టయోటా నుంచి మరో సెన్సేషనల్ మోడల్.. అదిరిపోతున్న ఇన్నోవా కొత్త ఎలక్ట్రిక్ కారు..

ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీలో ఎంతో ప్రసిద్ధి చెందిన టయోటా మోటార్(Toyota Motor) వరుసగా కార్లను విడుదల చేస్తూ, అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో కూడా తన కార్లను విక్రయిస్తూ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇంత కాలం పెట్రోల్, డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ తాజాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే మిగతా కార్ల తయారీదారులు ఈవీ విభాగంలో కార్లను విడుదల చేస్తూ దూసుకుపోతుండగా, టయోటా మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. ఇలాంటి తరుణంలో కంపెనీ రానున్న కాలంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టయోటా ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన IIMS 2025 (ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో)లో టయోటా తన ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. దీనిని కాన్సెప్ట్ వెర్షన్‌ను ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు.

టయోటా మోటార్ ఇన్నోవా MPV ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తున్న మొదటి ఇన్నోవా మోడల్. ఈ కారును ఆగ్నేయాసియా మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉన్న Kia ng ఇన్నోవా మోడల్ ఆధారంగా రూపొందించారు. టయోటా దీనిని పూర్తి ఈవీలో తీసుకొస్తుంది. రానున్న కాలంలో ఇండోనేషియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఈ కారును విడుదల చేస్తారా? లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Innova Electric Mpv Unveiled In IIms

టాయోటా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో డిమాండ్ మేరకు ఈ కారును మన దగ్గర కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఆసియా మార్కెట్లలో ఇన్నోవా కారు అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. ఇండియాలో ICE వెర్షన్‌లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా అనే వేరియంట్లలో అమ్మకానికి ఉంది.

ఇన్నోవా MPV ఎలక్ట్రిక్ వెర్షన్ భారత్‌లో లాంచ్ అయితే కనక ఇతర ఈవీ కార్లకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఇన్నోవా స్పెసిఫికేషన్లు చూసినట్లయితే ఇది 59.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు AC, DC ఛార్జింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చు. ఛార్జర్, ఇన్వర్టర్‌ను కారు వెనుక భాగంలో అమర్చారు. బ్యాటరీని ఛార్జ్ చేస్తే, ఎంత రేంజ్ అందిస్తుందో కంపెనీ ప్రకటించలేదు.

Innova Electric Mpv Unveiled In Indonesia Motor Show Event

ఇది అప్‌డేట్ చేయబడిన LED DRLలు, హెడ్‌లైట్ యూనిట్లతో క్లోజ్డ్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కారుగా గుర్తించడానికి రెండు చివర్లలో BEV బ్యాడ్జింగ్‌ను కూడా అందించారు. ఈ MPV 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతుంది. డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ గార్నిష్ కూడా ప్రత్యేకంగా ఉంది. కారు బ్యాక్ సైడ్ LED టెయిల్‌లైట్‌లు, LED లైట్ స్ట్రిప్‌ను దీనిలో అమర్చారు.

ఇంటీరియర్ కూడా ఆకట్టుకునే విధంగా రూపొందించారు. యాంబియంట్ లైటింగ్, బటన్లతో లెదర్ స్టీరింగ్ వీల్,వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, ముఖ్యంగా మధ్యలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్, లగేజీ పెట్టుకోవడానికి విశాలమైన స్థలం ఉంటుంది.

Toyota Innova Electric Mpv

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2025, 11:20 [IST]
English summary
Toyota unveils new innova electric mpv at indonesia motor show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+