రయ్ రయ్ మంటూ వచ్చేస్తున్న కొత్త ఈవీ.. దీని పవర్, ఫర్ఫార్మెన్స్ అదుర్స్!
దేశంలో ప్రస్తుతం ఈవీల జోరు కొనసాగుతోంది. భారతీయ వినియోగదారులు వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ వాహన తయారీ సంస్థలు కూడా గేరు మార్చి, ఈవీల తయారీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇదే కోవాలో ఇప్పుడు దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా.. ఈవీల్లో మరో అడుగు ముందుకు వేసింది. తమ బ్రాండ్ నుంచి అర్బన్ క్రూజర్ ఈవీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఈవీనీ ఈ నెలలో జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఇంట్రడ్యూజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తమ జీరో- ఎమిషన్ వాహనాల లైనప్‌ను విస్తరించాలని భావిస్తున్న టయోటా.. ఈ ఈవీతో సేల్స్ పెంచుకోవాలని చూస్తోంది. మరి ఈవీ ఎలా ఉండబోతుంది? దీని ఫీచర్లలో ఏమేం ఉండబోతున్నాయి? వంటివి చూసేద్దాం.
ఈ అర్బన్ క్రూజర్ ఈవీ విదేశాల్లో అందుబాటులో ఉన్న టయోటా యారిస్ క్రాస్‌ఓవర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కంటే పెద్ద సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది 4,285 మి.మీల పొడవు, 1,800 మి.మీ. వెడల్పు, 1,640 మి.మీ.ల ఎత్తుతో ఉండనుంది. ఇందులో స్లైడింగ్ రియర్ సీట్ సిస్టమ్ ద్వారా స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.

దీని సీట్లు 40:20:40 కన్ఫిగరేషన్‌తో Split- fold చేసి ఉండడంతో పాటు మరింత కంఫర్ట్ ఉండేలా కాస్త వంగి ఉంటాయి. 2026 నాటికి 15 జీరో- ఎమిషన్ వాహనాలను తీసుకురావాలని టయోటా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఆరు బ్యాటరీ- ఎలక్ట్రిక్ మోడల్స్ కూడా ఉండనున్నాయి. దీని ద్వారా భారత్‌లో ఉద్గారాల కట్టడిలో తమ వంతు పాత్ర ఉండేలా చూడాలని టయోటా భావిస్తోంది.
2035 నాటికి పూర్తిగా CO2 తగ్గించే విధంగా ఉండే వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అర్బన్ క్రూజర్ ఈవీ బ్యాటరీ ఆప్షన్స్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే... ఫ్రంట్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ కన్ఫిగరేషన్‌లతో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఉంటుంది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్‌లు కూడా లిథియం- ఐరన్ పాస్ఫేట్ టెక్నాలజీతో ఉంటాయి.

ఇందులోని ఫ్రంట్- వీల్ డ్రైవ్ (FWD) వెర్షన్.. 49 kWh బ్యాటరీతో ఉండి 144bhp ఉత్పత్తి చేస్తుంది. 61 kWh బ్యాటరీ... 174 bhp ఉత్పత్తి చేస్తుంది. ఆల్- వీల్ డ్రైవ్ (AWD) మోడల్.. 61 kWh బ్యాటరీతో 184bhp ఉత్పత్తి చేస్తుంది. రియర్ axle మోటార్... ఏడబ్ల్యూడీ వెర్షన్‌లో నునుపైన తలాలపై మంచి గ్రిప్ అందిస్తుంది.
ఈ కారులో డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రెయిల్ మోడ్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. వీటి ద్వారా అపోజిట్ వీల్ కు టార్క్ అందిస్తూ వీల్ స్పిన్ మేనేజ్ అవుతుంది. ఎఫ్‌డబ్ల్యూడీ మోడల్‌లో 'స్నో మోడ్' ఫీచర్ కూడా ఉంటుంది. ఇది మంచు కురిసిన రోడ్లపై టార్క్‌ను నియంత్రిస్తుంది. ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టయోటా ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫుల్ హైబ్రిడ్, ఫుల్ సెల్ ఎలక్ట్రిక్ వంటి వాహనాలతో పాటు బ్యాటరీ- ఎలక్ట్రిక్ మోడల్స్‌ను రానున్న రోజుల్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా తమ పర్యావరణ లక్ష్యాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉద్గారాలను కట్టడిలో తోడ్పడనుంది. త్వరలోనే ఈ కార్లు మార్కెట్‌లో అడుగుపెట్టడం ద్వారా ఇతర ఈవీ కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








