కారు కొనేవారు కాస్త ఆగండి.. 550Km రేంజ్ టయోటా కొత్త కారు వచ్చేస్తుంది.. ఊహించిన దానికంటే తక్కువ ధర!

ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) ఇప్పుడు భారత మార్కెట్ల ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. టయోటా ఇప్పటివరకు హైబ్రిడ్, పేట్రోల్ కార్ల విభాగంలో విజయవంతమైన మోడళ్లను అందించింది. కానీ ఇప్పుడు కంపెనీ దృష్టి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విభాగంపై పడింది. భారతదేశంలో పెరుగుతున్న EV డిమాండ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వినియోగదారుల ఆసక్తిని గమనించి, టయోటా ఇప్పుడు కొత్త అర్బన్ క్రూయిజర్ ఈవీ (Urban Cruiser EV)ను లాంచ్ చేయబోతోంది. ఈ కారు రూపకల్పన, పనితీరు, సౌకర్య పరంగా పూర్తి స్థాయి ప్రీమియం ఫీలింగ్‌ను అందించడానికి రూపొందించబడింది. ఇందులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా విశాలమైన కేబిన్ స్పేస్‌ను అందిస్తారు.

సాంకేతికంగా, ఇది మారుతి సుజుకి e-విటారా (Maruti Suzuki e-Vitara) ఆధారంగా రూపొందించబడుతుంది. అంటే, రెండు కంపెనీలు కలిసి రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ SUVలో టయోటా వెర్షన్ మరింత ఫినిష్డ్ డిజైన్, అదనపు ఫీచర్లతో వస్తుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో టయోటా Urban Cruiser, Hyryder వంటి SUVలు మంచి స్పందన పొందాయి. ఇక ఈ Urban Cruiser EV ఆ లైనప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Toyota Urban Cruiser EV Suv Will Be Launch Soon Here Expected Features And Price

టయోటా అర్బన్ క్రూయిజర్ EV శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ ఎంపికలతో రాబోతోందని సమాచారం. టయోటా ఈ ఎలక్ట్రిక్ SUVను రెండు వేర్వేరు బ్యాటరీ వెర్షన్‌లలో అందించవచ్చని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి 49 kWh బ్యాటరీ ప్యాక్, మరొకటి 61 kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండు బ్యాటరీల పనితీరుతో కూడా Urban Cruiser EV వినియోగదారులకు గరిష్ట సామర్థ్యాన్ని అందించగలదని అంచనా.

టయోటా ఈ కారును అత్యాధునిక ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సాంకేతికతతో రూపొందిస్తోంది. దీని బ్యాటరీ సిస్టమ్ అధునాతన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని, దీని వల్ల వేడి నియంత్రణ, బ్యాటరీ లైఫ్‌టైం మెరుగుపడుతుందని చెబుతున్నారు. పూర్తి ఛార్జ్ చేసినప్పుడు ఈ SUV 550 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని అంచనా వేయబడింది. ఇది దూర ప్రయాణాలు చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

Toyota Urban Cruiser EV Suv Will Be Launch Soon Here Expected Features And Price

ఛార్జింగ్ పరంగా కూడా ఈ కారు వేగవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ వాహనం 30 నుండి 40 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జ్ అవ్వగలదని అంచనా. దీని ద్వారా రోజువారీ డ్రైవింగ్‌తో పాటు లాంగ్ జర్నీలకు కూడా వినియోగదారులు దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు. ధర విషయానికి వస్తే, టయోటా ఈ కొత్త అర్బన్ క్రూయిజర్ ఈవీని సరసమైన ధర పరిధిలో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. ఈ ధర పరిధి భారతదేశంలో మధ్యతరగతి, ప్రీమియం వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ SUV ఫిబ్రవరి 2026లో అధికారికంగా లాంచ్ అవ్వవచ్చని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటివరకు టయోటా కంపెనీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Toyota Urban Cruiser EV Suv Will Be Launch Soon Here Expected Features And Price

ఈ కారులో ప్రయాణిలకు రక్షణకు సంబంధించి అధునాతన భద్రతా ప్రమాణాలను అందించారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు,EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), 360-డిగ్రీ కెమెరా, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఉంటాయని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 28, 2025, 10:48 [IST]
English summary
Toyota urban cruiser ev suv will be launch soon here expected features and price
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+