ఈ వీడియోను చూస్తే కారు అందాన్ని పొగడకుండా ఉండలేరు! అద్బుతంగా ఉన్న టయోటా ఈవీ ఇంటీరియర్
ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota) ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా తన సత్తాను చాటడానికి సిద్ధమైంది. త్వరలోనే ఈ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఈవీ విభాగంలో దూకుడుగా ఉన్నాయి. గత ఏడాది అనేక ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయగా, ఈ 2025 ఏడాదిలో కూడా ఇవి మరిన్ని ఈవీ మోడళ్లను తీసుకురావడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే అతిపెద్ద కార్ల తయారీదారు అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, e-Vitara కారును తీసుకొచ్చింది. దీన్ని జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో కూడా ఆవిష్కరించింది. త్వరలోనే ఇది వినియోగదారుల వద్దకు చేరడానికి సిద్దంగా ఉంది.
దాదాపు టాప్ కార్ల తయారీ కంపెనీలు ఈవీలను విడుదల చేస్తుండగా, ఇప్పుడు విభాగంలో వెనుకబడి ఉన్న టయోటా కొత్తగా తన ఈవీని తీసుకురావడానికి సిద్ధమైంది. దీంతో ఇప్పుడు భారత మార్కెట్లో పోటీ మరింత పెరగబోతుంది. టయోటా త్వరలో విడుదల చేయబోతున్న మోడల్ పేరు అర్బన్ క్రూయిజర్ ఈవీ (Urban cruiser EV). ఈ మోడల్ రాకతో దిగ్గజాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండనుంది.

ముఖ్యంగా టాయోటా తీసుకొస్తున్న ఈవీతో ఇప్పటికి ఈ సెగ్మెంట్లో మంచి మార్కెట్‌ను కలిగిన టాటా మోటార్స్, JSW MG మోటార్స్ కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, అర్బన్ క్రూయిజర్ ఈవీని టయోటా కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్స్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా కస్టమర్లను ఎలాగైన ఆకట్టుకోవాలని కంపెనీ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఈ క్రమంలో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీకి సంబంధించిన ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌ను అందరికి చూపించే ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విడుదల కాగా, ఇది బాగా వైరల్ అవుతుంది. చాలా మంది ఈ వీడియోలో ఉన్న ఈవీని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియోలో కారుకు సంబంధించిన అనేక వివరాలను వెల్లడించారు. ఒక విదేశీయుడు కారు గురించిన సమాచారాన్ని అందించాడు.

ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఎలక్ట్రిక్ కారును టయోటా, సుజుకీ భాగస్వామ్యంతో తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న వీడియోలో విదేశీయుడు కారు గురించి వివరిస్తున్నాడని ఇది విదేశాల్లో తయారైన మోడల్ అనుకోకండి. ఈ కారును ఇండియాలోని గుజారాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుజుకీ కార్ల తయారీ కర్మాగారంలో తయారు చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీడియోలో చూస్తున్న దాని ప్రకారం, ఇది చూడటానికి పెట్రోల్, డీజిల్ కారు మాదిరిగానే కనిపిస్తుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ముందు డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. లైట్ సెటప్‌ను చుక్కల మాదిరిగా అమర్చారు. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎక్స్‌టీరియర్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ కూడా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. కారు లోపల పుష్-బటన్ AC కంట్రోల్, ఎలక్ట్రికల్ సర్దుబాటు డ్రైవర్ సీటు, ఇతర ప్రీమియం ఫీచర్స్‌ను చాలా కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








