దేశీయ వినియోగదారుల హార్ట్‌ఫేవరెట్ కారు.. మిడిల్‌క్లాస్‌ కోసం బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇస్తుంది!

దేశీయ కార్ల మార్కెట్లో దూసుకుపోతున్న సంస్థలలో టయోటా ఒకటి. వినియోగదారుల్లో నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ జపాన్‌కు చెందిన తయారీదారు, భారత మార్కెట్‌లో ఇన్నోవా, గ్లాంజా, ఫార్చ్యూనర్, రుమియన్ వంటి మోడళ్లతో బాగా ప్రసిద్ధి పొందింది. టయోటా మోడళ్లకు డిమాండ్ ఎప్పటికీ తక్కువ కాదు. తాజాగా కంపెనీ గత నెల అంటే, ఏప్రిల్ 2025లో సాధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, టయోటా మరోసారి తన మార్కెట్‌ స్థిరత్వాన్ని రుజువు చేసింది. మొత్తం 24,833 కార్లను విజయవంతంగా డెలివరీ చేసింది. ఈ సంఖ్య చూస్తేనే కంపెనీకి వినియోగదారులలో ఎంతటి ఆదరణ ఉందో అర్థం అవుతుంది. ఈ మొత్తంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అమ్ముడైన మోడల్‌ అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) కూడా కీలక పాత్ర పోషించింది.

ఇది గత కొన్ని నెలలుగా క్రమంగా టయోటా అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఏప్రిల్‌లో 2,421 యూనిట్లు అమ్ముడుపోయి కంపెనీ సేల్స్ పెరగడానికి బాగా ఉపయోగపడింది. ఇది మార్చి నెలతో పోలిస్తే తక్కువ. డేటా ప్రకారం, ఈ నెలలో 3,468 యూనిట్లు అమ్ముడుపోయింది. దానికి ముందు ఫిబ్రవరిలో 3,604 యూనిట్లు, జనవరిలో 2,470 యూనిట్ల అమ్మకాలతో అర్బన్ క్రూయిజర్ టైజర్ SUV స్థిరమైన డిమాండ్‌ చూపెడుతుంది.

Toyota Urban Cruiser Taisor Design

వాస్తవానికి, టయోటా 'టైజర్' SUV మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి యువతలో, మిడిల్ క్లాస్ కొనుగోలుదారులలో ఆదరణ పొందుతోంది. దాని మల్టీ-ఫంక్షనల్ డిజైన్, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు, బ్రాండ్ విలువ అన్ని కలిసి ఈ కారును ఫ్యామిలీ కారుగా మార్చాయి. ఈ వేగంగా పెరుగుతున్న అమ్మకాలు, టయోటా మార్కెట్లో పట్టు ఇంకా గట్టిగా ఉందని, ప్రత్యేకించి SUV విభాగంలో తనదైన గుర్తింపుతో ముందుకు సాగుతోందని తేలుస్తున్నాయి.

టయోటా 'అర్బన్ క్రూయిజర్ టైజర్' SUV ఇటీవల దేశీయ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. నెలనెలా సగటున 2,500 యూనిట్లు అమ్ముడవుతుండటం చూస్తేనే, ఈ కారుకు ఉన్న ఆదరణ ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. ఈ SUV నిజానికి 'మారుతీ సుజుకీ ఫ్రాంక్స్' మోడల్‌ను ఆధారంగా చేసుకుని టయోటా రీ-బ్యాడ్జ్ చేసి విడుదల చేసిన వెర్షన్. అయితే, టయోటా తనదైన బ్రాండ్ నమ్మకం, స్టైలింగ్‌‌తో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.

Toyota Urban Cruiser Taisor Suv

వినియోగదారుల దృష్టిలో ఇది కేవలం మరో రీబ్రాండెడ్ కారు కాదు, ఒక నమ్మదగిన SUVగా మారింది. ధర పరంగా చూసుకుంటే, ఇది SUV సెగ్మెంట్‌లో అత్యంత బడ్జెట్‌గా నిలుస్తోంది. రూ. 7.74 లక్షల ప్రారంభ ధరతో, గరిష్టంగా రూ. 13.04 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరలో లభ్యమవుతోంది. దీని డిజైన్ అందంగా ఉంటుంది. బోల్డ్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్స్, కాంపాక్ట్ SUV డైనమిక్స్‌ కలసి దీన్ని ఆకర్షణీయమైన కారుగా మార్చాయి.

స్టైల్ కోరుకునే ఫ్యామిలీలకు సరిపోయేలా ఆరెంజ్, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, గేమింగ్ గ్రే వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ SUV బలమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది, మల్టీ లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫొటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ ఆప్షన్లు, సేఫ్టీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ఈ కారులో ఉన్నాయి. ఇది శక్తివంతమైన మూడురకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Toyota Urban Cruiser Taisor

1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్, మైలేజీతో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. రెండోది 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది మరింత స్పోర్టీ డ్రైవింగ్‌ను కోరుకునే వారికి అనువైనది. మూడవది 1.2 లీటర్ CNG వేరియంట్, ఇది తక్కువ ఇంధన ఖర్చు కోరుకునే వినియోగదారులకు ఒక ఆర్థికంగా ప్రయోజనకరమైన ఎంపిక. ఇవి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 26, 2025, 17:20 [IST]
English summary
Toyota urban cruiser taisor suv 2421 sales units recorded in april 2025
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+