కొత్త కారు కొనాలా? నెలకు రూ.13 వేలతో అదిరిపోయే కారు.. 28 కి.మీల మైలేజ్

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) నమ్మకమైన SUVల జాబితాలో తనదైన స్థానం సంపాదించుకుంది. మధ్యతరగతి నుంచి యువత వరకు అందరికీ అందుబాటులో ఉండే, శక్తివంతమైన, స్టైలిష్ SUVగా ఇది భారత మార్కెట్లో వేగంగా ఆదరణ పొందుతోంది. టయోటా విశ్వసనీయత, బలమైన బాడీ క్వాలిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కలగలిపిన ప్యాకేజీగా టైజర్‌ను మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన మోడల్‌గా నిలిపాయి. ఇటీవల GST రేట్ల సవరణ ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊపిరి అందించింది. సెప్టెంబర్ 22 నుండి కొత్త GST రేట్లు అధికారికంగా అమలులోకి వచ్చాయి, దీని ప్రభావం టయోటా వాహనాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పుతో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ధర రూ.1.12 లక్షల వరకు తగ్గించబడింది.

అంటే, ఇదే SUV ఇప్పుడు మరింత తక్కువ ధరలో లభిస్తోంది. ప్రస్తుతం టైజర్ SUV ధర రూ.7.21 లక్షల నుండి రూ. 12.06 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ రేంజ్‌లో లభించే వేరియంట్లు వినియోగదారుల వేర్వేరు అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. పండుగ సమయంలో కొత్తగా ఈ కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ కారు వేరియంట్ల వారీగా ఆన్‌రోడ్ ధర, EMI వివరాలు చూద్దాం.

Toyota Urban Cruiser Taisor New Onroad Price And Emi Details

ప్రస్తుతం టైజర్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటగా, E(పెట్రోల్) వేరియంట్ గురించి చెప్పుకుంటే, దీని ఆన్-రోడ్ ధర రూ.8.61 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఈ కారు కొనుగోలు చేస్తే, బ్యాంక్ నుండి సుమారు రూ.6.61 లక్షల రుణం పొందవచ్చు. 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి నెలవారీ EMI సుమారు రూ.13,500 అవుతుంది. తక్కువ పెట్టుబడితోనే కారును సులభంగా సొంతం చేసుకోవచ్చు.

తర్వాత, S (పెట్రోల్) వేరియంట్‌కి వస్తే, దీని ఆన్-రోడ్ ధర రూ.9.53 లక్షలు. ఇదే విధంగా రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో తీసుకుంటే, మిగతా రూ.7.53 లక్షల రుణం అవసరం అవుతుంది. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు నెలకు సుమారు రూ.15,500 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొంత మెరుగైన ఫీచర్లు కలిగిన S ప్లస్ (పెట్రోల్) వేరియంట్‌కి ధర రూ.9.92 లక్షలు.

Toyota Urban Cruiser Taisor New Onroad Price And Emi Details

దీని కోసం రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రూ.7.92 లక్షల రుణం తీసుకోవాలి. నెలవారీ EMI సుమారు రూ.16,400 వరకు ఉంటుంది.
ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇష్టపడేవారికి S ప్లస్ AMT (పెట్రోల్) వేరియంట్ మంచి ఎంపిక అవుతుంది. దీని ఆన్-రోడ్ ధర రూ.10.54 లక్షలు. రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో రుణం రూ.7.94 లక్షల వరకు వస్తుంది. నెలవారీ EMI సుమారు రూ.17,500గా ఉంటుంది.

ఇక ఇంధన వ్యయం తగ్గించాలనుకునేవారికి E (CNG) వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ఆన్-రోడ్ ధర రూ.9.66 లక్షలు. రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, రూ.7.66 లక్షల రుణం అవసరం అవుతుంది. అదే 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి నెలవారీ EMI సుమారు రూ.16,000గా ఉంటుంది.

Toyota Urban Cruiser Taisor New Onroad Price And Emi Details

మొత్తంగా, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ SUV శైలి, పనితీరు, భద్రత, ఆర్థికత అన్నింటినీ సమతుల్యంగా కలిపిన మోడల్. పెట్రోల్,CNG వేరియంట్లలో అందుబాటులో ఉండటం, తక్కువ EMIతో సులభంగా సొంతం చేసుకోవచ్చు అనే విషయం ఈ కారును మధ్యతరగతి కుటుంబాలకూ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారణంగా టైజర్ ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా చర్చనీయాంశమైన SUVలలో ఒకటిగా నిలుస్తోంది.

ఈ SUV 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. దీని మైలేజ్ విషయానికి వస్తే, SUV అద్భుతంగా నిలుస్తుంది. వేరియంట్ ఆధారంగా 19 నుండి 28 kmpl వరకు అందిస్తుంది. పనితీరు పరంగా కూడా తగ్గదు. గరిష్టంగా 175 kmph వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు, ఈ కారు 0 నుండి 100 kmph వేగాన్ని కేవలం 10.98 సెకన్లలో చేరుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2025, 14:29 [IST]
English summary
Toyota urban cruiser taisor new onroad price and emi details inside
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+