కస్టమర్లకు షాక్ ఇచ్చిన టయోటా.. వారికి ఎంతగానో నచ్చిన ఎస్‎యూవీ ధర భారీగా పెంపు

జపాన్ కు చెందిన ప్రసిద్ద ఆటో మొబైల్(Auto Mobile) కంపెనీ టయోటా(toyota). ఈ కంపెనీ తయారు చేసిన కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టయోటా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి వదులుతుంది. ఈ కంపెనీ కొత్త టెక్నాలజీ సాయంతో కార్లను డిజైన్ చేసి తన ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతూనే ఉంటుంది. అలాంటి కంపెనీ భారత్ లో పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీతో పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి కంపెనీ వృద్ధి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో భారీ సంఖ్యంలో కార్లను అమ్ముతోంది. కస్టమర్లు కూడా ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో టయోటా కంపెనీ అమ్ముతున్న కార్లతో సంగం రీబ్యాడ్జ్ కార్లే.

టయోటా కంపెనీ ఖరీదైన కార్లతో పాటు మిడిల్ క్లాస్ వాళ్ల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను కూడా తయారు చేస్తుంది. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ సాయంతో తక్కువ ధరలో కార్లను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో టయోటా కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. టయోటా కారును కొనాలన్న ఉత్సాహంతో ఉన్న వాళ్లు ఇక మీదట కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Toyota Urban Cruiser Limited Edition

టయోటా కిర్లోస్కర్ మోటర్ మార్చి నెలలో కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ ధరలను సవరించింది. ఈ జాబితాలో భారత్‎లో పాపులర్ అయిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ కూడా ఉంది. అర్బన్ క్రూయిజర్ టైజర్ కొత్త ధర రూ.7.74లక్షల నుంచి రూ.13.04లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ధరలు ఆ మోడల్ ఎక్స్ షోరూం ధరలు మాత్రమే. టయోటా సబ్ 4మీటర్ ఎస్ యూవీ ధర రూ.5,500వరకు పెంచింది కంపెనీ.

ఎస్ ఏఎంటీ, ఎస్ + ఏఎంటీ వేరియంట్ల ధరలను రూ.5,500 పెంచారు. టైజర్ అనేది మారుతి సుజుకీ ఫ్రాంచైజీకి టయోటా కంపెనీ రీబ్యాడ్జ్ చేసిన మోడల్. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ను నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో E, S, G, V ఉన్నాయి. ఇది 8 కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. పండుగ సీజన్‌లో లిమిటెడ్ ఎడిషన్ ను కూడా రిలీజ్ చేసింది.

Toyota Urban Cruiser Taisor Seating

మారుతి కంపెనీ ఫ్లాట్ ఫామ్ పై ఉండడం వల్ల టైజర్ కూడా ఫ్రాంక్స్ సైజులోనే ఉంటుంది. ఈ మోడల్ ను ప్రత్యేకంగా చూపించేందుకు కంపెనీ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా మార్చేసింది. కూపే మాదిరి సబ్-కాంపాక్ట్ SUV బ్లాక్ కలర్ లో.. కొత్త హనీ కాంబ్ మెష్ గ్రిల్ ను అందిస్తోంది. మధ్యలో టయోటా లోగోతో కొత్త డ్యూయల్ LED DRLలతో వస్తుంది.

దీనిలో కొత్తగా డిజైన్ చేసిన స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. క్యాబిన్ లో 9ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ మధ్యలో ట్విన్ పాడ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. క్యాబిన్ లో డ్యూయల్ టోన్ తో రాబోతుంది. అంతే కాకుండా ఈ కారులో ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 360డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లతో వస్తుంది.

Toyota Urban Cruiser Taisor Featers

దీనిలో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఉంటుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్ తో వస్తుంది. దీని 1.2 ఇంజన్ 89 bhp పవర్, 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోచార్జ్ డ్ యూనిట్ 99 bhp పవర్, 148 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పెట్రోల్ వేరియంట్ 20 నుండి 22.8 కి.మీ. మైలేజీని, సీఎన్జీ వేరియంట్ 28.5కి.మీ. వరకు మైలేజ్ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2025, 12:58 [IST]
English summary
Toyota urban cruiser taisor price hike up to rs 5500 with 28 5 kmpl mileage
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+