నెలకు రూ.21 వేలతో అదిరిపోయే కారు.. స్టైల్‌కు పెట్టింది పేరు.. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్స్

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్(Toyota Urban Cruiser Hyryder) భారత SUV మార్కెట్‌లో ఒక ప్రసిద్ధ వాహనం. ఈ SUV ఆకర్షణీయమైన డిజైన్, బలమైన బాడీ స్ట్రక్చర్‌తో ప్రతి నెలా అమ్ముడవుతూ మంచి గణంకాలను సాధిస్తుంది. నగరాల్లో, హైవే రోడ్లలో లేదా ఆఫ్-రోడ్ పరిస్థితుల్లోనైనా, హైరైడర్ బెస్ట్. దీని ధర రూ.10.95 లక్షల నుండి రూ.19.76 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. అంటే, వినియోగదారుల బడ్జెట్, అవసరాలు, వేరియంట్ల ఆధారంగా సరైన ఎంపికను చేసుకోవచ్చు. కొత్త కారు కొనడానికి ఆలోచిస్తున్న వారు, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒక ప్రత్యేక ఎంపిక అవుతుంది. ఈ SUV లో ఉన్న శక్తివంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, సాంకేతికత మీ ప్రయాణాన్ని భద్రతగా చేస్తుంది. ఈ కారు EMI ఆప్షన్లను ఒకసారి ఈ కింది కథణంలో చూద్దాం.

మొదట, E పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 13.45 లక్షలు. మీరు దీన్ని రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, రుణ మొత్తం సుమారు రూ. 10.45 లక్షలు అవుతుంది. ఈ లోన్ 9% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు చెల్లిస్తే, నెలవారీ EMI రూ. 21,600 వరకు ఉంటుంది. ఇది చిన్న బడ్జెట్ ఉన్న వినియోగదారులకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

Toyota Urban Cruiser Hyryder Variant Wise Onroad Price And Emi Details

సాధారణ S పెట్రోల్ వేరియంట్‌ను తీసుకుంటే, దీని ఆన్-రోడ్ ధర రూ. 15.29 లక్షలు. మీరు దీన్ని రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో తీసుకోవాలనుకుంటే, బాకీ లోన్ మొత్తం రూ. 12.29 లక్షలు అవుతుంది. ఈ రుణం 9% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు, నెలకు సుమారు రూ. 25,500 EMIగా చెల్లించవచ్చు. ఇది వ్యక్తిగత బడ్జెట్‌లో సులభంగా అమర్చుకునే స్థాయి.

G హైబ్రిడ్ వేరియంట్(పెట్రోల్ + ఎలక్ట్రిక్) కొరకు ఆన్-రోడ్ ధర రూ. 22.57 లక్షలు. అదే విధంగా, రూ.3 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రుణ మొత్తం రూ. 19.57 లక్షలు అవుతుంది. దీన్ని 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలంలో చెల్లిస్తే, నెలకు సుమారు రూ.40,500 EMI వస్తుంది. హైబ్రిడ్ వేరియంట్ మంచి మైలేజ్, ఎక్కువ ఫీచర్లు, సాంకేతికతతో లభిస్తుంది, అందువలన EMI కొంచెం ఎక్కువగా ఉంటుంది.

Toyota Urban Cruiser Hyryder Variant Wise Onroad Price And Emi Details

అదేవిధంగా, S CNG వేరియంట్ కొనుగోలుకు కూడా సరైన ఆప్షన్ ఉంది. ఆన్-రోడ్ ధర రూ. 16.35 లక్షలు, రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేసినట్లయితే, రుణ మొత్తం రూ. 13.35 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాల పాటు నెలవారీ EMI రూ. 27,700 ఉంటుంది, వడ్డీ రేటు 9%గా ఉంటుంది. ఈ వేరియంట్ ఇంధన సామర్థ్యాన్ని కాంబైన్ చేస్తూ, వినియోగదారికి LPG/CNG వినియోగంలో ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది.

మొత్తం మీద, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వివిధ వేరియంట్లలో పెట్రోల్, హైబ్రిడ్, CNG ఎంపికలు వినియోగదారులకు వారి అవసరాలకు తగిన దృష్టిలో సౌకర్యవంతంగా ఉంటాయి. దీనికి శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఉంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్. హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5-లీటర్ పెట్రోల్ / CNG ఇంజిన్ ఉన్నాయి. ఇది 19 నుండి 27.97 kmpl మైలేజీని ఇస్తుంది.

Toyota Urban Cruiser Hyryder Variant Wise Onroad Price And Emi Details

More from DriveSpark

Article Published On: Tuesday, October 21, 2025, 14:42 [IST]
English summary
Toyota urban cruiser hyryder variant wise onroad price and emi details
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+