ఇదేం క్రేజ్ గురూ.. ఈ కారు అమ్మకాల్లో దుమ్ములేపుతుంది.. పోటీదారులకు గట్టి షాక్ ఇస్తుంది

ప్రముఖ కార్ల తయారీదారు అయినటువంటి టయోటా (Toyota) కంపెనీ అంతర్జాతీయంగా, దేశీయంగా తన సత్తా చాటుతుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొత్త కార్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (urban cruiser hyryder)కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. 2025 జూలై నెలలోనే టయోటా హైరైడర్ 8,814 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడింది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 7,419 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాల పరిమాణం 19 శాతం వృద్ధి సాధించింది. ఇది కేవలం ఒక SUV మాత్రమే కాకుండా, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతీకగా నిలుస్తోంది.

ఇది భారతీయ SUV మార్కెట్‌లో తనదైన గుర్తింపును సాధించిన మోడల్. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, ఇంధన సామర్థ్యంలో ఇచ్చే విశ్వసనీయత వలన ఈ కారు వినియోగదారులలో మంచి ఆదరణ పొందుతోంది. స్టైలిష్ లుక్‌తో పాటు, రోజువారి ప్రయాణాల్లో సౌకర్యం, దీర్ఘకాలిక పనితీరు ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV మార్కెట్‌లో బలమైన ప్రదర్శన ఇచ్చింది.

Urban Cruiser Hyryder 8814 Sales Units Recorded In July 2025

మొత్తం 29,277 యూనిట్లు విక్రయించబడగా, ఈ గణాంకాలను విభజించి చూసినప్పుడు, సగటున ప్రతి నెలా సుమారు 4,879 యూనిట్లు అమ్ముడైనట్లు తేలింది. ఈ స్థిరమైన అమ్మకాల రేటు, హైరైడర్‌కి ఉన్న ప్రజాదరణను, అలాగే SUV విభాగంలో టయోటా బ్రాండ్‌పై ఉన్న వినియోగదారుల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. పోటీ కఠినంగా ఉన్నప్పటికీ, ఆకర్షణియమైన డిజైన్, ఫ్యూయల్ వాడకం, నమ్మకమైన పనితీరు వలన హైరైడర్ తన స్థానం నిలబెట్టుకుంది.

ఇది బడ్జెట్‌ ధరలో లభించే కాంపాక్ట్ SUVగా మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షల నుండి రూ. 20.19 లక్షల మధ్య ఉండే ఈ మోడల్, శక్తివంతమైన, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. హైరైడర్‌లో 1.5-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), CNG ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT ట్రాన్స్‌మిషన్‌లలో అందించబడుతున్నాయి.

Toyota Urban Cruiser Hyryder 8814 Sales

హైరైడర్ 19 నుండి 27.97 kmpl వరకు మైలేజీని అందించగలదు, ఇది తన సెగ్మెంట్‌లో అత్యుత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. అదనంగా, 45 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉండటం వలన దూర ప్రయాణాలకూ ఇది అనువైన ఆప్షన్‌గా మారింది. ఈ కారు క్యాబిన్ కూడా బాగుంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి. దీనికి 373 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక AC వెంట్స్, USB పోర్ట్‌లు వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు అమర్చబడ్డాయి. అదనంగా, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి అధునాతన బ్రేకింగ్ సాంకేతికతలు ఉండటం వలన హఠాత్తుగా బ్రేక్ వేయాల్సిన సందర్భాల్లో కూడా కారు స్థిరంగా ఉంటుంది.

Toyota Urban Cruiser Hyryder 8814 Sales

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రోడ్డు మీద దూసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించేలా రూపొందించబడింది. ముందుభాగంలో అమర్చిన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కేవలం స్టైలిష్ లుక్ మాత్రమే కాదు, రాత్రిపూట అద్భుతమైన విజిబిలిటీని కూడా అందిస్తాయి. వాటితో సమన్వయంగా ఉన్న LED DRLలు కారు ముందు భాగానికి మరింత ప్రీమియమ్ టచ్‌ను ఇస్తాయి. మొత్తంగా ఈ కారు అద్బుతంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2025, 14:10 [IST]
English summary
Toyota urban cruiser hyryder 8814 sales units recorded in july 2025
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+