27.97 కి.మీ మైలేజ్ ఇచ్చే టయోటా కారును జనాలు తెగ కొంటున్నారు.. ప్రతినెలా అమ్మకాల్లో దుమ్ములేపుతుంది..
ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ టయోటా(Toyota) ఆకర్షణీయమైన మోడళ్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా అధునాతన కార్లను లాంచ్ చేస్తూ, ప్రత్యర్థి కంపెనీలకు బలమైన పోటీదారుగా ఉంది. తాజాగా కంపెనీ తన ఫేవరెట్ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (urban cruiser hyryder) ఎస్‌యూవీ (Suv)కి సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. టయోటా విడుదల చేసిన డేటా ప్రకారం, 2025 జనవరి నెలలో ఈ కారు అమ్మకాల పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేసింది. ఈ సమీక్ష నెలలో ఎస్‌యూవీని దాదాపు మొత్తం 4,941 మంది కొనుగోలు చేశారు. ఇది 2024 డిసెంబర్‌లో జరిగిన 4,770 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే నెలవారీగా 3.46 శాతం వృద్ధిని సూచిస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం వాహన తయారీ కంపెనీల మధ్య బలమైన పోటీ నడుస్తోంది.
ఇలాంటి సమయంలో ఈ ఎస్‌యూవీ అన్ని సవాళ్లను తట్టుకుని సేల్స్ పరంగా మెరుగ్గా ఉండటం గమనార్హం. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు డిజైన్, ఫీచర్స్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అంతకుముందు 2024 నవంబర్ నెలలో కూడా ఈ ఎస్‌యూవీ అమ్మకాలు 4,857 యూనిట్లుగా నమోదయ్యాయి. దానికి ముందు అక్టోబర్‌లో కూడా 5,449 యూనిట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో 5,385 యూనిట్లు, ఆగస్టులో 6,534 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ప్రతినెలా టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ (urban cruiser hyryder) 4వేలకు పైగా అమ్మకాలను నమోదు చేస్తూనే ఉంది. ఇది చూడటానికి సరికొత్త స్టైల్‌తో కనిపిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ.11.14 లక్షల నుంచి మొదలుకుని గరిష్టంగా రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు, ఆన్‌రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది E, S, G, V వేరియంట్లలో లభిస్తుంది.
అర్బన్ క్రూయిజర్ హై రైడర్ 1.5 లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), అలాగే CNG ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రయాణికులు సౌకర్యంగా ఉండటానికి లోపల సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉంటయి, ఇది 5 సీటర్‌లో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, 19.39 నుంచి 27.97 kmpl వరకు అందిస్తుంది. ఎక్కువ లగేజీని తీసుకెళ్ళడానికి 373 లీటర్ల బూట్ స్పేస్ కూడా దీనిలో ఉంది.

ఇది కేఫ్ వైట్, గేమింగ్ గ్రే, స్పీడీ బ్లూ, స్పోర్టిన్ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, ఎంటైసింగ్ సిల్వర్, స్పీడీ బ్లూ కలర్స్‌లలో లభిస్తుంది. వినియోగదారులకు కావాల్సినన్ని డజన్ల కొద్ది ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. ఇంటీరియర్ అందంగా ఉంటుంది. లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ ఇంకా ఇతర ఫీచర్స్ ఉన్నాయి.
లోపల కూర్చున్న ప్రయాణికుల సేఫ్టీ విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. అత్యుత్తమైన సేఫ్టీ ప్రమాణాలు దీనిలో ఉన్నాయి. రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఇతర అధునాతన భద్రతా ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








