క్రెటా, ఫార్చ్యూనర్‌లకు గుబులు..ముగ్గురు మొనగాళ్లతో మార్కెట్‎ను కొల్లగొట్టేందకు టయోటా మాస్టర్ ప్లాన్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా (Toyota) కంపెనీకి 2026 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. ఈ ఏడాదిలో టయోటా మొత్తం మూడు కొత్త, అప్‌డేటెడ్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంప్లీట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన అర్బన్ క్రూజర్ బీఈవీ (BEV), 9వ జనరేషన్ టయోటా హిలక్స్ పికప్ ట్రక్, అప్‌డేటెడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మోడళ్లు సరికొత్త డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో పాటు, పోటీ ధరల్లో కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

550 కి.మీ.ల రేంజ్ ఇచ్చే అర్బన్ క్రూయిజర్ బీఈవీ
టయోటా నుంచి రాబోయే పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ బీఈవీ 2026 మొదటి సగంలో విడుదల కానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా. ఈ కారును ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, 12-పీస్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Toyota to Launch 3 New Vehicles in 2026 Urban Cruiser BEV New Hilux and Updated Hyryder

ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లు. పెద్ద బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 550 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇవ్వగలదని అంచనా. క్యాబిన్ లోపల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో ఏసీ, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360 డిగ్రీల కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

9వ తరం టయోటా హిలక్స్ రాక
2026లో విడుదల కానున్న మరో ముఖ్యమైన మోడల్ 9వ తరం టయోటా హిలక్స్ పికప్ ట్రక్. దీనిని ఇటీవల అంతర్జాతీయంగా ఆవిష్కరించారు. భారతదేశంలో దీని ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ.35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ట్రక్ స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు వంటి డిజైన్ అంశాలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Toyota to Launch 3 New Vehicles in 2026 Urban Cruiser BEV New Hilux and Updated Hyryder

హిలక్స్ 2.7-లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ డీసెల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు, 59.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ హిలక్స్ ఎలక్ట్రిక్ మోడల్ 240 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ADAS మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి.

అప్‌డేటెడ్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా 2026లో చిన్నపాటి అప్ డేట్లకు గురై విడుదల కానుంది. ఇందులో ముఖ్యంగా డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి, లెవెల్-2 ADAS వంటి కొత్త ఫీచర్లను జోడించనున్నట్లు సమాచారం.

Toyota to Launch 3 New Vehicles in 2026 Urban Cruiser BEV New Hilux and Updated Hyryder

ప్రస్తుతం హైరైడర్ స్టాండర్డ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ 19.20 నుంచి 27.97 కి.మీ.ల వరకు మంచి మైలేజ్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ హైరైడర్ ధర రూ.10.95 లక్షల నుంచి రూ.19.76 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 9, 2025, 7:36 [IST]
English summary
Toyota to launch 3 new vehicles in 2026 urban cruiser bev new hilux and updated hyryder
Read more on: #toyota #toyota motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+