టమర్లు క్యూలో నిలబడ్డారు.. రూ. 8 లక్షల్లో వస్తోంది! మార్కెట్‌లో సూపర్ హిట్!

టయోటా (Toyota) భారత మార్కెట్లో తిరిగి వేగం అందుకుంటున్న సమయంలో, కంపెనీ అమ్మకాల పెరుగుదలకు కీలక కారణంగా రీబ్యాడ్జ్ స్ట్రాటజీ నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా టయోటా మారుతి సుజుకితో కలిసి పనిచేసి, పరస్పరం కార్లు, టెక్నాలజీని పంచుకునే భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ వ్యూహం ఫలితం భారత మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రీబ్యాడ్జ్ చేయబడిన మోడళ్లే టయోటా మొత్తం అమ్మకాలలో దాదాపు సగం వాటాను అందిస్తున్నాయి. మారుతి సుజుకి పాపులర్ క్రాస్ఓవర్ SUV ఫ్రాంక్స్ ఆధారంగా రూపుదిద్దుకున్న టయోటా టైజర్ (Toyota Taisor) ఈ జాబితాలో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే టయోటా గత నెలలో టైజర్ 1469 యూనిట్లను ఎక్కువగా విక్రయించింది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సబ్-4 మీటర్ SUVలలో టైజర్ 10వ స్థానంలో ఉంది. అక్టోబర్ 2025లో టయోటా టైజర్ భారత కస్టమర్లను బలంగా ఆకట్టుకుంది. ఒక నెలలోనే మొత్తం 4561 యూనిట్లు అమ్ముడవడం కంపెనీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. దీనితో పోలిస్తే గత సంవత్సరం అదే నెలలో ఈ SUV విక్రయం కేవలం 3092 యూనిట్ల దగ్గరే నిలిచిపోయింది. అంటే టైజర్ ఒక్క ఏడాదిలోనే 47.51 శాతం పెరుగుదల సాధించింది.

Toyota Taisor October 2025 Sales 47 51 Percent Growth

సెప్టెంబర్ 2025తో పోలిస్తే, అక్టోబర్‌లో టైజర్ అమ్మకాలు పెరిగాయి. గత నెలలో అమ్ముడైన 2297 యూనిట్ల కంటే ఎక్కువ. అమ్మకాలు దాదాపు సగానికి పెరిగాయి. గత 6 నెలల్లో సాధించిన అత్యధిక నెలవారీ అమ్మకాలు కూడా ఇదే. మునుపటి అత్యధిక అమ్మకాలు మే 2025లో జరిగాయి, ఆ సమయంలో 3035 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ భారీ జంప్, యూజర్ నమ్మకం పెరగడం ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తుంది.

టయోటా టైజర్ అమ్మకాలు అక్టోబర్ 2025లో రికార్డు స్థాయికి చేరడానికి మరో కీలక కారణం తాజాగా అమల్లోకి వచ్చిన GST 2.0 సంస్కరణలు, దీపావళి సీజన్‌లో అందించిన భారీ ఆఫర్లు. ప్రభుత్వ మార్పులతో చిన్న కార్లు, కాంపాక్ట్ SUVలపై పన్నులు తగ్గడంతో, టయోటా కూడా వెంటనే ధరలను భారీగా సవరించింది. ఈ తగ్గింపులు కస్టమర్లను షోరూమ్‌లకు భిన్నంగా ఆకర్షించాయి. దాంతో షోరూమ్‌కు కస్టమర్ల తాకిడి పెరిగింది.

Toyota Taisor October 2025 Sales 47 51 Percent Growth

కొత్త ధరల ప్రకారం, వేరియంట్‌ను బట్టి టైజర్ ధరలు రూ. 67,300 నుండి రూ. 1.11 లక్షల వరకు తగ్గించబడ్డాయి. బేస్ E MT వేరియంట్ ధర ముందుగా రూ. 7.89 లక్షలు కాగా, ఇప్పుడు అది రూ. 7.21 లక్షలకు తగ్గింది. ఒక్కప్పుడు రూ. 13.03 లక్షలు ఉన్న V టర్బో AT వేరియంట్, ఇప్పుడు కేవలం రూ. 11.91 లక్షలకు లభిస్తోంది.

8 లక్షల లోపు ఒక టయోటా బ్రాండ్ SUV దొరకడం అదృష్టం. ఈ భారీ ధర తగ్గింపు వల్లనే షోరూమ్‌ల వద్ద భారీ రద్దీ కనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టయోటా టైజర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ NA ఇంజిన్ 89 bhp పవర్, 113 Nm టార్క్ అందిస్తుంది.

Toyota Taisor October 2025 Sales 47 51 Percent Growth

మరోవైపు 1.0-లీటర్ టర్బో ఇంజిన్ 99 bhp పవర్, 148 Nm టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లు 21.7 kmpl నుండి 22.8 kmpl వరకు మైలేజీని, పెట్రోల్ మాన్యువల్ 21.5 kmpl మైలేజీ ఇస్తుంది. టర్బో ఆటోమేటిక్ వేరియంట్ కూడా 20 kmpl వరకు, CNG వేరియంట్‌ను 28.51 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది, ఇది రోజువారీ ప్రయాణాలు చేసే కుటుంబాలకు ఖర్చు తగ్గించే ఎంపిక.

More from DriveSpark

Article Published On: Wednesday, November 19, 2025, 18:35 [IST]
English summary
Toyota taisor october 2025 sales 47 51 percent growth compared to previous
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+