కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ వస్తుంది.. బ్లాక్ బ్యూటీ దుమ్మురేపబోతోంది!

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన వినియోగదారుల కోసం కొత్త సంచలనాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు SUV మార్కెట్లో మంచి డిమాండ్‌ను సంపాదించుకున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు మరొక ప్రత్యేక రూపంలో రాబోతోంది. ఈ సారి టయోటా, అదే విజయవంతమైన సిరీస్‌లో కొత్త వెర్షన్‌గా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్ (Urban cruiser hyryder aero edition)‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. లాంచ్‌కు ముందే విడుదల చేసిన టీజర్ చూసిన వెంటనే, ఈ కారుకు ఇచ్చిన ప్రత్యేకత స్పష్టంగా అర్థమవుతోంది. పూర్తిగా నలుపు రంగులో కప్పబడిన ఎక్స్‌టీరియర్ రూపం ఈ SUVకి మరింత శక్తివంతమైన, ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. కేవలం బయటివైపు మాత్రమే కాదు, లోపలి క్యాబిన్‌ కూడా పూర్తిగా నలుపు థీమ్‌తోనే డిజైన్ చేయబడిందని టీజర్‌లో కనిపిస్తోంది.

నలుపు కలర్‌తో మెరిసిపోతున్న కారు ఒక అద్భుతమైన స్పోర్టీ ఫీల్ రావడంతో పాటు, ప్రీమియం క్లాస్ లుక్ కూడా మరింతగా ప్రతిఫలిస్తుంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఏరో ఎడిషన్‌లో ఇచ్చిన ఈ ప్రత్యేక రంగు కాంబినేషన్, SUVకి ప్రత్యేక గుర్తింపును ఇవ్వబోతోంది. ప్రస్తుతానికి టయోటా అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు కానీ, టీజర్‌ను బట్టి చూస్తే చాలా త్వరలోనే మార్కెట్లోకి రానుందని ఆటోమొబైల్ వర్గాలు ఊహిస్తున్నాయి.

Toyota Urban Cruiser Hyryder Aero Edition Will Be Launch Soon In India

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, ఇంజిన్ ఎంపికల పరంగా కూడా వినియోగదారుల మనసు గెలుచుకునేలా తీర్చిదిద్దబడింది. ఈ SUVలో మూడు విభిన్న ఇంజిన్ ఆప్షన్లు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, CNG వేరియంట్‌లలో లభిస్తుంది. ముందుగా పెట్రోల్ వెర్షన్ గురించి చెప్పుకోవాలి. ఇది మారుతి అభివృద్ధి చేసిన 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది.

ఈ ఇంజిన్ 102 బిహెచ్‌పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్‌ను అందించే ఈ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. డ్రైవింగ్‌లో స్మూత్ ఫీల్ ఇస్తూ, రోజువారీ వినియోగానికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. తరువాత టయోటా గర్వపడే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ వస్తుంది. 1.5-లీటర్ కెపాసిటీ కలిగిన ఈ యూనిట్, ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో జతకట్టబడి ఉంటుంది.

Toyota Urban Cruiser Hyryder Aero Edition Will Be Launch Soon In India

ఈ ఇంజిన్ 116 బిహెచ్‌పి పవర్, 141 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల పెట్రోల్ ఇంజిన్ మీద కాకుండా ఎలక్ట్రిక్ మోటర్ సహాయంతో కూడిన అద్భుతమైన పనితీరు లభిస్తుంది. ఫలితంగా మైలేజీ విషయంలో కూడా ఇది అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. లీటరుకు దాదాపు 27 కి.మీ. వరకు అందించడం దీని ప్రధాన ఆకర్షణ. ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మినహాయింపులేని ఎంపికగా నిలుస్తుంది.

ఇక CNG వెర్షన్ విషయానికి వస్తే, పర్యావరణానికి హితమైన ఈ ఇంధన ఆప్షన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ కోరుకునే వినియోగదారుల కోసం సరైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇంజిన్‌లతో పాటు ఫీచర్ల జాబితా కూడా హైరైడర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. 360-డిగ్రీ కెమెరా ద్వారా డ్రైవింగ్ సమయంలో మరింత క్లారిటీ లభించగా, పనోరమిక్ సన్‌రూఫ్ కారు అంతర్గత వాతావరణాన్ని మరింత విస్తృతంగా, లగ్జరీగా మారుస్తుంది.

Toyota Urban Cruiser Hyryder Aero Edition Will Be Launch Soon In India

డ్రైవర్‌కు అనుకూలంగా పవర్-అడ్జస్టబుల్ సీటు అందుబాటులో ఉంది. అదనంగా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో సమగ్రంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కొత్త జిఎస్‌టి సవరణతో తక్కువ ధరకే వస్తుంది. ఇది రూ. 10.94 లక్షల నుండి రూ. 19.57 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య కొనుగోలుకు లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, September 28, 2025, 9:40 [IST]
English summary
Toyota urban cruiser hyryder aero edition will be launch soon in india
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+